సంచిక విశ్వవేదిక – ఘంటసాల పాటల, సంగీత నిర్దేశిక గణాంక విశ్లేషణ కార్యక్రమ నివేదిక

0
8

19-Dec-2021:

[dropcap]ఆ[/dropcap]స్ట్రేలియా తెలుగు సాహితీ సమాఖ్య, సాహిత్య సంగీత సమాఖ్య హైదారాబాద్ వారి సంయుక్త ఆధ్వర్యంలో, ఘంటసాల గారి 99వ జయంతి సందర్భంగా, “ఘంటసాల పాటల, సంగీత నిర్దేశిక గణాంక విశ్లేషణ, పుస్తక కార్యాచరణ” అనే అంశాలతో ఒక ప్రత్యేక కార్యక్రమం దిగ్విజయంగా నిర్వహించబడినది. ఈ కార్యక్రమానికి గౌరవ అతిథులు, అనేక నంది అవార్డుల గ్రహీత డా. మీగడ రామలింగస్వామి, ఆచార్య కొలకలూరి మధుజ్యోతి (పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం) మరియు సందేశాన్ని అందించివారు ఆచార్య సి. మృణాళిని గార్లు.  శ్రీమతి వాణి మోటమఱ్ఱి ఆహ్వాన మాటలు, డా. వులిమిరి గారి ఘంటసాల భక్తి గీతంతో కార్యక్రమం ఆరంభమైంది, కార్యక్రమాన్ని ప్రణాళికాబద్ధంగా నిర్వహించినవారు సర్వశ్రీ డా. సారధి మోటమఱ్ఱి (ఆస్ట్రేలియా), ఆచారం షణ్ముఖచారి (హైదరాబాద్) మరియు డా. సూర్యనారాయణ వులిమిరి (అమెరికా).

కార్యక్రమ నిర్వహణలో భాగంగా ఘంటసాల గారి నేపథ్య ప్రతిభపై డా. ఊటుకూరి సత్యనారాయణ గారు సంకలనం చేసిన “ఘంటసాల గాయకుడు, సంగీత నిర్దేశికుడు” అనే 380 పేజీల గణాంక ముసాయిదా, మరియు అందరి వక్తల పరిచయ వాక్యాలు అందచేయడం జరిగినది. డా. ఊటుకూరి గారి ఘంటసాల సంకలనానికి పునాది: ఆయన దశాబ్దాల కృషితో సంకలనం చేసిన 1932-2000 మధ్య విడుదలైన తెలుగు సినిమాలు, పాటల సమగ్ర సమాచారం/ గణాంక విశ్లేషణ. అంటే, 5,203 సినిమాల, 3,058 నిర్మాతల, 1,234 దర్శకుల, 1,364 కధారచయితల, 512 మాటల రచయితల, 4,133 నటీనటుల 31,257 పాటల, 587 గేయరచయితల, 427 సంగీత దర్శకుల, 1,165 గాయకుల,  వివరాలు. ఆ బృహత్తర రాశి నుండి, ఘంటసాల 667 చిత్రాలలో, పాడిన 2,484 పాటల; మరియు సంగీత దర్శకత్వం వహించిన 86 చిత్రాల నుండి 1,110 పాటల సమగ్ర వివరాలు.

ఈ కార్యక్రమంలో పాల్గొని, డా. వుటుకూరి గారి సంకలనంపై డా. మోటమఱ్ఱి గారి వివరణ అనంతరం, తమ విలువైన విశ్లేషణ అందించినవారు: సర్వశ్రీ ఆచారం షణ్ముఖచారి, డా. మీగడ, డా. వులిమిరి, డా. వి. వి. రామారావు, డా. గిరిధర్ తిరుమలై, కలగ కృష్ణమోహన్, ప్రొ. మధుజ్యోతి కొలకలూరి, చల్లా సుబ్బారాయుడు, నూకల ప్రభాకర్, విజయచంద్రహాస్ మద్దుకూరి, సాయి బ్రహ్మానందం గొర్తి (email ద్వారా), మురళి ధర్మపురి, డా. ఉష శ్రీధర. శ్రీమతి ప్రశాంతి (దుబాయ్) తన చక్కటి గానంతో మాష్టారి పాటలను అద్భుతంగా గానం చేశారు.

పుస్తక కార్యాచరణ:

డా. ఊటుకూరి గారి ముసాయిదా కు తమ వంతు విశ్లేషణలు అందిస్తామని ఇంతవరకు ముందుకు వచ్చినవారు:

  • ఘంటసాల జీవిత సంగ్రహం – ఆచారం షణ్ముఖాచారి
  • ఘంటసాల కొన్ని పాటల విశ్లేషణ  – డా. సూర్యనారాయణ వులిమిరి
  • ఘంటసాల – కర్ణాటక సంగీత అనుసంధానం – డా. గిరిధర్ తిరుమలై
  • ఘంటసాల – హిందుస్తానీ సంగీత అనుసంధానం – ఆచారం షణ్ముఖాచారి
  • ఘంటసాల – హిందీ గాయకులతో సమపోలిక – కస్తూరి మురళీకృష్ణ
  • Ghantasala’s exemplary mastery over language. – ప్రొ. సి. mruNaalini His pronunciation and intonation.

వ్యాసాలు, అభిప్రాయాలు కావాలసిన అంశాలు (వ్రాసే అభిరుచి ఉన్నవారు, వ్యాసకర్తను సంప్రదించ మనవి):

  • పుస్తక నామకరణం -???
  • ఘంటసాలకు ముందు తెలుగు పాట, పద్యం, తెచ్చిన మార్పు – ???
  • 100 అద్వితీయ ఘంటసాల పాటలు (solo, duets) – అభిప్రాయ సేకరణ
  • ఘంటసాల – గణాంకాల విశ్లేషణ, Insights             – ???
  • ఘంటసాల పాటల, సంగీత దర్శకత్వం పై విశ్లేషణలు             – ???
  • మరిన్ని అంశాలు.

ప్రొ. మధుజ్యోతి గారు, డా. వి.వి. రామారావు గారు, శ్రీ కలగా కృష్ణమోహన్ గారు, ప్రొ. మృణాళిని గారు, శ్రీ గొర్తి సాయిబ్రాహ్మనందం గారు, శ్రీ చంద్రహాస మద్దుకూరి  గారు, శ్రీమతి శివరమ్య ధరణీప్రగడ గారు, డా. ఉష శ్రీధర గారు కూడా కొన్ని వ్యాసాలను అందించనున్నారు. శ్రీ చల్లా సుబ్బారాయుడు గారు తన ఘంటసాల గాన చరిత నుండి విలువైన సమాచారం అందించనున్నారు, శ్రీ నూకల ప్రభాకర్ గారు, తన వద్దనున్న ఘంటసాల అమూల్య సంపద విశేషాలు కూడా అందించనున్నారు.

ఈ పుస్తక కార్యచరణపై తదుపరి సమీక్ష కార్యక్రమం 11-ఫిభ్రవరి-2022 (ఘంటసాల వర్ధంతి)న నిర్వహించాలని నిర్ణయించడమైనది.

ఈ కార్యక్రమ వీడియోను ఈ లింకు ద్వారా చూడవచ్చు: https://www.facebook.com/829503157/videos/1147603035775114/

త్వరలో YouTube లో కూడా పొందుపరచనున్నాము.

మరిన్ని వివరాలకు: సారధి మోటమఱ్ఱి, http://www.facebook.com/TeluguSahitiSamaakhya, msradhi@yahoo.com.

కార్యక్రమ తొలి దీపిక:

కార్యక్రమ ఆహూతుల దీపిక

కార్యక్రమ ఆహ్వాన పత్రిక

***

 

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here