సంచికలో 25 సప్తపదులు-23

1
8

[9 జూన్ 2024 నుంచి వారం వారం సంచికలో వివిధ కవుల సప్తపదులు 25 ప్రచురిస్తున్నాము. సప్తపదుల సృజనకర్త శ్రీ సుధామ. నిర్వహణ: శ్రీ విహారి, శ్రీ శాంతమూర్తి. సప్తపదుల నియమ నిబంధనలూ, పంపవలసిన వారి వాట్సప్ నెంబర్ ఇక్కడ చూడగలరు.]

~

1
గతము
ఆగతము
నిన్నటి అనుభవాలతో రేపటికి పలకాలి స్వాగతము

డా.పి.వి.రామ కుమార్
హైదరాబాద్

2
అనుకరించును
అనుసరించును
కృష్ణుడు ఉపదేశించిన స్థితప్రజ్ఞత ఆచరించిన ఉపకరించును

సదా స్వామి
విశాఖపట్నం

3
విచారం!
ప్రచారం!
కళ్ళముందు జరిగే అత్యాచారాలను అడ్డుకోకపోవడం అపచారం!

సిహెచ్.వి.బృందావన రావు
నెల్లూరు

4
భ్రాతృత్వము
దాత్రృత్వము
దేనికి పనికొస్తాయట లేనిదే పిసరంతైనా సౌహార్దృత్వము

శ్రీపెరంబుదూరు నారాయణ రావు
హైదరాబాద్.

5
శాకము
పాకము
ఘుమఘుమలాడే రుచులతో వంటిల్లు మాకు నాకము

సింగీతం విజయలక్ష్మి
చెన్నై

6
అందాలు
చందాలు
శిల్పకళా ఆకృతులు కనవిందు చేసే మకరందాలు

శ్రీవాణి
తెనాలి

7
రాద్ధాంతము
సిద్ధాంతము
మనసున పుట్టించి, ఆనందింపజేసేది చక్కని, వేదాంతము

ఆర్. రమాదేవి
పూణే

8
కోతలు
చేతలు
మంచిమార్గం చూపకపోతే మిగిలేవి దుర్మార్గపు రాతలు

పొన్నాడ వరాహ నరసింహులు
ఆముదాలవలస

9
నిధి
సన్నిధి
అతివకు భర్త ఆప్యాయత అనురాగలే పెన్నిధి

ద్విభాష్యం నాగలక్ష్మి
అనకాపల్లి

10
మగువ
తెగువ
అమ్మలు రౌద్రం ప్రదర్శిస్తే ఆకాశమూ దిగువ.

పట్నాల ఈశ్వరరావు
విజయనగరం

11
శక్తి
యుక్తి
ఏడుస్తూ పుట్టినందుకు నవ్వుతూ మృతిచెందటమే ముక్తి.

అంజనీదేవి శనగల
విశాఖపట్నం

12
గ్రహం
గృహం
ఏదైనా కర్మఫలం అనుభవించుటకు వహించాలి నిగ్రహం

నెల్లుట్ల శ్రీనివాసులు
చెన్నై

13
కాయము
గాయము
మనసు ఉల్లాసముగా ఉంటే బాధలన్నీ మటుమాయము

కాళీపట్నపు శారద
హైదరాబాదు

14
బ్రహ్మముడి
కొంగుముడి
ఆలుమగల తగాదాలు కాకూడదు అసహనాల పీటముడి

ఫణీంద్ర విన్నకోట
హైదరాబాద్

15
ధనార్జన
జ్ఞానార్జన
ఎప్పటికైనా మనిషిని ఇక్కట్లకు గురిచేస్తుంది అక్రమార్జన

ఉదండ్రావు రమణబాబు
నరసన్నపేట

16
మోదం
ఆమోదం
దారాసుతులు స్వతంత్రులే. పరిధిలేని స్వేచ్ఛ ప్రమాదం.

కరకవలస భాస్కరరాజు,
సింహాచలం, విశాఖపట్నం -47.

17
పెంకెతనం
కరుకుతనం
నేటి యువతలో ముందు తరాలకన్నా మొండితనం

కాయల నాగేంద్ర
హైదరాబాద్

18
ఇల్లాలు
ఉల్లాలు
పవిత్రంగా ఉంటే సంసారానికి లేవు ఎత్తుపల్లాలు

(ఉల్లాలు = మనసులు)

K సత్యనారాయణ,
విశాఖపట్టణం

19
తక్షణ
రక్షణ
శత్రువు దండెత్తక ముందే సరిచేసుకోవాలి పరిరక్షణ

కామేశ్వరి వాడ్రేవు
హైదరాబాదు

20
రంగము
చతురంగము
ఎగసి పడే ఆలోచనలతో మనసొక తరంగము

శేష శైలజ (శైలి)
విశాఖపట్నం

21
ఉదంతములు
ఇంగితములు
మతములు ఆయా కాలాలలో ఆచరించిన హితములు

కృష్ణ తేజ
హైదరాబాద్

22
మౌనం
ధ్యానం
మనిషి ఆత్మను పరమాత్మతో చేస్తాయి అనుసంధానం!

డాక్టర్ శైలజ మామిడాల
హనుమకొండ

23
సఫలము
విఫలము
సత్కర్మల నొనరించు మనుజునికి అందును సత్ఫలము.

సూర్యకళ తనికెళ్ల
విశాఖపట్నం.

24
శాంతి
ప్రశాంతి
తృప్తిలేని జీవితానికి ఎప్పుడూ మిగులుతుంది అశాంతి..

సంధ్య జంగాల (బాస)
కంకిపాడు

25
గది
మది
గట్టి సంచలనాలు సృష్టిస్తోంది లఘుకవిత సప్తపది!!

యన్.కే.నాగేశ్వరరావు,
పెనుగొండ.

~

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here