సంచికలో 25 సప్తపదులు-22

0
11

[9 జూన్ 2024 నుంచి వారం వారం సంచికలో వివిధ కవుల సప్తపదులు 25 ప్రచురిస్తున్నాము. సప్తపదుల సృజనకర్త శ్రీ సుధామ. నిర్వహణ: శ్రీ విహారి, శ్రీ శాంతమూర్తి. సప్తపదుల నియమ నిబంధనలూ, పంపవలసిన వారి వాట్సప్ నెంబర్ ఇక్కడ చూడగలరు.]

~

1
గరళము
సరళము
హాలాహలం మింగిన హరుడియందు సతినమ్మిక సర్వమంగళము

ఇలపావులూరి రాజ్యలక్ష్మి
హైదరాబాద్

2
రాగలం
పోగలం
కాలం ఖర్మం కలిసొస్తేనే ముందుకు సాగగలం

కె. సత్యనారాయణ,
విశాఖపట్నం

3
రాతలు
కూతలు
మాట జారితే వ్యక్తిత్వంపై పడతాయి గీతలు

కపిలవాయి అశోక్ బాబు
నాగర్ కర్నూల్

4
నప్పే
ఒప్పే
ఎవరూ ప్రేమించకపోతే నిశ్చయముగా నీ తప్పే

అంజనీదేవి శనగల
విశాఖపట్నం

5
ఆహారం
విహారం
విషయంలో సమతుల్యత పాటిస్తే చక్కదిద్దవచ్చు వ్యవహారం

ద్విభాష్యం నాగలక్ష్మి
అనకాపల్లి

6
సంయోగము
వియోగము
భగవంతుడు మనిషికి ఇచ్చిన వరం ఆయోగము

ఉదండ్రావు రమణబాబు
నరసన్నపేట

7
చేపలు
పాపలు
పుట్టుకతో ఎదురీత -విద్యామార్గాన ఎత్తాలి తెరచాపలు.

ఆర్ ఎస్ రాజకుమార్
విశాఖపట్నం

8
అపచారం
ఉపచారం
చేసే ప్రతిపనికి మనస్సాక్షికి పైవాడికి సమాచారం!

గోపరాజు వెంకట సూర్యనారాయణ
హైదరాబాద్.

9
వలయం
నిలయం
నమ్మినవాడికి లేదుగా హృదయాన్ని మించిన దేవాలయం!

పప్పు సుజాతారావు
వైజాగ్

10
అలలు
వలలు
సముద్రుడు శాంతరూపుడైన నెరవేరును మత్స్యకారుల కలలు.

పార్లపల్లె.నాగేశ్వరమ్మ (టీచర్)
నెల్లూరు

11
వాదులాట
పీకులాట
సఖ్యత కొరవడితే భార్యాభర్తల మధ్య కీచులాట

ఋష్యశృంగు ఢిల్లేశ్వరరావు
సారవకోట

12
సాగునా
దాగునా
మీనమేషాలు లెక్కిస్తూ కూర్చుంటే కాలం ఆగునా

YLNV ప్రసాద్ రావు,
విజయనగరం.

13
వివాదం
సంవాదం
హద్దులు దాటితే తప్పదు సుమా విషాదం

రావెల పురుషోత్తమరావు
అమెరికా

14
వృత్తి
ప్రవృత్తి
కావాలి జీవనానికి గౌరవ ప్రఖ్యాతుల ప్రపత్తి

శైలజ సామినేని
విజయవాడ

15
కరువు
బరువు
పేదలకు బడలిక తప్ప – లేదు బ్రతుకుతెరువు.

డి. రమా సత్యా దేవి.
కొలకత్తా.

16
సాలోచన
సమాలోచన
నిరంతరం జీవితాలను నడిపించేది మనిషి ఆలోచన

కోటమహంతి వెంకటరావు(కోవెరా),
విశాఖపట్నం

17
ఆట
పాట
మనోరంజకం అయ్యేందుకు ముందు మాధుర్యంకావాలి మాట.

డబ్బీరు ప్రభాకర్,
రాయపూర్.

18
గణం
గుణం
పిల్లల ప్రవర్తన చెబుతుంది తల్లిదండ్రుల సుగుణం.

వి యస్ శాస్త్రి ఆకెళ్ల
విజయనగరం.

19
పూజించు
అర్జించు
కర్మలకు బదులు పరమాత్మ కరుణను జయించు

నెల్లుట్ల శ్రీనివాసులు,
చెన్నై

20
కసువు
శిశువు
పసిమొగ్గలపై అఘాయిత్యానికి పాలుపడుతున్న వాడు పశువు..

సంధ్య జంగాల (భాస)
కంకిపాడు

21
కుదుపు
పొదుపు
పెదవి దాటకముందే ఉండాలి మాటకు అదుపు.
.
శ్రీ విశ్వేశ్వరమ్.
భువనేశ్వరము.ఒడిశా.

22
చిత్తము
విత్తము
నడవడిక దారితప్పితే నాశనమౌతుంది జీవితం మొత్తము.

సింహాద్రి వాణి
విజయవాడ.

23
నమస్కారం
సంస్కారం
గొప్ప పని చేస్తే లభిస్తుంది పురస్కారం..!!

ఎల్.హృషికేశ్ (6.వ.తరగతి)
హైదరాబాద్

24
వచనం
ప్రవచనం
మహానుభావులు రచించిన గ్రంథం విపులీకరించు నిర్వచనం

బగ్గాం సోమేశ్వరరావు
విశాఖపట్నం

25
సఖ్యం
ముఖ్యం
కలిసిమెలిసి జీవించడమే కలకాలం ఆనందాల సౌఖ్యం!

డాక్టర్ గన్నోజు శ్రీనివాసాచార్య
మహబూబ్ నగర్.

~

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here