సంచిక – పదప్రహేళిక జూలై 2023

0
13

‘సంచిక – పదప్రహేళిక’కి స్వాగతం.

[dropcap]సం[/dropcap]చికలో మరో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు దినవహి సత్యవతి గారు ‘సంచిక – పదప్రహేళిక’ అనే పద ప్రహేళిక నెలకో మారు నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. ప్రదక్షిణము (3)
3. ‘చలవ మిరియాలు’ రచయిత ఇంటి పేరు (3)
8. చీకటి (2)
9. గౌరవముగా (3)
10. రంగుల పండగ (2)
13.  సంక్రాంతి రోజులలో పెట్టేవి (3)
14. వారధి (3)
18. కోట (2)
19. పావు కోళ్ళు (3)
20. సమర్థత (2)
23. ఎంగిలి పండ్లు అతిథికి నివేదించిన భక్తురాలు (3)
24. ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వరుడిని దండాయుధ పాణి అని పిలుస్తారు (3)

నిలువు:

2. గజల్ చివరి షేర్ పేరు (2)
4. మహేష్ బాబు బావ ఇంటి పేరు తిరగబడింది (2)
5. కరక్కాయ చెట్టు (3)
6. లక్ష్మణుడి భార్య (3)
7. కూరలు తరగడానికి వాడేది (3)
11. తల క్రిందులుగా వ్రేలాడే పక్షి (3)
12. ఈ కోర్కెలు తీర్చడం కష్టం (3)
15. విశ్వనాథుల వారి సంగమం (3)
16. పెద్ద జాతి కప్ప (3)
17. సిరా బుడ్డి (3)
21. ఆత్రము (2)
22. నక్క కూత (2)

మీరు ఈ ప్రహేళికని పూరించి సమాధానాలను 2023 జూలై 10వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో పద ప్రహేళిక జూలై 2023 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు 1 ఆగస్టు 2023 తేదీన వెలువడతాయి.

సంచిక పదప్రహేళిక- జూన్ 2023 సమాధానాలు:

అడ్డం:

1) కోలాటం 3) ఈబరి 8) దాడి 9) దారువు 10) బుద్ధ 13) కంబళి 14) బఠాణి 18) తువ్వు 19) ఖటిక 20) జాగా 23) గోడిగ 24) బిల్లిక

నిలువు:

2) లాటీ 4) బచ్చు 5) కందాయం 6) గురువు 7) ఔద్ధతి 11) ఉంబళి 12) ఉఠాణి 15) ఓతువు 16) ఏటిక 17) కంగారు 21) వాడి 22) నల్లి

సంచిక పదప్రహేళిక- జూన్ 2023కి సరైన సమాధానాలు పంపినవారు:

  • అనూరాధ సాయి జొన్నలగడ్డ
  • మధుసూదనరావు తల్లాప్రగడ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here