సంచికలో 25 సప్తపదులు-19

1
10

[9 జూన్ 2024 నుంచి వారం వారం సంచికలో వివిధ కవుల సప్తపదులు 25 ప్రచురిస్తున్నాము. సప్తపదుల సృజనకర్త శ్రీ సుధామ. నిర్వహణ: శ్రీ విహారి, శ్రీ శాంతమూర్తి. సప్తపదుల నియమ నిబంధనలూ, పంపవలసిన వారి వాట్సప్ నెంబర్ ఇక్కడ చూడగలరు.]

~

1
ధావితము
భావితము
పరీక్ష పెట్టి పాఠం చెబుతుంది జీవితము

విత్తనాల విజయ కుమార్
హైదరాబాద్

2
ఆరోపణ
నిరూపణ
తప్పు తమదని తెలుసుకుంటే కోరాలి క్షమాపణ

ఇలపావులూరి రాజ్యలక్ష్మి
హైదరాబాద్

3
విహితం!
సహితం!
హృదయంలో పరిమళాలు వెదజల్లేది మంచిమనుషులతో స్నేహితం!

సిహెచ్.వి. బృందావన రావు
నెల్లూరు

4
భాగం
విభాగం
మానవుని అనుభవాలలో అనుభూతి ఒక ప్రాథమికభాగం.

కే. ఎం. కే. మూర్తి
సికింద్రాబాద్

5
అభయము
ఉభయము
మనిషిని సరైన దారిలో నడిపించేది భయము

కె. సత్యనారాయణ
విశాఖపట్నం

6
చేర్పులు
కూర్పులు
నడవడికలో జీవనశైలికి అనుగుణంగా అలవర్చుకోవాలి మార్పులు!

మొర్రి గోపి
కవిటి

7
గ్రహం
ఆగ్రహం
నిగ్రహంతో చేసే పనులకు తోడగును దైవానుగ్రహం.

ఋష్యశృంగు ఢిల్లేశ్వరరావు
సారవకోట

8
నవ్యయుక్తి
భవ్యముక్తి
మనలను నిరంతరము చెంతనుండి కాపాడుతుందొక దివ్యశక్తి.

డబ్బీరు ప్రభాకర్
రాయపూర్

9
సూక్తులు
చతురోక్తులు
కవితాత్మకంగా కవిచౌడప్ప చెప్పిన బూతుల నిరుక్తులు

YLNV ప్రసాద్ రావు
విజయనగరం

10
మారకం
కారకం
విపణిలో వినిమయానికి వినియోగదారుల నమ్మికే ప్రేరకం!!

యన్.కే. నాగేశ్వరరావు,
పెనుగొండ.

11
రాణి
వాణి
కుండలినీశక్తి ఆవిర్భవింప జేస్తుంది సరస్వతి.. వీణాపాణి

దామరాజు విశాలాక్షి
విశాఖపట్టణం

12
సంస్కారము
ఆస్కారము
కలుగజేయు మనకు అన్నివిధాలా మేలు- పురస్కారము

ఆర్. రమాదేవి
పూణే

13
సిద్ధి!
బుద్ధి!!
పార్వతీదేవి తొలిసారి చేసిన నోము అట్లతద్ది!!!

ఎమ్మెస్సార్ భార్గవి ప్రియ
విజయవాడ

14
ఒకమారు
ఇనుమారు
పదేపదే హెచ్చరించినా వంచించితే ఆవేశం చెయిమారు

కృష్ణ తేజ
హైదరాబాద్

15
పొరపాటు
గ్రహపాటు
చాలా ప్రమాదాలకు కారణం మన ఏమఱపాటు

ఉదండ్రావు రమణబాబు
నరసన్నపేట

16
తంగేడిపూలు..
గునుగుపూలు..
దసరా ఉత్సవలలో సద్దుల బతుకమ్మకు బంగారుపూలు.

కాశీ మూర్తి
హైదరాబాద్

17
శూన్యత
మాన్యత
విలువలను పాటిస్తే తథ్యం జీవికి ధన్యత!

లింగాల యుగంధరాచారి
మదనపల్లి

18
ప్రాయం
ధ్యేయం
అపసవ్యపు ఊహ, చర్య, జీవితంలో హేయం!

ఎన్ ఆర్ తపస్వి
చెన్నై

19
రూపసి
తాపసి
గ్రామస్థులను కామధేనువులా అన్నిటా ఆదుకొనేది ఆపసి

(ఆపసి =ఆవు)

అభిషేక్
హైదరాబాద్

20
నిత్యము
సత్యము
తప్పక పలకడం వలన పొందగలము జన్మరాహిత్యము

ద్విభాష్యం నాగలక్ష్మి
అనకాపల్లి

21
వరము
కావరము
లభించినదాన్ని చెడుగా ఉపయోగిస్తే మిగిలేది కలవరము

డా.పి.వి.రామ కుమార్
హైదరాబాద్

22
వచనాలు
ప్రవచనాలు
అంచనాలకు మించి కావాలి జీవితానికి నిర్వచనాలు!

జీ యన్ వీ సత్యనారాయణ
హైదరాబాద్

23
గరం
దరం
బ్రతుకే సమస్యల సంగరం. ఐకమత్యముంటే సుఖసుందరం.

డా.రామడుగు వేంకటేశ్వరశర్మ.
హైదరాబాదు.

24
నిరుత్సాహం
ప్రోత్సాహం
చేసే మంచిపనిలో వెతుకు ఎల్లప్పుడూ ఉత్సాహం..!!

జి.కె.నారాయణ (లక్ష్మి శ్రీ)
జోగులాంబ గద్వాల్ జిల్లా

25
ఆస్థానం
స్వస్థానం
మజిలీలు ఎన్నున్నా చివరకు చేరేది మహాప్రస్థానం!

గోపరాజు వెంకట సూర్యనారాయణ
హైదరాబాద్.

~

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here