సంచికలో 25 సప్తపదులు-21

1
13

[9 జూన్ 2024 నుంచి వారం వారం సంచికలో వివిధ కవుల సప్తపదులు 25 ప్రచురిస్తున్నాము. సప్తపదుల సృజనకర్త శ్రీ సుధామ. నిర్వహణ: శ్రీ విహారి, శ్రీ శాంతమూర్తి. సప్తపదుల నియమ నిబంధనలూ, పంపవలసిన వారి వాట్సప్ నెంబర్ ఇక్కడ చూడగలరు.]

~

1
నిలయము
వలయము
కొండపైన దైవక్షేత్రము గుండె గూటిలో ఆలయము.

శ్రీ విశ్వేశ్వరమ్.
భువనేశ్వరము.,ఒడిశా

2
అతకటం
కతకటం
సంబంధం బంధమైన బంధువు -అదృష్టం దొరకటం

ఆలేటి పరంజ్యోతి
ఖమ్మం

3
విలువ
చలువ
విత్తముంటే వినయం లేకున్న స్థలముండదు నిలువ!

జంజం కోదండ రామయ్య
జమ్మిపాళెం

4
హావం!
భావం!
గుండెలో విద్వేషం పెదవులపై దరహాసం వంచకస్వభావం!

సిహెచ్.వి. బృందావన రావు నెల్లూరు

5
తిరస్కారం
పరిష్కారం
బంధాలకు ఇచ్చే గౌరవంలోనే తెలుస్తుంది సంస్కారం

కుసుమ. పత్రి
తణుకు

6
చరణం
శరణం
దేవుని దీవెన అన్నివేళలా అందరికీ ఆభరణం

శాంతమూర్తి
హైదరాబాద్

7
పడవ
కడవ
చిల్లు పడితే జరుగును మహా గొడవ

శేష శైలజ(శైలి),
విశాఖపట్నం

8
మమకారం
సహకారం
అందరితో శత్రుత్వం పెట్టుకోవద్దు, ఆశించి అధికారం.

డాక్టర్. షహనాజ్ బతుల్
హైదరాబాద్

9
కలము
కులము
కవిత్వానికి జాతి భేదాలు పాటించకపోతేనే బలము

కపిలవాయి అశోక్ బాబు
నాగర్ కర్నూల్

10
ప్రేమించి
ధ్యానించి
సృష్టికర్తకు భక్తితో నమస్కరిద్దాం చేతులు జోడించి

నెల్లుట్ల శ్రీనివాసులు
చెన్నై

11
గృహలక్ష్మి
దీపలక్ష్మి
వెలిగించి పెట్టిన ఇరువైపుల కొలువైన ద్వారలక్ష్మి

గంగరాజు పద్మజ
హైదరాబాద్

12
ధనస్వామ్యం
భూస్వామ్యం
మార్పుతో సమసమాజ స్థాపనకే ఆధునిక ప్రజాస్వామ్యం.

పొన్నాడ వరాహ నరసింహులు,
ఆమదాలవలస.

13
అండగా
నిండుగా
సప్తపదికి పరభాషలేల మాతృభాష తెలుగు ఉండగా

కె. చెంచలరావు
ఒంగోలు

14
అర్ధం
పరమార్ధం
తెలియకుండా పరిస్థితులు తొందరపడి చేసుకోకూడదు అపార్ధం

ఎస్.గిరిజశివకుమారి
గుంటూరు

15
క్షణం
తక్షణం
తప్పు చేసినవారిని క్షమించడం జ్ఞానవంతుల లక్షణం!

డాక్టర్ శైలజ మామిడాల,
హనుమకొండ

16
ఇది
అది
కవిత్వమత్తు అలవాటై రాయకుండా ఉండలేము సప్తపది

ధరణికోట శివరామప్రసాద్,
హైదరాబాద్

17
అరహము
విరహము
ఆషాఢంలో నవదంపతులకు తప్పదు ఎడబాటు అహరహము

(అహరహము= ప్రతిదినము)

ఇలపావులూరి రాజ్యలక్ష్మి
హైదరాబాద్

18
విరులు
కురులు
స్త్రీల మనసు దోచుకునే ప్రకృతి సిరులు

YLNV ప్రసాద్ రావు,
విజయనగరం.

19
కలిపిరి
సలిపిరి
సప్తగిరులెక్కేముందు శ్రీనివాసుని ధ్యానించు స్థలము అలిపిరి.

డబ్బీరు ప్రభాకర్,
రాయపూర్

20
అనాది
నినాది
సదా వెల్లడించే సత్యం నమ్మకానికి పునాది

విత్తనాల విజయ కుమార్
హైదరాబాద్

21
శోధన
సాధన
ఆత్మ నిజస్వరూపం తెలిస్తే తొలగిపోతుంది వేదన

వి శ్రీనివాస మూర్తి
హైదరాబాదు

22
మాయాజాలం
ఇంద్రజాలం
జనాలను తనకు బానిసలుగా చేసుకుంది అంతర్జాలం

బెన్నూరి వనజాక్షి
హైదరాబాద్

23
చిత్తము
విత్తము
నడవడిక దారితప్పితే నాశనమౌతుంది జీవితం మొత్తము.

సింహాద్రి వాణి
విజయవాడ.

24
అదుపులు
మదుపులు
లౌక్యం లేనిచో జీవితమంతా ఎడతెగని కుదుపులు

కె.చెంచలరావు.
ఒంగోలు

25
ప్రశాంతి
అశాంతి
ప్రేమ లేని చోట ఉండదు శాంతి

అంజనీదేవి శనగల
విశాఖపట్నం

~

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here