‘సంచిక – పదప్రహేళిక’కి స్వాగతం.
సంచికలో మరో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు దినవహి సత్యవతి గారు ‘సంచిక – పదప్రహేళిక’ అనే పద ప్రహేళిక నెలకో మారు నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
| 1. మందార పుష్పం (4) |
| 2. పది బారువుల బరువు (4) |
| 5. శచీదేవి (3) |
| 7. కన్యాశుల్కము (3) |
| 9.పంచ పాండవులు (3) |
| 10. పెరుగు చిలికే కుండ(3) |
| 12. కాటికాపరి చేతి కర్ర (2) |
| 14. కత్తి పీట (3) |
| 16. సమూహము (3) |
| 17. ఆజ్ఞ (3) |
| 18. పొగడ చెట్టు (4) |
| 19. అడవి మేక (4) |
నిలువు:
| 1. కోపం (3) |
| 3. తండ్రి నాన్నమ్మ (3) |
| 4. ఆస్తి (3) |
| 6. ఆడ గుర్రము (3) |
| 8. గొర్రె (3) |
| 9. రాణి (2) |
| 11. భిక్షా పాత్ర (3) |
| 12. కొంగ (3) |
| 13. పాలు (4) |
| 14. పదు నాలుగు (3) |
| 15. ఉత్సాహము (4) |
మీరు ఈ ప్రహేళికని పూరించి సమాధానాలను 2022 జూన్ 10వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘పద ప్రహేళిక జూన్ 2022 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు 1 జూలై 2022 తేదీన వెలువడతాయి.
సంచిక – పదప్రహేళిక- మే 2022 సమాధానాలు:
అడ్డం:
1.ఔదకము 2. అంబాలిక 5. వాశిత 6. కొండుక 7. చిడుగు 8. ముల్లంగి 10. చిత్యము 12. తర్డువు 13. కఱద 15. అతివ 16. కుఱుకు 17. అనతి
నిలువు:
1. ఔపవాహ్యము 3. కటకరము 4.ఖిద్రుడు 9. గిరవు 10. చిరుక 11. తరంతి 12. తలకు 14. దవతి
సంచిక – పదప్రహేళిక- మే 2022 కి సరైన సమాధానాలు పంపినవారు:
ఎవరూ లేరు
గమనిక:
ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.

