సంచిక – పద ప్రతిభ – 29

0
9

[dropcap]‘సం[/dropcap]చిక – పద ప్రతిభ’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. రెండు నాలున్న ఒక రాగం (6)
4. ఇది 39వది – సగం నమ్మకం మిగతాది బంగారం (4)
8. జనకుడు – అయ్య కాదు! (2)
9. సత్యాసత్యాలు (5)
11. కపోలము (2)
13. తానాకి ఇదికూడా చేరిస్తే మరి వంతపాటే (3)
15. నాటకమే – చిన్నది (3)
16. రంభాఫలముల గుత్తి (4)
18. అపరిమితము (3)
19. సన్నాయివాద్యము లో 4356 (4)
20. గుఱ్ఱపుతలలో ఉంచు తురాయి. (3)
21. చేసే పధ్ధతి (3)
24. కొంచెము నిజముగల్గి కల్పితమైన వృత్తాంతము (2)
25. శ్రీకృష్ణుని ఇలా కూడా పిలుస్తారు (5)
26. ఇది ఎవరిదైనా గానమే – సర్కారువారితో సహా (2)
29. ఇది తిరుగు లేనిదే కానీ కుడినించి ఎడమకి తిరిగింది (4)
30. సరదా సరదా సిగిరెట్టు పాట ఈ సినిమాలోనిదే (6)

నిలువు:

1. శ్రీకృష్ణుని అష్ట భార్యలలో ఒకర్తె – అయిదవది. (4)
2. వేల్పు (2)
3 .జతువు (4)
5. ఊపిరి (2)
6. ఇంద్రనీలమణి (6)
7. ధనాగారము (3)
10. ఆలస్యం అమృతం విషం అనే నానుడికి పూర్తి విరుద్ధమైన మరొక నానుడి (7)
12. ఇవ్వన్నీ 14 నిలువులో దాని గురించే (5)
14. తిండి కోసమే (5)
17. బాలాజీగారి పెళ్లి (6)
21. రుక్మిణీదేవి పుట్టిల్లు (3)
22. విష్ణుఖడ్గము (4)
23. 1979లో విడుదలైన ఈ సినిమాలో ఆకుచాటు పిందె తడిసె అన్న పాట పెద్ద సంచలనం రేపింది.(4)
27. స్టార్ మహిళ స్టార్ (2)
28. హిందీవారి వదిన (2)

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2022 సెప్టెంబరు 27వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సంచిక – పద ప్రతిభ 29 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2022 అక్టోబరు 02 తేదీన వెలువడతాయి.

సంచిక – పద ప్రతిభ 27 జవాబులు:

అడ్డం:   

1.అల్లసానివారి 4. కాళిదాసు 8. గొంగ 9.దేరుదుముశ 11. పర్ణ 13. గన్నేరు 14. భవుడు 16. గజడద 18. కడిమి 19. కుతపము 20. వారాశి  21. మాభూమి 24. చెట్టు  25.నా సామి రంగా 26.  మరా 29. వురుత్తచి 30. అభూతకల్పన

నిలువు:

1.అరగొండ 2. సామం 3. వాడురుగ 5. ళికే 6. సువర్ణసుందరి  7. చమురు  10. దున్నే వాడిదే భూమి 12. దేవులపల్లి 14. సం జ ధు రా డు 17. పకురా చెడేవు 21. మాసాలు  23. ఆరాధన  27.మొత్త 28. టీక

సంచిక – పద ప్రతిభ 27 కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • అనూరాధ సాయి జొన్నలగడ్డ
  • అరుణరేఖ ముదిగొండ
  • బయన కన్యాకుమారి
  • భాగవతుల కృష్ణారావు
  • చెళ్ళపిళ్ళ రామమూర్తి
  • సిహెచ్.వి.బృందావనరావు
  • ద్రోణంరాజు వెంకట నరసింహారావు
  • ద్రోణంరాజు మోహనరావు
  • ఎర్రొల్ల వెంకట్‌రెడ్డి
  • కోట శ్రీనివాసరావు
  • మధుసూదనరావు తల్లాప్రగడ
  • పడమట సుబ్బలక్ష్మి
  • పి.వి.ఆర్. మూర్తి
  • రంగావఝల శారద
  • రామలింగయ్య టి
  • శంభర వెంకట రామ జోగారావు
  • శిష్ట్లా అనిత
  • శ్రీనివాసరావు సొంసాళె
  • తాతిరాజు జగం‌
  • వర్ధని మాదిరాజు

వీరికి అభినందనలు.

గమనిక:

ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here