సంచిక – పద ప్రతిభ – 83

0
12

‘సంచిక – పద ప్రతిభ’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. వినాయకుడు (4)
4. లంకాధిపతి (4)
7. సూర్యుడు (5)
9. క్లేశమునోర్చు గుణము (3)
11. కుమారస్వామి (3)
13. చివర లేని శిగ్రు వృక్షము (2)
14. గెలుపు ఇచ్చే లక్ష్మి (3)
16. శిరస్సు (2)
17. అసలు కి జంట పదం (3)
18. బలరామ కృష్ణుల కులము (3)
19. ప్రభువు (2)
20. ఉనికి, నివాసము (3)
22. గుర్రము (2)
24. పంకము (అటునుండి) (3)
26. వనిత /ఇల్లాలు (3)
27. ఇంద్రుని ఉద్యానవనము (5)
30. శకుంతల భర్త (4)
31. పదముల సమూహము (4)

నిలువు:

1. ఏనుగు (4)
2. హోమము (3)
3. స్థాణువు తిరగబడింది (2)
4. రాహువు (2)
5. బ్రహ్మచారి, ఉపనయనము (3)
6. రాలుట యందు అయ్యే ధ్వని (4)
8. గోడ కట్టేటప్పుడు అమర్చే ఎత్తైన కొయ్యల కట్టడము (3)
10.  మన్మథుడు (5)
12. అగ్నిహోత్రుడు (5)
14. మూల్యము (3)
15. శుక్రాచార్యుని అల్లుడు(3)
19. ‘డు’కారం ‘దు’కారమై, రాక్షసుడు తికమకపడ్డాడు (4)
21. సన్నదనము (3)
23. మాతులుంగము (4)
25. తుదిలేని వాడు (3)
26. సంతోషకరమైన ఒక సంవత్సరము (3)
28. బుర్ర కి మొదలు లేదు (2)
29. రంధ్రము (2)

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2023 అక్టోబర్ 10 తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సంచిక – పద ప్రతిభ 83 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2023 అక్టోబర్ 15 తేదీన వెలువడతాయి.

సంచిక – పద ప్రతిభ 81 జవాబులు:

అడ్డం:   

1) అడవి బాపిరాజు 7) యశం 8) లలాటం 9) నువ్వూ 12) సుతనువు 13) నిధాజరా 15) రాతి 16) వినుము 17) ఆరె 20) గిడుగురామమూర్తి

నిలువు:

2) డబ్బు 3) బాగులాడి 4) రాగం 5) నాయని సుబ్బారావు 6) దువ్వూరి రామిరెడ్డి 10) మనువు 11) బంధాలు 14) కనులారా 18) పండు 19) ల్యంమూ

సంచిక – పద ప్రతిభ 81 కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • అనూరాధ సాయి జొన్నలగడ్డ
  • అరుణరేఖ ముదిగొండ
  • భద్రిరాజు ఇందుశేఖర్
  • భాగవతుల కృష్ణారావు
  • చెళ్ళపిళ్ళ రామమూర్తి
  • సిహెచ్.వి.బృందావనరావు
  • ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
  • ద్రోణంరాజు వెంకట నరసింహారావు
  • ఎర్రొల్ల వెంకట్ రెడ్డి
  • కాళిపట్నపు శారద
  • మధుసూదన రావు తల్లాప్రగడ
  • మత్స్యరాజ విజయలక్ష్మి
  • పడమట సుబ్బలక్ష్మి
  • పి.వి.రాజు
  • పి.వి.ఆర్. మూర్తి
  • రంగావఝల శారద
  • రామలింగయ్య టి
  • రాయపెద్ది అప్పాశేషశాస్త్రి
  • శంభర వెంకట రామ జోగారావు
  • శిష్ట్లా అనిత
  • శ్రీనివాసరావు సొంసాళె
  • తాతిరాజు జగం‌
  • వనమాల రామలింగాచారి

వీరికి అభినందనలు.

[ఈ గళ్ళ నుడికట్టు నింపటంలో ఏవైనా సందేహాలు కలిగితే కూర్పరి శ్రీమతి సీతామహాలక్ష్మి గారిని 8772288386 సంప్రదించగలరు]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here