సంచిక విశ్వవేదిక – సిడ్నీ అన్నమ్మయ్య బృందం 25వ వార్షికోత్సవం

0
10

[సంచిక విశ్వవేదిక శీర్షికలో భాగంగా సిడ్నీ అన్నమ్మయ్య బృందం 25వ వార్షికోత్సవపు నివేదిక అందిస్తున్నారు భారతి పరసు. శీర్షిక నిర్వహణ శ్రీ సారధి మోటమఱ్ఱి.]

[dropcap]26 [/dropcap]మే 2024. సిడ్నీ వెంకటేశ్వర ఆలయం, హెలెన్స్బర్గ్‌.

పదకవితా పితామహ, సంకీర్తనాచార్య మన అన్నమయ్య, వేంకటేశ్వర స్వామి వారి మీద భక్తి, వైరాగ్యం, శృంగార కీర్తనలే కాక, పలు దేవీ దేవతల మీద కూడా అనేక సంకీర్తనలు రాసి స్వామికి అంకితమిచ్చి తద్వారా మనకు అమూల్య సంపదను ఇచ్చారు.

సిడ్ని అన్నమయ్య బృందం వారు ఈ ఏడాది రజతోత్సవం జరుపుకున్నారు. అన్నమయ్య, చిన్ని కృష్ణుని లీలల మీద రాసిన సంకీర్తనలు వారి గురువు గారైన గిరిధర్ తిరుమలై గారి దగ్గర నేర్చుకుని స్వామి వారి ఎదురుపాడారు.

సంకీర్తనలు పాడిన వారు – Giridhar Tirumalai, Satish Dannala, Srinivas Bethamsetty, Vijayakrishna, Mohan Parasu, Lakshmi Danturthy, Priya Juluru, Jaya Vutukuru, Neeraja Namburi, Lakshmi Bandaru, Aparna Susarla, Bharati Parasu & Radha Giridhar.

25 సంవత్సరాల క్రితం మన సిడ్నీ సంగీత గురువులు గిరిధర్ తిరుమలై గారు కొంతమంది సంగీత అభిమానులు, ఔత్సాహికులతో కలిసి అన్నమాచార్యులు వారు రాసిన వేలకొద్ది కీర్తనలనుంచి కొన్నిటిని ఎంచుకుని, బృందంగా ఏర్పడి కలిసి సాధన చేసి అన్నమాచార్య వారి జన్మదినం వైశాఖ పూర్ణిమ దగ్గరగా మన సిడ్నీ వేంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో ప్రదర్శించాము.

మా అందరి పూర్వ జన్మ సుకృతం వల్ల, కుటుంబ సభ్యుల ప్రోత్శాహంతో ఈ బృందంలో చేరి ఏటికేడు అన్నమయ్య వారి 200 పైగా సంకీర్తనలు, కొత్త కొత్త రాగాలలో గురువు గారి వద్ద నేర్చుకుని స్వామి వారికి వినిపించగలిగే మహత్ భాగ్యం కలిగింది. ఈ గాన యజ్ఞం నిరాటంకంగా జరిపిస్తూ మా అందరికీ అండగా వున్న దేవదేవునికి శతకోటి వందనాలు మనసా సమర్పిస్తున్నాము.

మా గురువు గారయిన గిరిధర్ గారికి మా ఈ రజతోత్సవ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పుకోవాలి. గత 25 ఏళ్లుగా గురువు గారు సంగీతం వచ్చిన వాళ్ళు, రాని వాళ్ళు అని చూడకుండా, ఏవిధమైన లాభాపేక్ష లేకుండా, అన్నమయ్య సంకీర్తనల మీద అభిమానంతో, వచ్చిన సంగీత విద్యని నలుగురికి నిస్వార్థంగా నేర్పించాలన్న సదుద్దేశ్యంతో, విలువైన సమయాన్ని వెచ్చించి మమ్మల్ని సంగీతం ద్వారా స్వామి వారి దగ్గరగా చేరుస్తున్నందుకు కోటి కోటి ధన్యవాదాలు, శత కోటి నమస్సులు.

– భారతి పరసు, సిడ్నీ అన్నమ్మయ్య బృందం

కొన్ని చిత్తరువులు

 

 

 

 

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here