సంచిక విశ్వవేదిక – తెలుగు వారి ప్రస్థానం

0
10

[dropcap]శ్రీ [/dropcap]పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం వారి ‘తెలుగు భాష, సాహిత్య, సాంస్కృతిక, సాంకేతిక రంగాలు – ప్రవాసాంధ్రులు’ సదస్సు సమానోత్సవ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న ఆచార్య టి. భారతికి గారికి, ఆహ్వానం అందించిన ఆచార్య కొలకలూరి మధుజ్యోతి గారికి, తదితర అతిధులకు, YouTube ద్వారా వీక్షిస్తున్న విశ్వవ్యాప్త తెలుగువారికి నా అభివాదాలు.

ఆచార్య మధుజ్యోతి గారి సారధ్యంలో ఘనంగా నిర్వహించిన మూడు రోజుల సదస్సుకి స్పందన అందచేయమని నిర్వాహకులు నాకు ఇచ్చిన అవకాశానికి చాలా ఆనందంగా ఉంది. దానికి కారణాలు ఎన్నో!

నేను తెలుగు భాష, సాహిత్య, ప్రస్థాన అభిమానిని. ఇంచుమించు ఇదే ఉద్దేశంతో sanachika.com లో ‘విశ్వవేదిక’ అని ఒక విభాగాన్ని ప్రారంభించాం. ‘మన అనుభూతి మనదే – అది మనమే రాయాలి!’ అనేది అంతర్లీన ఆకాంక్ష. ఈ మూడు రోజుల బృహత్తర కార్యక్రమంలో ఎందరో తమ తమ అనుభవాలు, అనుభూతులు, ఆకాంక్షలు, పరిశోధనలు పంచుకున్నారు. బహుశా నిర్వాహకులు 160 వ్యక్తల, 138 పత్రాలను క్రోడీకరించే ప్రయత్నం చేస్తారని అనుకుంటున్నాను. కొందరు పరిశోధనా విద్యార్ధులు నన్ను సంప్రదించినప్పుడు, వారిని ప్రవాసాంధ్ర రచయితలను పరిచయం చేయడం జరిగింది. అదొక మంచి అనుభూతి.

      తెలుగువారు శతాబ్దాల క్రితమే, ఇతర దేశాలకు వలసపోయినా, 1960 ల తరువాత సంపన్న దేశాలకు వలసలు ముందుగా చదువు కోసం, తదుపరి ఉద్యోగం కోసం ఆ తదుపరి వ్యాపార నిమిత్తం ఎక్కువ అయ్యాయి. అమెరికా, ఆస్ట్రేలియా దేశాలలో తెలుగువారి వలసలు అర్థ శతాబ్దం దాటాయి కూడా! అమెరికా కథ 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. తెలుగు బడులు విశేష ప్రగతి సాధించింది. ఆస్ట్రేలియా ప్రభుత్వం తెలుగుని ఒక accredited భాషగా గుర్తించింది.

      మధుజ్యోతి గారు అన్నట్లు క్రిందటి తరం, ఈ క్రొత్త తరం వలసదారుల మధ్య వైరుధ్యం ఉంది. అది కొంత ఆగాధమే! ప్రపంచీకరణ నేపధ్యంలో, ప్రవాసాంధ్రులు బ్రతుకు తెరువు సంపాదించి నిలదొక్కుకోవడం, వాటికోసం ఆరాటం, ప్రతి మనిషిని ఒక్కొక్క విధంగా ప్రభావితం చేశాయి. చేస్తున్నాయి. చేస్తాయి కూడా! ఈ ప్రస్థానంలో వారు ఏవిధంగా తమ జీవనాన్ని నిలదొక్కుకుని, వృత్తి పరంగా, ప్రవృత్తి పరంగా చేసిన కృషి ఏమిటి; మాతృదేశ పరిస్థితితో బేరీజు వేస్తే లోతుపాతులు ఏమిటి; నేర్చుకొన్న పాఠాలు ఏమిటి; తెలుగు, తెలుగువారు ప్రపంచ వేదికలో తమ మనుగడ సాధించడానికి, ఉన్నతి చాటడానికి ఏమి చేయవచ్చు? సాధించిన విజయాలు పదిమంది దృష్టికి ఎలా తీసుకొనిరావాలి?

      ఇటువంటి అంశాలు కొన్ని కథలలో ప్రతిఫలిస్తాయి. వాటి విశ్లేషణకు బహుశా, ఈ సదస్సు మరింత ఉత్సాహాన్ని ఇస్తుందని నా నమ్మకం. ఆలాగే తెలుగు సినీ పాటలపై, చిత్రాలపై, వాటి గణాంకాలపై ఆస్ట్రేలియా లో ఉంటూ, డా. వెంకట ఊటుకూరు గారు విశేషకృషి చేశారు. వారితో పాటు నాకు అందు కొంత ప్రవేశం ఉంది. పరిశోధకులకు నిర్ధిష్ట వివరాలు కావాలంటే మమ్ము లను సంప్రదించండి. ఆనందంగా మీకు తోడుపడగలం.

      ఇక మరి ఇటువంటి పరిశోధనలు publish చేయాలంటే మార్గాలు అంటే journals ఏమి ఉన్నాయి. దానికి తెలుగు/ విశ్వవిద్యాలయాలు ఏమన్నా కృషి చేస్తున్నాయా? విదేశీయులకు, మన తెలుగు భాష ఔన్నత్యాన్ని గురించి తెలియచేయాలి. అంటే మన సాహిత్యాన్ని భిన్న సంస్కృతి వారికి పరిచయం చేయాలి. దాని యందు వారికి అనురక్తిని కలుగజేస్తే, తెలుగు భాషను తెలుగు వారే కాదు, మరెందరో స్వచ్ఛంధ పూనికతో అలరించ వీలుపడుతుంది.

      తెలుగు భాష, సంస్కృతి విశ్వవ్యాప్తంగా తెలియాలంటే, విశ్వవిద్యాలయాలు పూనుకోవాలి. మన సాహిత్యాన్ని ప్రపంచానికి తెలియచేయాలి. అంటే, మన పరిశోధనలు reputed international journals లో ప్రచురితం కావాలి. అంటే, ఆ పరిశోధనలు English లో కూడా ఉండవలసిన అవసరం, అంటే అధునాతన Social Sciences రిసెర్చ్ methods ని మనవారు వాడాలి. ఎప్పుడైతే, మన సాహిత్యాన్ని పరవారికి పరిచయం చేసి, వారిని కూడా ఉద్యుక్తులను చేస్తామో, ఆనాడు, reputed universities తెలుగును ఒక అధ్యయన భాషగా గుర్తించవలసి వస్తుంది. అంటే వారు ఎందుకు మన సాహిత్యం చదవాలో, మనం బలంగా చెప్పగలగాలి.

      గత కవులే కాక, గురజాడ, శ్రీశ్రీ, రావి శాస్త్రి, ముళ్ళపూడి, కె న్ వై పతంజలి, దాశరధి సోదరుల, ఆత్రేయ మొదలుగా గల రచయితల కృషిని మనం క్షుణ్ణంగా విశ్లేషించి, అధునాతన పరిశోధనా శైలిలో వాటిని ప్రపంచ సాహిత్యకారులకు పరిచయం చేయాలి.

      ఇంకా ఎంతో చెప్పాలి. చెప్పే ముడిసరకు ఉంది. కానీ, సమయాభావం వలన తెలుగు భాష-టెక్నాలజీ గురించి రెండు మాటలు చెప్పి నా స్పందనను ముగిస్తాను. డిజిటలైజేషన్ లో తెలుగు భాష ఎంతో వెనకబడి ఉంది. మనలిపి ఎలా ఉండాలనేదానికి నియంత్రణ కొరవడింది. యూనీకోడ్ లో మన అధికారిక ప్రాతినిధ్యం లేదు. మైక్రోసాఫ్ట్, గూగుల్, ఆపిల్ సంస్థలతో అనుసంధానం కొరవడింది. ఇది క్లిష్ట సుదీర్ఘ అంశం. వీటిగురించి ఒక ప్రత్యేక అంశంగా చర్చించాలి. వీటికోశం ఎంతో కొంత ప్రయత్నం చేస్తున్నాను, వినిపిస్తూ వస్తున్నాను.

ఈ ప్రస్థానంలో ప్రవాస తెలుగువారు, విశ్వవ్యాప్త తెలుగు ఖ్యాతికి వారధిగా నిలబడాలని నా ఆకాంక్ష.

మా/మన ఆకాంక్ష నెరవేరుతుంది! ఇది నిజం!

విశ్వవేదిక – తెలుగు వారి ప్రస్థానం

మన అనుభూతి మనదే – అది మనమే రాయాలి!

      ఆచార్యులు కొలకలూరి మధుజ్యోతి గారికి, మేడిపల్లి రవికుమారు గారికి, బూసి వెంకటస్వామి గారికి, సభకు విచ్చేసిన, YouTube ద్వారా వీక్షిస్తున్న విశ్వవ్యాప్త తెలుగువారికి నా అభివాదాలు.

      నేను ఎంచుకొన్న ప్రధాన అంశం ‘విశ్వవేదిక – తెలుగు వారి ప్రస్థానం’. విశ్వవేదిక sanchika.com వెబ్ పత్రికలో, ఇటీవల ప్రారంభించిన ఒక క్రొత్త అనుబంధ వేదిక, ప్రత్యేకంగా అంతర్జాతీయ తెలుగు వారి కోసం, ‘తెలుగు భాష, సాహిత్య, సాంస్కృతిక, సాంకేతిక రంగాల’లో ప్రవాసాంధ్రుల ప్రస్థానం క్రోడీకరించి, నిక్షిప్తం చేసి, అందరికీ తెలియచేయాలనే సృజనతో ప్రారంభించాం.

      ఈ వేదిక అంతర్లీన భావన ఏమిటంటే, “మన అనుభూతి మనదే – అది మనమే రాయాలి!”

      తెలుగువారు శతాబ్దాల క్రితమే, మారిషస్, మలేసియా, సింగపూర్, దక్షిణాఫ్రికా, ఫిజీ వంటి ప్రాంతాలకు వలసపోయినా, 1960 ల తరువాత సంపన్న దేశాలకు ప్రయాణం, వలసలు ఎక్కువ అయ్యాయని అనుకోవచ్చు. ఈ వలసలు చదువు కోసం, తదుపరి ఉద్యోగం కోసం ఆ తదుపరి వ్యాపార నిమిత్తం – అంది పుచ్చుకున్నాయి. వలస దేశాలలో భిన్న సంస్కృతి, ఆహార వ్యవహారాలు, జీవన విధానాలు- బ్రతుకు తెరువు సంపాదించి నిలదొక్కుకోవడం, వాటికోసం ఆరాటం, ప్రతి మనిషిని ఒక్కొక్క విధంగా ప్రభావితం చేశాయి. చేస్తున్నాయి. చేస్తాయి కూడా! అమెరికా, ఆస్ట్రేలియా దేశాలలో తెలుగువారి వలసలు అర్థ శతాబ్దం దాటాయి కూడా! ఈ ప్రస్థానంలో వారు ఏవిధంగా తమ జీవనాన్ని నిలదొక్కుకుని, వృత్తి పరంగా, ప్రవృత్తి పరంగా చేసిన కృషి ఏమిటి; మాతృదేశ పరిస్థితితో బేరీజు వేస్తే లోతుపాతులు ఏమిటి; నేర్చుకొన్న పాఠాలు ఏమిటి; తెలుగు, తెలుగువారు ప్రపంచ వేదికలో తమ మనుగడ సాధించడానికి, ఉన్నతి చాటడానికి ఏమి చేయవచ్చు? సాధించిన విజయాలు పదిమంది దృష్టికి ఎలా తీసుకొనిరావాలి? అటువంటి అనేకానేక భావాలను వ్యక్త పరచడానికి, ఈ విశ్వవేదిక ఒక వేదిక కావాలని మా ఆకాంక్ష.

      నిజమే, ప్రవాసంలో వందలుగా సంస్థలు, నడిపే పత్రికలు, వేదికలు ఉన్నా, ‘ఎల్లలు లేని తెలుగుదనం’ వినిపించలేక పోతున్నాయి. అందునా ‘తెలుగువారి ప్రస్థానం’ కి తగిన వసతి చూపలేకపోయాయి అనేది వాస్తవం. ఆ లోటును భర్తీ చేయాలని, తెలుగువారు వివిధరంగాలలో సాధించిన ప్రగతిని, అనుభవాలని ఒకచోట నిక్షిప్తం చేయాలనే అభిలాషతో ఈ శీర్షిక ప్రారంభిస్తున్నాము. మీ మీ అనుభూతులు, అనుభవాలు తెలియచేయండి. తెలుగు నేలతో వాటి అవినాభావ సంబంధం కూడా పరరిశీలించవచ్చు. క్లుప్తంగా సాంస్కృతిక సంస్థల విషయాలు, మీ గురించి, మీ స్నేహితుల గురించి తెలియ చేయండి. ఇది నిరంతరం కొనసాగేది కావున, మీ రచనలను, క్రమం తప్పక ప్రతీ నెల మూడవ వారం లోపు పంపితే, వాటిని వచ్చే నెల సంచికలో పొదుపరుస్తాము. మీ రచనలు తెలుగులో ఉండాలనేది ముఖ్యమైనా, English లో ఉన్నవాటిని కూడా పరిశీలిస్తాము. అలాగే ఈ వేదికను మరింత ఉపయుక్తంగా మలచడానికి, విస్తృత పరచడానికి మీ మీ సలహాలు అందించండి.

ఈ వేదిక మనది. మన అనుభూతి మనదే – అది మనమే రాయాలి!

మీ రచనలు viswavedika@outlook.com కు పంపమనవి. కరపత్రాన్ని ఇక్కడ పంచుకొంటున్నాను.

      ఉదాహరణకు, ఐదు పదులు దాటిన ఆస్ట్రేలియా తెలుగువారి ప్రస్థానం మొదట్లో వైద్య, విద్యా, పరిశోధనా రంగాల్లోని నిష్ణాతులకు పరిమితమైనా, 1990 దశకంలో మొదలైన కంప్యూటర్ రంగ నిపుణుల వలస వలన ఎన్నో రెట్లు పెరిగిందనే చెప్పాలి. శుభ కార్యాలకు పురోహితుడు ఎవరూ లేరనే నాటి నుండి, నేడు అనేక మంది, అదే వృత్తిగా కొనసాగుతున్నవారు ఉన్నారు. సంగీతం, నాట్యం, యోగ లాంటి కళలకు ఆదరణ పెరగటంతో, వాటిని నేర్చుకునేవారు, వాటిని సంస్థా పరంగా నేర్పేవారు పెరుగుతూ, వ్యాపార విస్తరణ జరుగుతుంది. మన పప్పు దినుసులే దొరకని నాటి నుండి, నేడు ఎందరో ఔత్సాహికులు, భారతీయ తిను బండారాల వ్యాపారాలు నడుపుతూ, పురోగమించి, నేడు ఎన్నో భారతీయ రెస్టారెంట్లకు నాంది పలికింది. ఇప్పుడిప్పుడే కొంతమంది రాజకీయ రంగంలో అడుగిడడంతో ప్రవాసంలో తెలుగువారు మరో మెట్టు ఎదిగినట్టే. వృత్తిలో రాణిస్తూ, ప్రభుత్వానికి సేవలు అందిస్తూ, సివిల్ పురస్కారాలు అందుకున్నవారు ఉన్నారు. వారి సంఖ్య ఇంకా పెరగవలసి ఉంది.

      స్వదేశంలోనే ఎన్నో భాషలు, సంస్కృతులు ప్రపంచీకరణ నేపధ్యంలో తమ అస్థిత్వం కోల్పోతుంటే, అచ్చటనే వాటిని బ్రతికించాలనే తపన, ఆరాటం, సంఘటిత కృషి గగన కుసుమాలు అవుతుంటే, మాతృగడ్డకు వేలవేల కిలో మీటర్ల దూరంలో నివశిస్తున్న ప్రవాస తెలుగువారి, ముఖ్యంగా మా ఆస్ట్రేలియా తెలుగు వారి ప్రయాణం, గత 25 సంవత్సరాలలో ఎన్నో ఒడుదుడుకులను ఎదుర్కొంది. ఒకప్పటికంటే సంఖ్యాపరంగా పెరిగి, సామాజికంగా ఎదుగుతూ, ఆర్ధికంగా నిలదొక్కుకుంటూ, తమ తమ వృత్తులలో ముందడుగు వేస్తూ, తాము ఎంచుకున్న నేలకు సేవలు అందిస్తూ, ఆస్ట్రేలియా లోని తెలుగు వారు అభివృద్ధిని అందుకొంటున్నారు.

      భాష, సాహిత్యాల పట్ల సమున్నత సంఘటిత కృషి చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే, భాష, సంస్కృతి విడదీయ రానివి. తెలుగు వారిలో ఉన్న భిన్న శాఖలు, తమ తమ వారి కోసం, ప్రాంతం కోసమే కాక; తమ భాష కోసం, నిజ సంస్కృతి కోసం, సాహిత్యం కోసం సంఘటితమై, దీర్ఘకాలిక ప్రణాళిక రూపొందించుకోవాలి. సాహితీ సంపద మనం ఎంతో కొంత వెనుకకు వేసుకున్నా, శిఖరాల తమ వెనుకటి అనుభవాలు, అనుభూతులు – ఎన్నో ఎన్నో అక్షరబద్ధం చేయవలసిన బృహత్తర అవసరం ఉంది.

      ఇది సామాజిక సాహిత్యం. ఒక విధంగా మన చరిత్ర మనం రాసుకోవడం! అది తెలుగులో ఉంటే బాగుంటుంది, కానీ తెలుగులోనే ఉండాలని లేదు.

వీటిని, అంటే ఈ సాహితీ సృష్టిని అధిగమించి, ఇక్కడి మంచి దేశీయ పద్ధతులను, భిన్న సంస్కృతుల జీవన విధానాన్ని ఉన్నతిస్తూ, కథలను వెలువరిస్తే, స్వంత భూమిలో కొంత ఆలోచన రేకెత్తించ వీలుపడుతుంది.

      తెలుగులో ‘ఆస్ట్రేలియా కథ’ లేదా ‘ప్రవాస తెలుగు కథ’ తన విలక్షణతను రూపొందించుకోవాలి. భాష మారేదే, అంటే సంస్కృతీ మారేదే! మార్పు సహజం!

      కానీ మంచిని ఎంచుతూ, మంచిని పంచుతూ, ప్రవాస తెలుగువారు తమ తోటి దేశస్తులకు కూడా మన తెలుగు భాష ఔన్నత్యాన్ని గురించి తెలియచేయాలి. అంటే మన సాహిత్యాన్ని భిన్న సంస్కృతి వారికి పరిచయం చేయాలి. దాని యందు వారికి అనురక్తిని కలుగజేస్తే, తెలుగు భాషను తెలుగు వారే కాదు, మరెందరో స్వచ్ఛంధ పూనికతో అలరించ వీలుపడుతుంది.

ప్రవాస తెలుగువారు తన అస్థిత్వాన్ని నిలదొక్కుకుంటూ;

తోటి సంస్కృతుల నుండి మంచిని గ్రహిస్తూ, వారికి మన విభవం తెలియచేస్తూ;

ఈ ప్రస్థానంలో నేర్చుకున్న విలువలు, పాఠాలు, విశ్వవ్యాప్త తెలుగు వారికి తెలియ చెప్పే వారధిగా నిలుస్తూ;

ప్రవాస తెలుగు వారు మహోన్నత శిఖరాలు అందు కొనడం సుసాధ్యం!

మా/మన ఆకాంక్ష నెరవేరుతుంది! ఇది నిజం!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here