సంచికలో 25 సప్తపదులు-18

1
13

[9 జూన్ 2024 నుంచి వారం వారం సంచికలో వివిధ కవుల సప్తపదులు 25 ప్రచురిస్తున్నాము. సప్తపదుల సృజనకర్త శ్రీ సుధామ. నిర్వహణ: శ్రీ విహారి, శ్రీ శాంతమూర్తి. సప్తపదుల నియమ నిబంధనలూ, పంపవలసిన వారి వాట్సప్ నెంబర్ ఇక్కడ చూడగలరు.]

~

1
రూపం
స్వరూపం
దుర్జనుల పాలిట దుర్గాదేవి చూపించును విశ్వరూపం

టి. నాగేశ్వరి
తణుకు

2
అందాలు
చందాలు
ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను కీర్తిస్తూ భజిస్తున్న భజనబృందాలు

ఋష్యశృంగు ఢిల్లేశ్వరరావు
సారవకోట

3
ఆరాటము
ఉబలాటము
దసరా నవరాత్రుల్లో మహిళలు ఆడతారు కోలాటము

బెన్నూరి వనజాక్షి
హైదరాబాద్

4
జగదీశ్వరి
భువనేశ్వరి
దసరా నవరాత్రులందు భక్తుల పూజలందే పరమేశ్వరి!

గోపరాజు వెంకట సూర్యనారాయణ
హైదరాబాదు.

5
అమ్మ
దుర్గమ్మ
మూలానక్షత్రంరోజు అక్షరాభ్యాసం చేయిస్తే వరాలిస్తుంది సరస్వతమ్మ

ఉపద్రష్ట సుబ్బలక్ష్మి
హైదరాబాద్

6
స్థితి
పరిస్థితి
అల్లకల్లోలమైన మనస్సుకు ధ్యానంతో వస్తుంది యథాస్థితి.

గుండం మోహన్ రెడ్డి,
నర్సాపూర్, మెదక్

7
ఆలన
పాలన
అమ్మ కమ్మని ఒడిలోనే శిశువు ఆనందఖేలన!

ఎన్ ఆర్ తపస్వి
చెన్నై.

8
పూజ!
ఆయుధపూజ!!
నేతాజీ పిలుపుతో మొదలైంది దుర్గమ్మకు సర్వజనపూజ!!!

ఎమ్మెస్సార్ భార్గవి ప్రియ
విజయవాడ

9
అంబ
జగదాంబ
నవమి ముగిసి దశ(ను)మి ఇచ్చే దుర్గాంబ!!

నమ్మి ఉమాపార్వతీ నాగ్,
చెరుకువాడ.

10
పండుగ!
నిండుగ!!
నెలంతా దసరా దీపావళి సంబరాలతో కనులపండుగ!!!

నేమాన సుభాష్ చంద్ర బోస్
విశాఖపట్నం

11
లక్ష్మీపూజ
సరస్వతీపూజ
పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో దీపావళికి చేస్తారు కాళీపూజ.

డాక్టర్. షహనాజ్ బతుల్
హైదరాబాద్

12
దీపాలు
ధూపాలు
భక్తితో దుర్గను కొలిస్తే తొలగును పాపాలు

ద్విభాష్యం నాగలక్ష్మి
అనకాపల్లి

13
శివరాత్రులు!
నవరాత్రులు!!
రైతులు, సైనికులు విశ్రమించక శ్రమిస్తున్నారు అహోరాత్రులు!!!

లయన్:కంబాల తిమ్మారెడ్డి
కళ్యాణదుర్గం,అనంతపురం జిల్లా

14
శివాని
భవాని
నవవిధ రూపాల్లో మూలానక్షత్రo ప్రాశస్త్యం శ్రీవాణి

ఇలపావులూరి రాజ్యలక్ష్మి
హైదరాబాద్

15
వాదము
ఆమోదము
శక్తిని నమ్ముకున్న మనిషికి దాసోహము ప్రమోదము.

పుష్ప వేఙ్కట శర్మా.
భువనేశ్వరము, ఒడిశా.

16
వచనం
ప్రవచనం
కార్యసిద్ధికి కావాలి మనకు పెద్దల ఆశీర్వచనం

నెల్లుట్ల శ్రీనివాసులు
చెన్నై

17
శబ్దం
నిశ్శబ్దం
జీవితంలో ప్రతి సంఘటన మన ప్రారబ్దం!

డాక్టర్ శైలజ మామిడాల,
హనుమకొండ

18
రాముడు
దేముడు
హనుమకు హృదయాన నిలిచిన రాఘవుడొక్కడే పరంధాముడు.

సూర్యకళ తనికెళ్ల
విశాఖపట్నం.

19
తప్పు
తుప్పు
ఎన్నుకుంటే అనర్థహేతువులై జీవికి తప్పదు ముప్పు.

కరకవలస భాస్కరరాజు,
సింహాచలం, విశాఖపట్నం

20
మతము
సమ్మతము
హృదయాలయంలో ప్రేమ ప్రతిష్ఠ చేసుకోవడమే హితము.

వి శ్రీనివాస మూర్తి
హైదరాబాదు

21
కళ్ళు
గుళ్ళు
మనోభావాలకు నకళ్ళు. ముడతలు అనుభవాల పగుళ్ళు.

డా. రామడుగు వేంకటేశ్వర శర్మ.
హైదరాబాదు.

22
నిరోధము
విరోధము
నిన్నటి చింత రేపటి గెలుపునకు అవరోధము

అభిషేక్
హైదరాబాద్

23
ధనము
జనము
తోడు వచ్చేది నీవు సముపార్జించిన మంచితనము!

బత్తిన గీతాకుమారి
సత్తుపల్లి

24
ఉచ్ఛ్వాసాలు
విశ్వాసాలు
సుఖదుఃఖాలు కష్టనష్టాలు జీవితగమనంలో సమమైన ఆశ్వాసాలు.

వి యస్ శాస్త్రి ఆకెళ్ల
విజయనగరం.

25
మరణము
శరణము
మోక్షప్రాప్తికై సదా స్మరించు శ్రీనివాసుని చరణము.

డబ్బీరు ప్రభాకర్
రాయపూర్.

~

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here