సంచిక – పద ప్రతిభ – 8

0
9

[dropcap]‘సం[/dropcap]చిక – పద ప్రతిభ’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. పంచమవేదం (6)
4. సంగమము  (4)
8. సృష్టికర్త  (2)
9. చదువుల తల్లి (5)
11. మెరుపు  – ఒక వాయిద్యం కూడా (2)
13. నాడులు –  వరాలు కాదు (3)
15. మోక్షవిషయమైన జ్ఞానము/ జీవాత్మపరమాత్మల సంబంధము (3)
16. ఆపద , శ్రమ – కొస ముందుకొచ్చింది (4)
18. తెల్లవాడి ధ్వన్యనుకరణ (3)
19. వేడుకగాఁ దిరుగుట లో తొలుత దీర్ఘమైనది  (4)
20. అంగడి;  చిన్న మంచము (3)
21. పరుష – ప్రకృతి x —— వికృతి – అటుగా (3)
24. ఒక పుణ్యక్షేత్రము – ఇక్కడ ఉత్తరక్రియలు జరిపితే చాల శ్రేష్ఠమట (2)
25. అతిగా మాట్లాడేవాడిని ఇలా వ్యవహరిస్తారు  (5)
26. ఆభరణము (2)
29. మంత్రవాదీ   తంత్రగాడూ  కాదండి – మంచి నేర్పు గలవాడు (4)
30. ఏనుగునీ , హిందీలో అమ్మనీ, కొండనీ తనలో దాచుకున్న సింహము (6)

నిలువు:

1. పాలకూర (4)
2. సూత్రవ్యాఖ్యాన గ్రంథము(2)
3. అతి శీఘ్రముగా తటాకాలు కానవచ్చునా  (4)
5. సిగ్గు తోటిదే, సిగ్గు లాంటిదే  (2)
6. శోభన్ బాబు, కాంచన  నటించిన పాత సినిమా (6)
7. ఆరాలు తీయకండి – ఈవిడ మగని తోడఁబుట్టినవాని పెండ్లాము (3)
10. విక్రమార్కుని నవరత్నాలలో ఒకరు – జ్యోతిష్య శాస్త్రములో దిట్ట (7)
12. విశ్వనాథవారి ప్రఖ్యాతిగాంచిన ఛందో ప్రక్రియ (5)
14. సముద్రము – నీళ్లు మాత్రం ఉప్పు ‘కషం’  (5)
17.  ఒక శాక్తేయ పురాణము : సంస్కృతంలో వ్యాసుడు వ్రాస్తే, తెలుగులో యామిజాల పద్మనాభస్వామి గారి రచన (6)
21. మంచి లక్షణం (3)
22. సంస్కృతంలో బాణుడు రచించిన తొలి వచన కావ్యం -అక్షరాలు తడబడ్డాయి  (4)
23. వేదము (4)
27. అరేబియా సముద్ర తీరంలో ఉన్న 25వ రాష్ట్రం (2)
28. వస / గోరువంక (2)

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2022 మే 03వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సంచిక – పద ప్రతిభ 8 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2022 మే 08 తేదీన వెలువడతాయి.

సంచిక – పద ప్రతిభ 6 జవాబులు:

అడ్డం:   

1.మధురశ్రీనాధ 4. పరవశం 8. కల్పం 9. ఉగాదినాడు 11. మీరా 13. రుక్కులు 15. రామఠం 15.జహానారా 18. ఉనికి 19. శుభ్రాంశువు 20. ధవుడు 21. ష్ఠంరివ 24. లక్ష్మి 25. కలికిపిట్ట 26. వేలం 29. ధన్వంతరి 30. వకుళాభరణ

నిలువు:

1.మహాకవి 2. రక్తి 3. నాన్నగారు 5. రథ్య 6. శంకరాభరణం 7. బోనాలు 10. దిక్కులేనివారికి 12. హేమకేశుడు 14. సహదేవుడు 17. శిశుపాలవధ 21. ష్ఠం లి బ 22. వపిలుకు 23. తెలంగాణ 27. దాత 28. ప్రభ

సంచిక – పద ప్రతిభ 6 కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • అనూరాధ సాయి జొన్నలగడ్డ
  • బయన కన్యాకుమారి
  • చెళ్ళపిళ్ళ రామమూర్తి
  • సిహెచ్.వి.బృందావనరావు
  • ద్రోణంరాజు వెంకట నరసింహారావు
  • ఎర్రోల్ల వెంకటరెడ్డి
  • పడమటి సుబ్బలక్ష్మి
  • పొన్నాడ సరస్వతి
  • రంగావఝల శారద
  • రామలింగయ్య టి
  • శిష్ట్లా అనిత
  • శ్రీనివాసరావు సొంసాళె
  • తాతిరాజు జగం‌
  • వైదేహి అక్కపెద్ది

వీరికి అభినందనలు.

గమనిక:

ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here