సంచికలో 25 సప్తపదులు-1

5
18

[9 జూన్ 2024 నుంచి వారం వారం సంచికలో వివిధ కవుల సప్తపదులు 25 ప్రచురిస్తున్నాము. సప్తపదుల సృజనకర్త శ్రీ సుధామ. నిర్వహణ: శ్రీ విహారి, శ్రీ శాంతమూర్తి. సప్తపదుల నియమ నిబంధనలూ, పంపవలసిన వారి వాట్సప్ నెంబర్ ఇక్కడ చూడగలరు.]

~

సప్తపది1

శ్రీకరం
శుభకరం
విఘ్నాధిపతికి తొలిపూజతో ప్రారంభిస్తే అంతా జయకరం

ఉద్ధగిరి తులసి రాజేశ్వరి
రాజమహేంద్రవరం

సప్తపది 2

సహకారం
మమకారం
మంచిదే-అపకారం చేసేవానికి, చేస్తే ఉపకారం.

డాక్టర్. షహనాజ్ బతుల్
హైదరాబాద్

సప్తపది 3

వానమబ్బు
వరిదుబ్బు
తనువుని తాకితేనే దాని హృదయంలో లబ్బుడబ్బు!

రావూరి నరేశ్
సఖినేటిపల్లి.

సప్తపది 4

రావి
మావి
మానవత్వ పరిమళమే మంచి మనసుకు తావి

సాధన.తేరాల,
ఖమ్మం.

సప్తపది 5

దోపిడి
రాపిడి
ఎప్పటికీ కష్టించే కార్మికుని జీవితం చప్పిడి

వి శ్రీనివాస మూర్తి
హైదరాబాదు

సప్తపది 6

కథలు
వ్యధలు
జీవితంలో ఆనందాన్ని పొందాలంటే తెలియాలి పురాణగాథలు.

భాగ్యశ్రీ ముత్యం
కొవ్వూరు.

సప్తపది 7

వాదన
శోధన
ఎంత చెప్పినా వినకున్న మిగిలేను వేదన.

డా. మరుదాడు అహల్యా దేవి
హైదరాబాద్

సప్తపది 8

విరోధం
నిరోధం
భకిమార్గంలో సాధకుడికి అడుగడుగునా కలిగిస్తాయి అవరోధం.

భమిడిపాటి వెంకటేశ్వర రావు
హైద్రాబాద్

సప్తపది 9

ఋణం
వ్రణం
కారాదు ఎన్నటికీ విజ్ఞుల ఆత్మహత్యలకు కారణం

కపర్ది మల్లాజోస్యుల
విశాఖపట్టణం

సప్తపది 10

మాన్యం,
ధాన్యం,
అన్నదాత లేకపోతే అందరి బ్రతుకులు శూన్యం..

పంతుల లలిత-నీలాంజన
విశాఖపట్నం

సప్తపది 11

సమరం
అమరం
స్వర్గమనే అంశం మనసున కేవలం భ్రమరం

-ఉమాదేవి పోచంపల్లి గోపరాజు,
రిచ్మండ్, టెక్సస్, ఉత్తర అమెరికా

సప్తపది 12

శాశ్వతాలు!
నిశ్చితాలు!!
ఎప్పటికప్పుడు వదిలేయ్ -తెలుసుకుంటావు మనుషుల్లోని ఖచ్చితాలు!!!

మన్నవ నాగ లలిత శ్రీదేవి
విజయవాడ.

సప్తపది 13

ఆసనం
సింహాసనం
అధికారం కోసం చేసే కుయుక్తుల ప్రహసనం!

గోపరాజు వెంకట సూర్యనారాయణ
హైదరాబాదు.

సప్తపది 14

పద్యం
గద్యం
కమనీయ సృజనాత్మక సాహిత్యం వాగ్దేవికి నైవేద్యం

డా.పి.వి.రామ కుమార్
గుంటూరు

సప్తపది 15

కణం
క్షణం
కూడబెట్టు వినియోగించు తక్షణం సుఖశాంతానందాలే అనుక్షణం.

డా. రామడుగు వేంకటేశ్వర శర్మ.
గుంటూరు.

సప్తపది 16

పుట్ట
గుట్ట
నిత్యం మనసును శుభ్రపరుచుకోకుంటే అవుతుంది చెత్తబుట్ట…..!!

జి.కె.నారాయణ (లక్ష్మిశ్రీ)
జోగులాంబ గద్వాల్ జిల్లా

సప్తపది 16 (బి)

కులతత్వము
మతతత్వము
స్వార్థ -ప్రయోజనాలతో మనిషికి దూరమవుతున్న మానవత్వము

కట్టెకోల చిన నరసయ్య,
ఖమ్మం

సప్తపది 17

ఉదయం
హృదయం
చక్కటి భావాలు మదిలో స్పురిస్తే నవోదయం.

శ్రీవిశ్వేశ్వరమ్.
ఒడిశా. భువనేశ్వరము.

సప్తపది 18

తరంగం
అంతరంగం
ఎగసిపడే భావాలతో, చుట్టుముట్టే అరిషడ్వర్గాలతో రణరంగం!

చంద్రకళ. దీకొండ,
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా.

సప్తపది 19

ఆధునికీకరణ
సాంకేతికీకరణ
మాయాజాలంలో పడి పౌరసమాజం అవుతోంది పరాయీకరణ!

డాక్టర్ మామిడాల శైలజ
అసిస్టెంట్ ప్రొఫెసర్ ,హనంకొండ

సప్తపది 20

నీతి
రీతి
సహాయార్థుల్లో మన వారిని ఎంచుకోవటం దుర్నీతి.

వి యస్ శాస్త్రి ఆకెళ్ల
విజయనగరం.

సప్తపది 21

వనం
జనం
పరులకు ఉపకారం చేయడంలో ముందుండాలి మనం

వై.పద్మ
కొత్తగూడెం

సప్తపది 22

మంత్రాక్షరం
మధురాక్షరం
నేటి యుగపు కావ్యకన్యక జన్మ యంత్రాక్షరం

శేష శైలజ( శైలి),
విశాఖపట్నం

సప్తపది 23

వారణం!
నివారణం!!
మన బ్రతుకు వైఫల్యాలకు అంతఃకరణమే కారణం!!!

గోగినేని రత్నాకరరావు
తెనాలి.

సప్తపది 24

అధికారం
అహంకారం
వికారాలు ఎప్పుడూ మనిషికి కావు అలంకారం

ఉపద్రష్ట సుబ్బలక్ష్మి
హైదరాబాద్

సప్తపది 25

బంధం
అనుబంధం
జీవిత గమనంలో అవసరానికి ఆదుకునే సుమగంధం

రావెల పురుషోత్తమరావు
అమెరికా

~

(మళ్ళీ కలుద్దాం)

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here