సంచిక – పద ప్రతిభ – 26

0
7

‘సంచిక – పద ప్రతిభ’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. God only knows అనేది తెలుగులో వ్రాస్తే ఈ సామెత కనిపిస్తుంది (11)
8. సమిధను ఇలా కూడా అనవచ్చు – చినుకు మాత్రం కాదు మరి  (3)
9.వలస పోవువాడు (4)
10. కలహభోజనుడు – కుడి నుంచి ఎడమకు (4)
11. చంటిపిల్లలు ఇవి వేసినపుడు అరిసెలు పంచటం ఒక వేడుక – ఏకవచనంలో కనుక్కో (3)
13.అర్థరాత్రము – బూడిద కాదు (2)
15. తలకాయలేని దుర్యోధనుని మేనమామ! (2)
16. కుడినుంచి ఎడమకి ఏకవచనంలో సోపానము (2)
18. అంతములేని రంధ్రము (2)
19. శాఖ  కాని శిఖ (4)
20. ప్రధాన పురుషుడు (4)
21. రాట్నంతో ప్రత్తిని వడికితే వచ్చేది (2)
22. ఏనుగు (2)
24. దీవి (2)
25. రాయలసీమ మాండలికంలో కుడినించి ఎడమకి అంగడి   (2)
27. పాము (3)
30. స్వభావము (4)
31. వీటిల్లో ఉన్న చిలకమ్మా చిన్న మాట వినరావమ్మా అని బ్లాక్ అండ్ వైట్ సినిమాలో పాట (4)
32. జన్మ కుండలి (3)
34. వడ్లతో  మొదలయ్యే సామెత (11)

నిలువు:

1. లోకువ తో కూడిన సామెత (11)
2. ఆంధ్రుల దోశె  తలక్రిందులుగా (4)
3. చవి (2)
4. మేనమామ (4)
5. చివర కొమ్ము లేని అసూయ కిందనుంచి పైకి వెళ్ళింది (2)
6. ఎదిరించడం కాదండీ బాబూ తెలియజేయడం  (4)
7. కసితో మొదలైన సామెత (11)
11. అవని లో యుద్ధము (2)
12. రహస్యం (2)
14. గుండెకు రక్తాన్ని చేరవేసే నాళాలు (3)
15. సంతోషం తనలో దాచుకున్న తెల్ల కలువ (3)
17. మెత్తని స్వభావము (3)
18.  భగవంతుని స్థూల దేహం (3)
23. తిరగబడిన భర్త (2)
24. కలయిక (2)
26. శుభకార్యానికి  ఇంటి గుమ్మానికి కట్టమంటే తలక్రిందులుగా ఎందుకు కట్టావురా ? (4)
28. ———– ముద్ద చెంగల్వ పూదండ అని తెలుగు వారి నర్సరీ రైమ్ — కాకపోతే మొదటి నాలుగు అక్షరాలు  రివర్సు లో.. (4)
29. ఈ బడిలో వ్యవసాయము చేస్తారా? (4)
32. గురుతు (2)
33. తోకలేని ముల్లు (2).

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2022 సెప్టెంబరు 06వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సంచిక – పద ప్రతిభ 26 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2022 సెప్టెంబరు 11 తేదీన వెలువడతాయి.

సంచిక – పద ప్రతిభ 24 జవాబులు:

అడ్డం:   

1.అంబిక 3. కాళోజీ 5. శ్రీపతి 7. ఠక్కురం 8. తండులం 9. లిప్తము 11. కనుమ  12. తొడుకుసామి  14. నెమలి  15. నుసుము  17. మేన  18 కుటి 19 పూప 20. తమ్మి  21. రురుడు  23 పోలిక  25. పురుహూతిక  27. కుటపం  29. సుమిత్ర  30. చాంద్రము 32. మంకెన్న 33. టలుగం 34. కులుకు  35. ముగుద

నిలువు:

1.అంబాలిక 2. కఠము 3. కారం 4. జీతం  5. శ్రీలంక  6. తిరుమల  10. భృకుటి  12. తొలికుడుపు  13. మినుపపోక  14. నెనరు  16. ముతక  22. ఆహూతి  24. పీకులాట  26.  మిత్రవింద  28. పంచాంగం  29. సున్నము 31. ముకు  32. మంకు

సంచిక – పద ప్రతిభ 24కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • అనూరాధ సాయి జొన్నలగడ్డ
  • అరుణరేఖ ముదిగొండ
  • చెళ్ళపిళ్ళ రామమూర్తి
  • ద్రోణంరాజు మోహనరావు
  • ద్రోణంరాజు వెంకట నరసింహారావు
  • ఎర్రోళ్ల వెంకటరెడ్డి
  • కోట శ్రీనివాసరావు
  • మధుసూదనరావు తల్లాప్రగడ
  • పడమట సుబ్బలక్ష్మి
  • పి.వి.ఆర్. మూర్తి
  • రంగావఝల శారద
  • రామలింగయ్య టి
  • శిష్ట్లా అనిత
  • శ్రీనివాసరావు సొంసాళె
  • తాతిరాజు జగం‌

వీరికి అభినందనలు.

గమనిక:

ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here