సంచికలో 25 సప్తపదులు-20

1
11

[9 జూన్ 2024 నుంచి వారం వారం సంచికలో వివిధ కవుల సప్తపదులు 25 ప్రచురిస్తున్నాము. సప్తపదుల సృజనకర్త శ్రీ సుధామ. నిర్వహణ: శ్రీ విహారి, శ్రీ శాంతమూర్తి. సప్తపదుల నియమ నిబంధనలూ, పంపవలసిన వారి వాట్సప్ నెంబర్ ఇక్కడ చూడగలరు.]

~

1
స్వపక్షం
విపక్షం
సంక్షేమం అమలులో ప్రభుత్వాలు చూపరాదు పలపక్షం!

గోపరాజు వెంకట సూర్యనారాయణ
హైదరాబాదు.

2
వివరణ
సవరణ
జ్ఞానసముపార్జనలో ఉండాలి మనకు అందరికంటే ఆవరణ

ఇలపావులూరి రాజ్యలక్ష్మి
హైదరాబాద్

3
జన్యం
సౌజన్యం
స్వభావరీత్యా సామాన్యంగా కొనసాగుతూనే ఉంటుంది చైతన్యం.

కే. ఎం. కే. మూర్తి
సికింద్రాబాద్

4
అడ్డా
జెడ్డా
ఎక్కడయినా నీతిగా నిజాయితీగా బతుకు బిడ్డా

రమాదేవి ఊకంటి
హన్మకొండ

5
గోరు
గీరు
కయ్యాలు పెట్టుకుంటే అనవసరంగా మనసు బేజారు

కపిలవాయి అశోక్ బాబు
నాగర్ కర్నూల్

6
ఉపకారం
సహకారం
మనుషులకు వుండాలి చేసేందుకు బంధుమిత్రులపై మమకారం.

సింహాద్రి వాణి
విజయవాడ

7
వాడు
వీడు
శరీరమే -మనిషికి తన నిజమైన తోడు

(వాడు =వినియోగించు, వీడు =వదిలిపెట్టు)

నెల్లుట్ల శ్రీనివాసులు,
చెన్నై

8
వాస్తవికత!
తాత్త్వికత!
కళాఖండం ఏదయినా ఉండాల్సిన మరొకటి సౌందర్యాత్మకత!

భువనేశ్వరి మారేపల్లి
హైదరాబాద్

9
షికారు
పుకారు
భవిష్యత్తు పణంగా – లెక్కలేని తిరుగుళ్ళతో కోడెకారు

అభిషేక్
హైదరాబాదు

10
తలపులు
వలపులు
ఓలలాడితే తనువు ఇస్తుంది ఎన్నో మలుపులు.

యు.వి.రత్నం
ఒంగోలు

11
ఆత్రము,
గాత్రము,
సదా సాధనే – కృషిలో ప్రశంసకు పాత్రము!

లింగాల యుగంధరాచారి,
మదనపల్లె

12
పెరుగు
జరుగు
మనిషి మోహావేశాలు పెరిగితే యశస్సు తరుగు

సాత్విక
హైదరాబాదు

13
గుట్టు
రట్టు
మనిషి చేయక – కొంచెం చూపాలి బెట్టు

డి.రమా సత్యాదేవి
కలకత్తా

14
అక్కడ
ఇక్కడ
ఎప్పుడూ పాతవారికే పట్టంకడితే కొత్తవారికి తావెక్కడ

శ్రీహరి
హైదరాబాద్

15
ఆహారం
విహారం
ఆరోగ్యం సమయపాలన సంయమనంతో జీవితం పూలహారం

అచ్యుతుని రాజ్యశ్రీ
హైదరాబాదు

16
స్వరాలు
వరాలు
రవళించే సంగీత సంగమాలు తొలగించు మనోభారాలు !!

యన్.కె. నాగేశ్వరరావు,
పెనుగొండ.

17
దండం
కోదండం
దేవుని ఊరేగింపులో అత్యంత ప్రధానమైనది వేదండం

పూడిపెద్ది వెంకట సుధారమణ
విశాఖపట్నం.

18
పాపం
కోపం
కలహంతో కాపురం
అవుతుంది పిల్లలకు శాపం

వై.పద్మ
హైదారాబాద్

19
నివాసాలు
ఆవాసాలు
మట్టి గోడల మధ్య నాలుగు వాసాలు

కాయల నాగేంద్ర
హైదరాబాద్

20
రుద్రం
దరిద్రం
అతిథి అభ్యాగతుల మర్యాదలలో కించిత్ భద్రం!

ఎన్ ఆర్ తపస్వి
చెన్నై

21
కర్తవ్యము
స్మర్తవ్యము
ధర్మాన్ని మరువక సాగించే జీవనము ఆదర్తవ్యము*

(ఆదర్తవ్యము = ఆదరణీయము)

కాళీపట్నపు శారద
హైదరాబాదు

22
మలినము
చలనము
జీవనయానంలో మంచిచెడులను తెలుసుకుని సాగడానికే కలనము

(కలనము=జ్ఞానము)

డాక్టర్ వరలక్ష్మి హరవే,
బెంగుళూరు

23
ద్వేషం
రోషం
పంతాలు విడనాడితే జీవితంలో నిండుగా సంతోషం

జె.విజయకుమారి
విశాఖపట్నం

24
వివరణ
ప్రచురణ
ఆర్భాటంలో కాదు చేతలలో చూపాలి వితరణ

డా.పి.వి.రామ కుమార్
హైదరాబాద్

25
ధ్యానము
మౌనము
ఆత్మ పరమాత్మల వారధి భగవంతుని సన్నిధానము

YLNV ప్రసాద్ రావు,
విజయనగరం.

~

(మళ్ళీ కలుద్దాం)

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here