సంచికలో 25 సప్తపదులు-8

0
10

[9 జూన్ 2024 నుంచి వారం వారం సంచికలో వివిధ కవుల సప్తపదులు 25 ప్రచురిస్తున్నాము. సప్తపదుల సృజనకర్త శ్రీ సుధామ. నిర్వహణ: శ్రీ విహారి, శ్రీ శాంతమూర్తి. సప్తపదుల నియమ నిబంధనలూ, పంపవలసిన వారి వాట్సప్ నెంబర్ ఇక్కడ చూడగలరు.]

~

1
ధ్వని
ప్రతిధ్వని
మంచిని పంచిన వినగలవు మనసారా హర్షధ్వని.

గోమతి(సుమచంద్ర)
హైదరాబాద్

2
హేయం
మాయం
మంచిని తొలగిస్తుంది స్వార్థపూరితo అయిన రాజకీయం

డా.పి.వి.రామ కుమార్
గుంటూరు

3
హామీలు
బినామీలు
రాజకీయ నాయకులు సృష్టిస్తారు ఆర్థికoగా సునామీలు

నాగ రమేష్ మట్టపర్తి
కోనసీమ

4
రావాలి!
తేవాలి!!
మాటిచ్చాక తప్పకుండా నెరవేర్చడమే కదా కావాలి!!!

నేమాన సుభాష్ చంద్ర బోస్,
విశాఖపట్నం

5
నవత
యువత
మాదకద్రవ్యాల విషవలయం నుంచి కాపాడుకుంటేనే భవిత!

డాక్టర్ మామిడాల శైలజ
హనుమకొండ

6
గాజులు
జాజులు
మరవలేము సంప్రదాయమైన పూర్వపు పండుగ రోజులు

ఎస్‌. గిరిజశివకుమారి
గుంటూరు

7
అనుమానం
అవమానం
పొట్టకూటి కష్టజీవులపై వలదు – చూపించు అభిమానం

కె.వరలక్ష్మీదేవి
కర్నూలు

8
దండించు
పండించు
తల్లితండ్రులు ఇచ్చిన జన్మను గురువు ఇనుమడించు

విత్తనాల విజయ కుమార్
హైదరాబాద్

9
సహకారం
మమకారం
ఉత్తమమైన మానవతావిలువలను ఎప్పుడూ చెయ్యవద్దు వెటకారం.

సింహాద్రి వాణి
విజయవాడ.

10
రక్షణ
తక్షణ
బోధనను పాటించడమే గురువుకిచ్చే అసలైన గురుదక్షిణ

ద్విభాష్యం నాగలక్ష్మి
అనకాపల్లి

11
నింద
అపనింద
ఉత్తమం చేసుకుంటే ఆత్మనింద – పాపహేతువు పరనింద

అభిషేక్
హైదరాబాద్

12
శాంతి
కాంతి
డబ్బు జబ్బు చేసిన మనిషికేది విశ్రాంతి..!

సంధ్య జంగాల
కంకిపాడు ,కృష్ణా జిల్లా

13
స్పృహ
నిస్పృహ
మానవత్వాన్ని ప్రతిబింబించే రచనలే స్పృశిస్తాయి సామాజికస్పృహ!

జీ యన్ వీ సత్యనారాయణ
హైదరాబాద్

14
అర్థాలు
అపార్థాలు
నిరక్షరాస్యత వలన కలుగుతాయి ఎన్నో అనర్థాలు.

డి.అనూష
హైదరాబాద్.

15
నవ్వు
రువ్వు
ప్రతి క్షణం సంతోషంగా వుంటే జీవితం కెవ్వు

హైమ. కందుకూరి
హైదరాబాద్

16
తరువులు
చెరువులు
మనకు పరోపకారం గురించి బోధించే గురువులు

గుండా వేంకట సుబ్బ సహదేవుడు
ప్రొద్దుటూరు

17
నాది
నీది
ఈ జగమందున మనకు శాశ్వతం ఏది.

పార్లపల్లె నాగేశ్వరమ్మ.
నెల్లూరు.

18
వ్రతము
కృతము
శాస్త్రీయమైన విధానములే ఎల్లప్పుడూ మనకు ధర్మహితము.

పుష్ప వేఙ్కట శర్మా.
భువనేశ్వరము.ఒడిశా.

19
వీరుడు
శూరుడు
పై వారికి భిన్నమైన వాడే క్రూరుడు!

పట్నాయకుని రామకృష్ణారావు
కంచరపాలెం.విశాఖపట్నం.

20
ధర్మం
కర్మం
చేసినంత ఫలితం పొందేవు ఇదే జీవనమర్మం!

బత్తిన గీతాకుమారి
హైదరాబాదు

21
శాసిస్తుంది
పాలిస్తుంది
మాట, జగతిని జాగృత పరిచి లాలిస్తుంది

కాయల నాగేంద్ర,
హైదరాబాద్

22
వారు!
వీరు!!
మాట కలిసినంత మాత్రాన, ఏకమై పోరు!!!

మన్నవ సుధాకర్
విజయవాడ

23
బంధం
అనుబంధం
కొందరితో రక్తసంబంధం లేకపోయినా, బలపడుతుంది ఆత్మీయబంధం.

డాక్టర్. షహనాజ్ బతుల్
హైదరాబాద్

24
సకారం
వికారం
సమాజం మన అందరి సంబంధాల ప్రకారం

కె. ఎమ్. కె. మూర్తి
సికింద్రాబాద్

25
ఎదగాలి
ఒదగాలి
సమయం, సందర్భం చూసి సమయోచితంగా మెలగాలి

శాంతమూర్తి
హైదరాబాద్

~

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here