[dropcap]‘సం[/dropcap]చిక – పద ప్రతిభ’కి స్వాగతం.
సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
1. నఖశిఖపర్యంతం (6). |
6. పోకచెట్టు (2) |
8 తనుత్రాణము (3) |
10. ఇత్తడిమూఁకుడు (2) |
13. సమానము (2) |
14. వాడో రకం వీడో రకం మరి మీరే రకం? రత్న కంబళి కావాలంటే తేల్చి చెప్పండి. (3) |
16. ఇల్లు (3) |
18. మెల్లకంటివాడు కనిపించాలంటే శ్రీ వేంకటేశ్వరుడు కరుణించాలి – 467 సార్లు (3) |
19. హుందాగా (3) |
20. జాకెట్టు కాదండీ – కుదువ బెట్టండి (3) |
21. కళావాచస్పతి జగ్గయ్యగారి ఇంటిపేరు (3) |
22. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరు ప్రఖ్యాత క్షేత్రములలో నాలుగవది – చెల్లాచెదురైంది (3) |
23. తలగడలో చిమిడిన అన్నం (3) |
24. సన్నని వస్త్రము (3) |
25.నిలువవే వాలు కనులదానా వయ్యారి హంస —– దానా అని జమునగారిని చూసి ఏఎన్నార్ గారి పాట (3) |
26. లోపించినది (3) |
28. దుఃఖము, భయము (3) |
30. అమృతం (2) |
32. కాంగ్రెస్ గుర్తు అటునించి (2) |
34. ధృతరాష్ట్రుని ఆఖరి బావమరిది (3) |
37. పండితుడు (2) |
38. సూర్యుడు చంద్రుడు నక్షత్రములు ఉన్నంతవరకు (6) |
నిలువు:
2. బెల్లము మొదలగు వాటిలో చేసిన చిక్కటి ద్రవము (2) |
3. తోకలేని మొసలి (2) |
4. స్తుతి (3) |
5. పడుకునేదానికి కాదండీ బాబూ తినడానికి (2) |
6. ఒకానొక భక్ష్యవిశేషము- ఒరిస్సా లోనే కాదు – మనవూరిలో కూడా దొరుకుతుంది (2) |
7. ముద్దబంతి పూలు పెట్టి మొగలి రేకులు సిగను చుట్టిన చిట్టెమ్మ గూర్చి ఎన్టీఆర్ గారు పాడిన పాట ఈ సినిమాలోనిదే – మొదట్లో కాస్త మిస్సింగ్ (9) |
9. ఇది చెప్పి విభీషణుడు వాళ్ళ నగరానికే కీడు తెచ్చాడు అని అర్థం వచ్చే సామెత (9) |
11. గాడిదను తలపించే ఒక తెలుగు సంవత్సరం పేరు (2) |
12. దావానలంలో వ్యాజ్యము వెదుకుతున్నారా?(2) |
14. ఇవన్నీ ఎక్కితేనే గాని ప్రత్యక్ష దైవం కనిపించడు మరి! (5) |
15. సింహమే కాదు పావురం కూడానట (5) |
16. గుఱ్ఱము (5) |
17. మన్మథబాణవిశేషము లోనుంచి ప తీసేస్తే పిల్లలని అర్థం (5) |
27. కిందనించి పైకి ఏడు! |
29. గాలికి కులమేదీ అనే హిట్ సాంగ్ ఈ సినిమాలోదే – శివాజీ గణేశన్ , దేవిక నటీనటులు. (2) |
31. గజనిమ్మ (3) |
33. నగారా (2) |
34. క్రిందనుంచి పైకి వెళ్లిన కోరిక (2) |
35. కలలు కనాలంటే ఇది పట్టాలిగా! (2) |
36. ఆజ్ఞ (2) |
మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2022 జూలై 19వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సంచిక – పద ప్రతిభ 19 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2022 జూలై 24 తేదీన వెలువడతాయి.
సంచిక – పద ప్రతిభ 17 జవాబులు:
అడ్డం:
1.బుడతకీచులు 6. దుగ్ధం 8. తక్కటి 10. గజం 13. నానా 14.ముదిని 16. ఆకాంక్ష 18. కడఖ 19. రజకా 20 పదబం 21. వీణంక్ష 22. శరణ 23. రుక్మిణి 24. రేణువా 25. కురఏ 26. యశాఖ 28.ణిజుడు 30. కబ్బం 32. ధాటి 34. మూగది 37. కుని 38. కలిమిలేములు
నిలువు:
2.డబ్బు 3. కీత 4. చుక్కలు 5. లుటి 6. దుర్గ 7. జగదేకవీరుని కథ 9. ఈనాటి బంధం ఏనాటిదో 11. బొంది 12. మకాం 14. ముఖవీణియ 15. నిరక్షరేఖ 16. ఆకాశవాణి 17. క్షపణకుడు 27. శాల 29. జున్ను 31. నాగలి 33. ముని 34. మూక 35. దిమి 36. వాము
సంచిక – పద ప్రతిభ 17 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- అనూరాధ సాయి జొన్నలగడ్డ
- అరుణరేఖ ముదిగొండ
- బయన కన్యాకుమారి
- భాగవతుల కృష్ణారావు
- సిహెచ్.వి.బృందావనరావు
- ద్రోణంరాజు వెంకట నరసింహారావు
- ద్రోణంరాజు మోహనరావు
- ఎర్రోల్ల వెంకటరెడ్డి
- కోట శ్రీనివాసరావు
- మధుసూదనరావు తల్లాప్రగడ
- పి.వి.ఆర్. మూర్తి
- రంగావఝల శారద
- రామలింగయ్య టి
- శంభర వెంకట రామ జోగారావు
- శిష్ట్లా అనిత
- శ్రీనివాసరావు సొంసాళె
- తాతిరాజు జగం
- వర్ధని మాదిరాజు
వీరికి అభినందనలు.
గమనిక:
ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.