సంచికలో 25 సప్తపదులు-15

0
12

[9 జూన్ 2024 నుంచి వారం వారం సంచికలో వివిధ కవుల సప్తపదులు 25 ప్రచురిస్తున్నాము. సప్తపదుల సృజనకర్త శ్రీ సుధామ. నిర్వహణ: శ్రీ విహారి, శ్రీ శాంతమూర్తి. సప్తపదుల నియమ నిబంధనలూ, పంపవలసిన వారి వాట్సప్ నెంబర్ ఇక్కడ చూడగలరు.]

~

1
పవనం
కవనం
వీనులకు విందు చేస్తుంది సాహితీమూర్తుల శ్రవణం!!

యన్.కే. నాగేశ్వరరావు,
పెనుగొండ.

2
ప్రియవచనము
మృదువచనము
ఆత్మ నిర్మలమైతే అంతర్వాణిగా వినిపించును నభోవచనము

ఉదండ్రావు రమణబాబు
నరసన్నపేట

3
ఆరోగ్యం
వైరాగ్యం
మనిషితో ఉండేవే, అతిథులే దుఃఖం సౌభాగ్యం

జి.శైలమ్మ
కుప్పం

4
రమణీయం
కమనీయం
జగతిలో రామకథ రామాయణం అందరికీ ఆచరణీయం

కాటేగారు పాండురంగ విఠల్
హైదారాబాద్

5
తర్జనం
భర్జనం
జరిగిన తర్వాతే మంచిగా మారతారు దుర్జనం!

కొల్లూరు నాగమణి,
హైదరాబాదు

6
సృష్టి
నష్టి
జనావళి జీవనాన్ని అతలాకుతలం చేస్తుంది కుంభవృష్టి.

క్రొవ్విడి వెంకట బలరామమూర్తి
హైదరాబాద్.

7
ఊరు
చూరు
ఎలాంటి తేడా చూపకుండా ముంచేసింది ఏరు.

దోసపాటి వేంకటరామచంద్రరావు
విజయనగరం

8
ఒగ్గింది!
నెగ్గింది!!
దుర్గమ్మ భక్తులను చూసి కృష్ణమ్మ తగ్గింది!!!

మన్నవ నాగ లలిత శ్రీదేవి
విజయవాడ

9
నిర్దిష్టత
విశిష్టత
సత్యమైన వాదనలో ఉంటుంది ఉక్కులాంటి పటిష్టత

సింగీతం విజయలక్ష్మి
చెన్నై

10
జ్ఞాపకము
రూపకము
విశ్వజాగృతి పరిపూర్ణoగా సమత్వమైతే, అంతర్యామి సర్వవ్యాపకము.

పుష్ప వేఙ్కట శ ర్మా.
భువనేశ్వరము.

11
స్నానము
ధ్యానము
అంతర్ముఖమై అవలోకిస్తే తప్పకుండా అగుపిస్తుంది పరమపదసోపానము

తెన్నేటి శ్యామకృష్ణ,
హైదరాబాదు

12
క్షీరం
క్షారం
జీవితాన మంచిచెడులను తెలియచేయు ఉపాధ్యాయుని అక్షరం

మాధవి మేళ్ళచెర్వు
గుంటూరు

13
ఉపాసన
హింసోపాసన
కాలక్రమంలో నాగరికత పలుకుతోంది మానవత్వ ఉద్వాసన.

శ్రీపెరంబుదూరు నారాయణ రావు’శ్రీనారా’,
హైదరాబాద్.

14
మూలాధారం
అనాధారం
మూడంగుళాల నాలుకపై ఆరడుగుల మానవనైజం ఆధారం

కోటమహంతి వెంకటరావు(కోవెరా),
విశాఖపట్టణం

15
పెరుగు
తరుగు
స్వార్థంతో తగ్గు నైతికవిలువలు – మానవత్వం మరుగు

అచ్యుతుని రాజ్యశ్రీ
హైదరాబాద్

16
బెదరదు
చెదరదు
డబ్బుతో ముడివడిన స్నేహం ఎప్పటికీ కుదరదు

రాయవరపు సరస్వతి
చోడవరం,అనకాపల్లిజిల్లా

17
మలుపులు
పిలుపులు
ధ్యానం స్వీయావిష్కరణకు నిశ్శబ్దంగా తెరుస్తుంది తలుపులు.

కె. ఎమ్. కె. మూర్తి
సికింద్రాబాద్

18
ఏకవచనం
ద్వివచనం
దండి పుట్టుకతో ‘కవికి’ దొరికింది బహువచనం

వి. శ్రీనివాసమూర్తి
హైదరాబాదు

19
మురుగు
పరుగు
పరిసరాల పరిశుభ్రత పాటించకుంటే ఆరోగ్యం తరుగు

కపిలవాయి అశోక్ బాబు
నాగర్ కర్నూల్

20
లోపాలు
పాపాలు
పర్యావరణాన్ని పరిరక్షింపనిచో తట్టుకోలేము ప్రకృతి ప్రకోపాలు

కాళీపట్నపు శారద
హైదరాబాదు

21
ఎగుడు
దిగుడు
బ్రతుకులో ఆటుపోట్లకి -అన్నింటా సమదృష్టి విరుగుడు

శాంతమూర్తి
హైదరాబాద్

22
ఆపేక్ష
లాభాపేక్ష
అమ్మ ప్రేమలో మనకు కనిపించదు ప్రతిఫలాపేక్ష

ఇలపావులూరి రాజ్యలక్ష్మి
హైదరాబాద్

23
చేకూరు
సమకూరు
బాదరబందీ లేని జీవితం పుణ్యాత్ములకే ఒనగూరు

K సత్యనారాయణ
విశాఖపట్నం

24
రంగులు
హంగులు
జీవితంలో శాశ్వతం కానేకావు దైహిక పొంగులు!

బత్తిన గీతాకుమారి
సత్తుపల్లి, ఖమ్మం జిల్లా

25
జీవనం
సేవనం
సమాజహిత పనుల్లో పాల్గొంటేనే బతుకు పావనం

వురిమళ్ల సునంద
ఖమ్మం

~

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here