సంచిక రచయితల ‘జూమ్’ సమావేశానికి ఆహ్వానం

0
9

[dropcap]సం[/dropcap]చిక ది 17 డిసెంబర్ 2023, ఆదివారం నాడు రచయిత/త్రులతో జూమ్ మీటింగ్ ఏర్పాటు చేస్తోంది.

రచనలు చేసే సమయంలో రచనను మరింత ఆకర్షణీయం, గాఢతరం చేయటంలో రచయితలు ఎదుర్కునే ప్రతిబంధకాలు, సమస్యలు వాటి పరిష్కారాల గురించి ఈ సమావేశం.

ఈ సమావేశంలో రచయితలు, సాహిత్యాభిమానులు, సామాన్య పాఠకులు అందరూ ఆహ్వానితులే!!!!

~

Topic: రచనలు – సమస్యలు – పరిష్కారాలు

Time: Dec 17, 2023 10:00 AM India

తేదీ, సమయం: 17 డిసెంబర్ 2023, ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1.00 వరకు

~

Join Zoom Meeting

https://us02web.zoom.us/j/84623996167?pwd=NnRCQ2NKR3FLaFJFSHNBVm9qZFdUUT09

~

Meeting ID: 846 2399 6167

Passcode: 803457

***

ముఖ్య గమనిక:

మీటింగ్ రూమ్ 9.30 నుండే తెరవబడి ఉంటుంది. మీరు వీలయినంత త్వరగా వచ్చి ఆసీనులు అవచ్చు.

మనం కార్యక్రమాన్ని సరిఅయిన సమయానికే ప్రారంభించటానికి ఇది సహాయపడుతుంది.

👍 సమయపాలన వల్ల మనం కార్యక్రమం ద్వారా ఎక్కువ లాభం పొందవచ్చు.

ఇక్కడ ఎదురు చూపులకన్నా చూపులే లాభాన్ని ఇస్తాయి.

సూచనలు:

ఈ సమావేశాన్ని మరింత శోభాయమానం చేయటానికి ఈ కింది సూచనలు పాటిద్దాం.

  • ప్రశాంతమైన గదిలో కూర్చోండి. వంటపాత్రల చప్పుళ్ళు, టీవీ శబ్దాలు, చుట్టు పక్కల ఇండ్లలో నిర్మాణము పనుల శబ్దాలు వంటి శబ్దాలు రాకుండా ఉన్న ప్రశాంతమైన వాతావరణంలో కూర్చోండి
  • ఈ సమావేశం జరిగినంత సేపు, మీరు నిజమైన ఆడిటోరియంకి వెళ్ళి కూర్చుని సమావేశంలో పాల్గొంటున్న అనుభూతితో కూర్చోండి. ‘ఆఁ ఆన్‌లైనే కద’ అని అటు ఇటూ తిరుగుతూ పనులు చక్కబెట్టుకుంటూ మీటింగ్ పై కూడా ఒక చెవి వేసి ఉండటం కాదు, మీరూ ఉత్సాహంగా పాల్గొనండి.
  • ఆ మూడు గంటలు మీ కుటుంబ సభ్యులు, స్నేహితులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా వారికి ముందే చెప్పి ఉంచండి. ఆ మూడు గంటలు మీదైన సాహితీ ప్రపంచంలో ఓలలాడే అవకాశం కల్పించమని, ఆ మూడు గంటల సమయం పూర్తిగా మీది అని. వీలైతే ఒక ప్రత్యేక గదిలో ఏకాంతంగా కూర్చోండి.
  • మీ వీడియో కెమెరా ఆన్‌లో ఉంచుకోండి కార్యక్రమం జరిగినంత సేపూ కూడా.
  • ఆడియో ఐకాన్‌ను ‘మ్యూట్’లో ఉంచుకోండి. మీరు మాట్లాడేటప్పుడు మాత్రం ‘అన్‌మ్యూట్’ చేసి మీ ప్రసంగం అయిన వెంటనే మళ్ళీ ఆడియో ఐకాన్‌ని మ్యూట్ లో ఉంచండి. ఈ నియమాన్ని పాఠిస్తే సభని పూర్తిగా ఆస్వాదించగలరు.
  • మీరు ‘పవర్ పాయింట్ ప్రెజెంటేషన్’ ఇవ్వదలచుకుంటే అడ్మిన్‌కి ముందుగా తెలియజేస్తే, కార్యక్రమ హోస్టు మీకు ‘పవర్ పాయింట్ షేర్’ చేసె అవకాశం కల్పిస్తారు.
  • వీలయినంతవరకు డెస్క్‌టాప్ లేదా లాప్‌టాప్ ఉపయోగించండి. చక్కటి లైంటింగ్ ఉన్న గదిలో కూర్చోండి. మీ మొహం పై లైటింగ్ పడే విధంగా కూర్చోండి. దీపం మీ వీఫు వైపు కాక మీ ఎదురుగా ఉండేలాగానూ, మీ మొహం పై కాంతి పడేలాగానూ ఏర్పాటు చేసుకోండి.
  • ఈ కార్యక్రమం యావత్తు రికార్డు చేయబడుతుంది. తదనంతరం సంచిక వెబ్ మాగజైన్ వారి యూట్యూబ్‌లో ఉంచబడుతుంది.

ధన్యవాదాలు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here