సంచిక – పద ప్రతిభ – 7

0
11

[dropcap]‘సం[/dropcap]చిక – పద ప్రతిభ’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. పుట్టపర్తి నారాయణాచార్యులు గారి బిరుదు (6)
4.వెనుక నుంచి దొర్లుకుంటూ ముందుకొచ్చిన ఉండ్రము (4)
8. ధన్యురాలు/ పుణ్యవతి (2)
9. నమస్కారములు (5)
11. గంధము తీసెడు రాయి (2)
13. హెచ్చు – నరకం కాదు బాబూ (3)
15. చిలుక (3)
16. సురనది (4)
18.  దుర్యోధనుడికి ఇలా పిలువబడడం ఇష్టం (3)
19. అరటి చెట్టు / మోక్షము (4)
20. అవ్వకవ్వ (3)
21.  పరశురాముని తల్లి (3)
24. వడ్డాణము – పగ  కాదు   (2)
25. బట్టలు చెల్లాచెదురయ్యాయి (5)
26. దెబ్బ  కాదండోయ్ – ఒక నక్షత్రము (2)
29. చీపురుకట్ట – నూరుమొగములున్నట్టా  దీనికి? (4)
30. నగలు / ఉపమాది రచనా వైచిత్రి (6)

నిలువు:

1. మంచి త్రోవ (4)
2. శుభము / కొంతకాలంగా సాగిస్తూ వచ్చిన కార్యకలాపాలను ఆపివేయటం (2)
3 . ఒక దేశము (4)
5. కలువ (2)
6. మనోహరమైన ఒక రాగవిశేషము  (6)
7. అన్నిటిలోకి అందమైన ఒక పద్య రీతి అటు ఇటు అయ్యింది : సుమతీశతకమంతా ఇవే పద్యాలు (3)
10. వీరే ద్వాపర యుగంలో కృష్ణార్జునులట (7)
12. తెనాలి రామకృష్ణుడు (5)
14.  అర్జునుని శంఖము (5)
17. అక్కినేని నాగార్జున నటించిన భక్తి కథాచిత్రం – ఘంటసాలవారి ప్రఖ్యాత భక్తి గీతాలలో ఒకటి ఇలా మొదలౌతుంది (6)
21. బలరాముడి భార్య – మాయాబజార్లో ఛాయాదేవి (3)
22. ఇప్పుడు జరుగుతున్న కాలం (4)
23. అనామిక  (4)
27. సౌకుమార్యము / గారాబము (2)
28. వేగిరపాటు (2)

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2022 ఏప్రిల్ 26వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సంచిక – పద ప్రతిభ 7 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2022 మే 01 తేదీన వెలువడతాయి.

సంచిక – పద ప్రతిభ 5 జవాబులు:

అడ్డం:   

1.ఆనకదుందుభి 4. ఆంగీరస 8. కారం 9. యిలగంకోడు 11. ఆదా 13.  ముతపం 15. అశోకం 16. మురిపము 18. ఘాతము 19. రమారమి  20. వింశతి  21. గ బొం రం  24. రహి 25. తహతహగా 26. యాత 29. యవీయసి 30. సముదాయ క్షేత్రం

నిలువు:

1.ఆవకాయ 2. కరం 3. దుకూలము 5. గీత 6. సరదారాముడు 7. ప్రకోపం 10. గంత కు తగ్గ బొంత 12. దేశోద్ధారక 14. హరివంశము 17. ఖరహరప్రియ 21. గహనం 22. రంహణము 23. శ్వేతపత్రం 27. స్వీయ 28. లయ

సంచిక – పద ప్రతిభ 5 కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • రామలింగయ్య టి
  • శ్రీనివాసరావు సొంసాళె

వీరికి అభినందనలు.

గమనిక:

ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here