సంచిక – పద ప్రతిభ – 68

0
11

[dropcap]‘సం[/dropcap]చిక – పద ప్రతిభ’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. ఇంద్రియనిగ్రహము (4)
4. భయంకరము తడబడింది (4)
7. నిగ్గులు ఏకవచనంలో (5)
9. ఏనుగు క్రొవ్వు (3)
11. లేత కానిది – రెండు కొమ్ములున్నా లేకున్నా! (3)
13. గ్రంథి – సంధి – కలహము (2)
14. సరస్వతి (3)
16. అడ్డం 9 లాంటిదే – మొదలు లేకుండా (2)
17. సర్రోగేట్ ప్రెగ్నన్సీ విషయం మీద 2022 లో వచ్చిన సమంత సినిమా (3)
18. చీల్చుట లో కాస్త అటు ఇటు అయ్యింది (3)
19. దీనిని ఆమ్రేడిస్తే గబగబా అనే అర్థం! (2)
20. అటునుండి చూస్తే గుడిలో ర లేదు (3)
22. మినహాయింపు ఇద్దామంటే రాలేదు!  (2)
24. బ్రతుకు; పరితపించు (3)
26. మూడొంతులే ఉన్న భార్య చెల్లెలు కలగాపులగమయ్యింది (3)
27. చిరునవ్వు (5)
30. వాసనగల మూలికావిశేషము కొరకు ఆ వైపు నుండి వెతకండి (4)
31. చాలా పెద్ద హిట్టయిన రజనీకాంత్ సినిమా – తెలుగులోకి డబ్బింగ్ చేయబడినది (4)

నిలువు:

1. విల్లు (4)
2. పడమరగాఁ బాఱెడి యేఱు (3)
3. చంద్రగుప్తుని తల్లి (2)
4. వెల (2)
5. దేశ్యమైతే అందము; అన్యదేశ్యమైతే డబ్బు (3)
6. కాగితముల కట్ట (4)
8. నెల్లూరు లో తెలంగాణములో – క్రింద, పైన ఒకేకొలత గలిగిన లోహపాత్ర (3)
10. క్రిక్కిఱిసియుండు (5)
12. అద్దములు (5)
14. లేతపచ్చిక (3)
15. చిలికి చిలికి కవ్వపు కొండ ముందుభాగం వెనక్కి పోయింది (3)
19. అణచబడినది (4)
21. అకస్మాత్తుగా కలిగినది – ఆపత్తు కావచ్చు – కనుక కొంచెం తొట్రుపాటు పడి ఉండవచ్చు (3)
23. శ్రీమతి నల మహారాజు గారు (4)
25. పశువుల మేతకుగాను ప్రత్యేకించిన పొలం – దీనిని సూచించటానికి ఈతకంపలు అక్కడక్కడ గుచ్చి ఉంచుతారు (3)
26. అడ్డం 31 కి సంబంధిచినదే – చెల్లా చెదురైనట్టుంది (3)
28. పల్లు – చీరది కాదు (2)
29. ఆకు మీది నూగు (2)

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2023 జూన్ 27తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సంచిక – పద ప్రతిభ 68 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2023 జూలై 02 తేదీన వెలువడతాయి.

సంచిక – పద ప్రతిభ 66 జవాబులు:

అడ్డం:   

1.మాళవి 3. కాత్యాయని 5. ముత్తైదువ 6. డిడుతుపం 8. డియముక 11. లికడ 12. లుముగయు 15. మునపలే 16. ముహూర్తము 17. రసజ్ఞులు 18. సకృత్తు

నిలువు:

1.మాటవెండి 2. విముక్తము 3. కావడికుండలు 4. నిక్షేపం 7. తుల్యభాగ 9. యజమున 10. కలిమిలేములు 13. ముసముస 14. యుధాజిత్తు 15. ముదర

సంచిక – పద ప్రతిభ 66 కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • అనూరాధ సాయి జొన్నలగడ్డ
  • అరుణరేఖ ముదిగొండ
  • బయన కన్యాకుమారి
  • చెళ్ళపిళ్ళ రామమూర్తి
  • సిహెచ్.వి.బృందావనరావు
  • ద్రోణంరాజు వెంకట నరసింహారావు
  • ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
  • ఎర్రొల్ల వెంకట్ రెడ్డి
  • కాళీపట్నపు శారద
  • కోట శ్రీనివాసరావు
  • మధుసూదన రావు తల్లాప్రగడ
  • మత్స్యరాజ విజయలక్ష్మి
  • పడమట సుబ్బలక్ష్మి
  • పి.వి.ఆర్. మూర్తి
  • రంగావఝల శారద
  • రాయపెద్ది అప్పాశేషశాస్త్రి
  • రామలింగయ్య టి
  • శంభర వెంకట రామ జోగారావు
  • శిష్ట్లా అనిత
  • వనమాల రామలింగాచారి
  • వర్ధని మాదిరాజు
  • విన్నకోట ఫణీంద్ర
  • వీణ మునిపల్లి

వీరికి అభినందనలు.

గమనిక:

ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here