[dropcap]‘సం[/dropcap]చిక – పద ప్రతిభ’కి స్వాగతం.
సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
1. పెద్ద ఉసిరికాయ (3) |
4. ఏనుగు, అటునుంచి వస్తోంది (3) |
6. వినోదము చేయునది (5) |
9. నూరుకోట్లు, వజ్రాయుధం (4) |
11. అటునుండి వెనక్కి రండి, రవ్వలు కనిపిస్తాయి (4) |
13. చివరిలోనే విరిగిపోయిన ఈ కాడని చారు, సాంబారు, పులుసులలో వేస్తారు (2) |
14. అమ్మమ్మ లేదా నాయనమ్మ తల్లి (3) |
15. వెనక నుంచి ముందుకు వేష్టనం చేసి రండి (2) |
16. కుడి నుండి ఎడమకి – ఈవి, విడుపు (3) |
17. పక్షి (3) |
18. ఆజ్ఞ, ఒట్టు, సాక్షి (2) |
19. పిసినిగొట్టువారు, పీనాసివాళ్ళు (3) |
20. శిగ్రు వృక్షము (రెండు వంతులు ఉంది, ఒక వంతు విరిగిపోయింది) (2) |
22. తారకరాముడు – లో 2, 3, 5, 4 (4) |
24. ఖండములు, కాబట్టి ముక్కలు చెల్లా చెదురై అటు ఇటు అయ్యాయి (4) |
26. చంద్రుడు, చివరి రెండు అక్షరాలు తారుమారు (5) |
28. వెంటనే, తటాలున – మొదటి అక్షరానికి గుడి చేర్చండి (3) |
29. కబురు, వర్ణాధిక్యము, తుమ్మెదల గుంపు (3) |
నిలువు:
1. గగనము, దీనిని ఎవరైనా పైనే గని కిందకి చూడలేరు (4) |
2. దేవాలయము, కింద నుంచి పైకి (3) |
3. జలాశయము (2) |
4. నారింజ చెట్టు, కింద నుంచి పైకి (3) |
5. అతిశయము (4) |
7. మాట్లాడకుండు; మాట్లాడితే నీది ఏమైనా పోతుందా అని ఈ ప్రయోగం (7) |
8. మన్మథుడు (7) |
10. శిరస్నానము, దుర్భరము, అధికము (5) |
12. అలలు, కెరటాలు (5) |
18. ఓడ నడుపువాడు, నావికుడు (4) |
21. వసంత రుతువు (4) |
23. మునిగిపోవడం – అక్షరాలు చెల్లాచెదురయ్యాయి (3) |
25. పిడికిటిపోటు, చివరి అక్షరం లోపించింది (3) |
27. గారె, పిష్టచక్రము (2) |
మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2024 జనవరి 16 వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సంచిక – పద ప్రతిభ 97 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2024 జనవరి 16 తేదీన వెలువడతాయి.
సంచిక – పద ప్రతిభ 95 జవాబులు:
అడ్డం:
1.చిలుకపలుకులు 5. చౌ 8. మణిమాల 10. త మే 12. వైదేహ 14. ముయాదృఛ్చిక 16. సవతి 17. కోపీష్టి 18. రకీ 20. తంతు 21. నం న కా ద నం ఆ 24. దమము 25. డు ష్ము భీ 26. కనకాభిషేకము
నిలువు:
2.లుక్కు 3. పక్షిణి 4. కువలయాపీడనం 6. మ్లే త చ్ఛి 7. కోవైసర 8. మహతి 9. మాముకో 11. మేకపోతు గాంభీర్యం 13. దేవకీనందన 15. దృష్టి 19. అకాముభి 22. నమకా 23. ఆడుము
సంచిక – పద ప్రతిభ 95 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- అరుణరేఖ ముదిగొండ
- బయన కన్యాకుమారి
- భాగవతుల కృష్ణారావు
- చెళ్ళపిళ్ళ రామమూర్తి
- సిహెచ్.వి.బృందావనరావు
- ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
- ద్రోణంరాజు వెంకట నరసింహారావు
- ఎర్రోల్ల వెంకట్ రెడ్డి
- కాళిపట్నపు శారద
- కోట శ్రీనివాసరావు
- మధుసూదన రావు తల్లాప్రగడ
- పడమట సుబ్బలక్ష్మి
- పద్మావతి కస్తల
- పి.వి.రాజు
- పి.వి.ఆర్. మూర్తి
- రంగావఝల శారద
- రామలింగయ్య టి
- రాయపెద్ది అప్పా శేష శాస్త్రి
- శంభర వెంకట రామ జోగారావు
- శిష్ట్లా అనిత
- శ్రీనివాసరావు సొంసాళె
- వర్ధని మాదిరాజు
- వనమాల రామలింగాచారి
- విన్నకోట ఫణీంద్ర
వీరికి అభినందనలు.
[ఈ గళ్ళ నుడికట్టు నింపటంలో ఏవైనా సందేహాలు కలిగితే కూర్పరి శ్రీమతి సీతామహాలక్ష్మి గారిని 0877-2288386 అనే లాండ్‌లైన్ నెంబరులో (ఉదయం 11.00 – సాయంత్రం 5.30 గంటలో మధ్యలో) సంప్రదించగలరు.]