[dropcap]‘సం[/dropcap]చిక – పద ప్రతిభ’కి స్వాగతం.
సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
1. దీనికి తావి అబ్బినట్లు అని సామెత (5) |
4. ఇలా ఉంటే చాలా ఆడంబరంగా డబ్బు లెక్క లేకుండా ఉన్నాడని జనాభిప్రాయం (5) |
7. సుగ్రీవుని భార్య (2) |
8. బాలనటిగా శ్రీదేవి నటించిన ప్రఖ్యాత చిత్రం – మానవుడే మహనీయుడు అన్న పాట ఇందులోనిదే (5) |
10. శృంగార చేష్ట (2) |
12. చంటిపిల్లల చేతులకి తొడిగే నగ మధ్యలో కొమ్ము లేదు (3) |
14. అపచారం కాదండీ – సేవ (4) |
15. ఉప్పు సముద్రం, పెరుగు సముద్రమూ కావు పాలసముద్రమే (4) |
16. అందమైన నడకలకు దీనినే ఉదహరిస్తారు (3) |
17. వరాహమూ వామనుడు రాముడు విష్ణువు యొక్క — ఏకవచనంలో (4) |
18. ఏం కలి కలం బాబూ – మొదటి యుగమే తడబడి పోయింది (4) |
20. పాపము, మనలేని ఆగమనము (3) |
22. ఇంపైనది , ఇచ్ఛ గలది , హిందీవాడి గది మాత్రం కాదు సుమండీ ! (2) |
23. సీమంతము (5) |
24. అంచె, జాబు- కట్టాడంటే బాల్చీ తన్నేశాడని అర్ధం! (2) |
27. వెన్న (5) |
28. రమణులకు( మాత్రమే కాదు!) సంబంధిచినది- అందము (5) |
నిలువు:
1. 1955 వ సంవత్సరానికిగాను అత్యుత్తమ తెలుగు చిత్రంగా జాతీయ చలనచిత్ర పురస్కారాన్ని అందుకున్న బి.యెన్. రెడ్డిగారి సినిమా (5) |
2. సంపూర్ణకళలు గల చంద్రునితో గూడిన పున్నమ (2) |
3. చిగురు -పళ్ళది కాదు (4) |
4. పమిటచెంగు (4) |
5. దధీచి గారి ఎముకలతో చేసిన మారణాయుధము (2) |
6. మేరుపర్వతము (5) |
9. డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ గారి అధ్యక్షతన 299 మంది సభ్యుల కృషితో అవతరించినది (7) |
11. ఆవు పాలు, పెరుగు, తేనె , నెయ్యి, పంచదార కలిపితే వస్తాయి – పూజలో తప్పనిసరిగా వాడేది (5) |
13. శత్రువును తనలో దాచుకున్న ఒక సంవత్సరము (5) |
17. గంగానది (5) |
19. గతిలేనమ్మకి ——- మరి (5) |
20. గుడి (4) |
21. సీతమ్మవారు కనిపించక శ్రీరాముడు క్రిందు మీదులయ్యాడు (4) |
25. విదేశాలు వెళ్లాలంటే ఇది తప్పనిసరి (2) |
26. పావడామీద ఓణీ కాదండి – విక్రయదారుల మొదటి అమ్మకపు సొమ్ము (2) |
మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2022 మే 10వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సంచిక – పద ప్రతిభ 9 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2022 మే 15 తేదీన వెలువడతాయి.
సంచిక – పద ప్రతిభ 7 జవాబులు:
అడ్డం:
1.సరస్వతీపుత్ర 4. ము క ద మో 8. ధన్య/థన్య 9. వందనములు 11. సాన 13. మురకం 15. శుకము 16. దేవగంగ 18. రారాజు 19. మోచకము 20. ముత్తవ 21. రేణుక 24. కక్ష 25. ము వ లు లి ప / పవలులిము 26. పుబ్బ 29. శతముఖి 30. అలంకారములు
నిలువు:
1.సత్పథము 2. స్వస్తి 3. పుళిందము 5. కల్వ 6. మోహనరాగము 7. దముకం 10. నరనారాయణులు 12. వికటకవి 14. దేవదత్తము 17. నమోవేంకటేశ 21. రేవతి 22. కలికాలం 23. దబ్బవ్రేలు 27. గోము 28. త్వర
సంచిక – పద ప్రతిభ 7 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- అనూరాధ సాయి జొన్నలగడ్డ
- బయన కన్యాకుమారి
- భాగవతుల కృష్ణారావు
- చెళ్ళపిళ్ళ రామమూర్తి
- సిహెచ్.వి.బృందావనరావు
- మధు తల్లాప్రగడ
- నీరజ కరణం
- పడమటి సుబ్బలక్ష్మి
- పొన్నాడ సరస్వతి
- రంగావఝల శారద
- రామలింగయ్య టి
- శిష్ట్లా అనిత
- శ్రీనివాసరావు సొంసాళె
- తాతిరాజు జగం
- వర్ధని మాదిరాజు
- వైదేహి అక్కపెద్ది
వీరికి అభినందనలు.
గమనిక:
ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.