‘సంచిక – పదప్రహేళిక’కి స్వాగతం.
సంచికలో మరో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు దినవహి సత్యవతి గారు ‘సంచిక – పదప్రహేళిక’ అనే పద ప్రహేళిక నెలకో మారు నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
1. సారెలో ఒక ద్రవ్యం (4) |
5. బహిష్కారము (2) |
6. అలనాటి నోముల నటి (4) |
7. విమోచనము (3) |
8. కడలి లాగ (4) |
10. మోక్షం కోరే వాడు తడబడ్డాడు (4) |
12. ఎండమావి (4) |
14. అస్త పర్వతము (4) |
16. ఉపద్రవము (3) |
17. ప్రకాశము కలది (4) |
19. బడుగు మహిళల సంక్షేమ పథకం (2) |
20. లోహాలను కరిగించే మూస (2) |
నిలువు:
1. వేసవిలో శీతల పానీయం దొరికే చోటు (4) |
2. ఎక్కువగ (4) |
3. చిహ్నము (2) |
4. భార్య (4) |
6. గద్య పద్యమయ కావ్యము (3) |
9. అత్యాశ, కక్కుర్తి (3) |
11. నాసికాభరణం (3) |
12. చిలుక (4) |
13. హిందీ కథ (3) |
14. ఒక రకపు అరటి పండ్లు, చెల్లుచెదరయ్యాయి (4) |
15. ఏనుగు (4) |
18. అతి రహస్యంగా డబ్బు దాచుకునే బ్యాంకు (2) |
మీరు ఈ ప్రహేళికని పూరించి సమాధానాలను 2023 డిసెంబరు 10వ తేదీ లోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘పద ప్రహేళిక డిసెంబరు 2023 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు 1 జనవరి 2024 తేదీన వెలువడతాయి.
సంచిక – పదప్రహేళిక- నవంబరు 2023 సమాధానాలు:
అడ్డం:
1.ముంజేతి 3.జోకులు 8.మేకై 9.త్రివేణి 10.రంభ 13.విభూతి 14.ఆర్జనం 18.చార్మి 19.సంభ్రమం 20.దుత్త 23.గోచార 24.సిరియా
నిలువు:
2.జేడ 4.కుజ 5.అమేయం 6.కువేణి 7.జృంభణ 11.అభూతి 12.ధూర్జటి 15.ఆచార 16.విభ్రమ 17.తొత్తడి 21.చాచా 22.వైరి
సంచిక – పదప్రహేళిక- నవంబరు 2023కి సరైన సమాధానాలు పంపినవారు:
- అనూరాధ సాయి జొన్నలగడ్డ
- అరుణరేఖ ముదిగొండ
- ద్రోణంరాజు వెంకట మోహనరావు
- ద్రోణంరాజు వెంకట నరసింహారావు
- కాళీపట్నపు శారద
- మధుసూదన రావు తల్లాప్రగడ
- మత్స్యరాజ విజయలక్ష్మి
- పడమట సుబ్బలక్ష్మి
- పి.వి.రాజు
- రామలింగయ్య టి
- రాయపెద్ది అప్పాశేషశాస్త్రి
- శిష్ట్లా అనిత
- శ్రీనివాసరావు సొంసాళె
వీరికి అభినందనలు.