సంగీత సురధార-11

0
10

[శాస్త్రీయ సంగీతంను పరిచయం చేస్తూ డా. సి. ఉమా ప్రసాద్ అందిస్తున్న ప్రత్యేక వ్యాసపరంపర..]

అధ్యాయం 10

Geographical Factors of Music:

[dropcap]వి[/dropcap]విధ దేశాల యొక్క సంగీతాలను పోల్చిన భౌగోళిక సంబంధమైన కారణములు వెలికితీయవచ్చును. తక్కువ సంస్కృతి గల దేశంలో సంగీతం కేవలం జానపదం/సంగీత, నృత్యాల రూపంలో ఎక్కువగా ఉంటుంది. అదే విధంగా మిక్కిలి అభివృద్ధి చెందిన దేశాలలో కావచ్చు. వివిధ దేశాలలోని సంగీత తారతమ్యాలు క్రింది కారణాలపై ఆధారపడి వుండును.

  1. ఒక దేశం యొక్క సంగీత సారూప్యము శాస్త్రయుక్తమైన (లేదా) లలిత సంగీత విభాగమా, యుద్ధ సంగీతమా, గంభీర సంగీతమా, అల్ప సంగీతమా (లేక) నిష్ప్రయోజన సంగీతమా, శృంగార సంగీతమా, విచార సంగీతమా మొదలగు విషయాలపై ఆధారపడును.
  2. అవే గాక అక్కడి ప్రజల సంభాషణల మీద ఆధారపడి ఉండును. సాదరంగా మాట్లాడువారు, గర్విష్టితనం, అహంభావం, లాలిత్యం వంటి సంభాషణ ఉన్నవారా, ఇటువంటి విషయాల మీద ఆధారపడును.
  3. సంగీతానికి జాతీయంగా ఇవ్వబడిన స్థానం మీద కూడా వుండును.
  4. ప్రస్తుత కాలంలో సంగీత స్థలాల విశేషాల మీద గతంలో జరిగిన సంగీత విషయాల ప్రాముఖ్యత మీద ఆధారపడి వుండును.
  5. సంగీత కళాకారుల సంఖ్య, సంగీత గ్రంథకర్తల సంఖ్య మీద, ఆ కళాకారులు కల్గిన గౌరవ మర్యాదల మీద కూడా ఆధారపడి వుండును.
  6. కళాకారులు, వాగ్గేయకారులు, గ్రంథకర్తలకు ఇవ్వబడిన అర్హతలపై ఆధారపడును.
  7. ఆ దేశంలో కల సంగీత నాటకశాలల మీద, ప్రదర్శనా సభల మీద, బహిరంగ సభల మీద, దీనిని సంరక్షించు సంగీత సంస్థల సంఖ్య మీద ఆధారపడును.
  8. ఆ దేశ ప్రజలు చూపు ఆసక్తికరమైన సంగీత కచేరీల మీద ఆధారపడును.
  9. వారు ఏ విధంగా ఆ దేశంలోని వాగ్గేయకారులను సత్కరించి, బిరుదు ప్రదానములు చేసిన వాటి మీద కూడా ఆధారపడును.
  10. సంగీత వాద్యాలకు ఉపయోగించిన వస్తువులు, వివిధ సామాగ్రి, వాటి నాణ్యతలు, నిర్మాణాల మీద ఆధారపడును.

ఆ దేశంలోని రాజకీయ, సాంఘిక, ఆర్థిక కారణాలు, ఇతర దేశాలతో గల సంబంధ బాంధవ్యాలు కూడా నిర్ణయించబడును. ఆసియా, యూరప్ లలో సంగీతం అత్యుత్తమ దశలో ఉంది. జర్మనీ, ఇటలీలలో సంగీతానికి ఉత్తమ స్థానం ఏర్పడి ఉంది.

Seats of Music – సంగీతానికి గల స్థానం:

సంగీతానికి ఉన్నత స్థానం వున్న దేశాలలో అనేక స్థలాముల ప్రాముఖ్యత కలదు. వాగ్గేయకారులు, గ్రంథకర్తలు, గాయకుకు, వాద్య కళాకారులు, వారి ప్రత్యేక బాణీలు మొదలగు విషయాల వల్ల సంగీత స్థల ప్రాముఖ్యత తెలియును. ఇది రెండు రకాలు. (1) చారిత్రక కారణాలు (2) భౌగోళిక కారణాలు.

కొందరు రాజులు వారికి వారు స్వయంగా వాగ్గేయకారులు గాను, కళాకారులుగాను ఉండి, ఆస్థానంలోని అనేక మంది కళాకారులను పోషించెడివారు. ఢిల్లీ, యూరప్, రాంపూర్, బరోడా, బొబ్బిలి, విజయనగరం, రామ్‌నాడ్, తంజావూరు, పుదుక్కోట, మైసూర్ చెప్పదగిన స్థలాలు. మద్రాసు కూడా చెప్పదగిన స్థలం. మద్రాసు కాశీ, రామేశ్వరం మార్గమధ్యంలో కలదు.

వాతావరణ పరిస్థితులు:

అనుకూల వాతావరణం కలిగి ఉండి, సమృద్ధిగా నీటి వనరులు, వర్షాల వల్ల పాడిపంటలు గల ప్రాంతాలలో సంగీతం, కళలు పోషింపబడేవి. కొండ ప్రదేశాలు, అడవి ప్రదేశాలు, అతి ఉష్ణ వాతావరణ గానీ, అతి శీతల ప్రదేశాలు కానీ సంగీత స్థలములు కాలేదు.

చల్లని దేశాలకు చెందినవారు సాధారణముగా సంగీతమును విని ఆనందించుతారు. మలబారులోని ప్రజలు మృదంగ వాద్యం అనిన ఎంతో ఆసక్తి చూపుతారు. మద్రాసు లోని వారు నాగస్వరం, తవిల్ మొదలగునవి వినుటకు ఆసక్తి చూపిస్తారు.

కొన్ని రాగాల పేర్లు కొన్ని ప్రాంతాల పేర్లుగా వుండడం కూడా మనం చూడవచ్చు. ఉదా – కాంభోజి – కాంభోజ దేశం నుండి, మాళవి – మాళ్వా నుంచి, గూర్జరీ – ద్రావిడ ఝూర్జరీ నుంచి, సింధు భైరవి – సింధు కన్నడ నుంచి మరియు కళింగ మొదలగు ప్రాంతాల నుండి అని చెప్పవచ్చు.

చాలా దేశాలలో వేణువు ప్రదర్శనాలు జరిపేవారు. అంతేగాక, వారి సంగీత నడక వేగంగా యుండునది. ఆ దేశములలో సాధన పగటి వేళ యందు చేయుదురు. ఉష్ణదేశంలో రాత్రులందు చేయుదురు. చలి దేశాలలోని కళాకారులు వయో పరిమితి లేక పాడుదురు. ఉష్ణ ప్రదేశంలో వారు వయో పరిమితి కల్గి వుందురు. వయస్సులోని మార్పులు వారి కంఠం మీద చూపును. దీనికి వాతావరణ పరిస్థితులు ఎంతో కారణం.

శీతల దేశాలలో స్త్రీలకు తారాస్థాయిలో నిలించి పలుకుట కష్టం. అదే ఉష్ణ దేశంలో స్త్రీలకు తారాస్థాయిలో నిషాదం, అతి తారాస్థాయి షడ్జమం సునాయసంగా పల్కును.

గాత్రంలోని మార్పులు:

  1. ఎక్కువగా బాలికల్లో కన్నా బాలురలో ఈ మార్పు ఎక్కువగా కన్పించును.
  2. గాత్రంలో పరిపూర్ణత వచ్చు కాలం వయస్సు.
  3. వయో పరిమితి మారినప్పుడల్లా గాత్రంలో మార్పులు వస్తాయి.
  4. వాగ్గేయకారుల, కళాకారుల జన్మస్థలాలు తెల్పునవి.
  5. సమాధులు మొదలైనవి కలిగి ఉన్న స్థలాలు.
  6. శిల్పాలు, పూర్వకాలపు విగ్రహములు, వర్ణనాలు తెల్పు స్థలాలు.
  7. సప్త స్వర స్తంభాలు గల స్థలాలు.
  8. సంగీత వాద్యాలు చేయు స్థలాలు.
  9. సంగీత కళాశాలలు, AIR/Maps లో చూడవచ్చు.

సంగీత వాద్యాలు:

యూరోపియన్స్ – మాపెల్, పైన్ చెట్లతో ఫ్లూట్ చేయుదురు. భారతీయులు వెదురు కర్రతో చేయుదురు. బోని తో యూరప్ లో ఫ్లూట్ తయారు చేయుదురు. జాక్ కర్రను ఉపయోగించి వీణ, తంబూర, మృదంగం, కంజీర తయరు చేయుదురు. రెడ్ వుడ్ ను అప్పుడప్పుడు మృదంగం వారు వుపయోగించెదరు. ఒక్కోసారి నల్లకర్రతో వీణలు చేయుదురు.

Geographical Factors:

ప్రపంచంలోని దేశాలను developed, under-developed, developing countries అని మూడు రకాలుగా విభజించవచ్చు. అభివృద్ధి చెందిన, చెందుతున్న, చెందని దేశాలుగా.

అభివృద్ధి చెందని దేశాలు – దక్షిణాఫ్రికాలో మనుషులు ఆటవికులు గనుక అక్కడ సంగీతం scientific గా, America, Japan – electric instruments, researches ద్వారా, scientific sources ద్వారా western countriesలో music develop అయింది. అందుకే వారి music లో harmony వచ్చింది. స్వరానికి స్వరానికి అనుకరణ లేదు. ఒకరు పాడిన దానికి counters సంవాదులు పాడతారు.

Pone – అంటే స్వర; harmony – ద్విస్వర పద్ధతి. Poly phony – బహుస్వర పద్ధతి. మనకి సంవాదిత్వం వున్నా ఒక స్వరం తరువాత ఇంకో స్వరం ప్రయోగిస్తాము. వారిది ఒకే కాలంలో ప్రయోగిస్తారు.

చల్లటి ప్రదేశాలలో ఉండే మానవుల గాత్రం మధురంగా ఉంటుంది. సాంఘిక జీవనం మీద ప్రభావం వుంటుంది.

1.climatic conditions 2. development 3. social order (సాంఘిక జీవనం). ప్రతీ దేశానికి ఒక్కొక్క లక్షణాలు (characters) వుంటాయి.

Geographical గా Middle East South వరకు వెళ్ళలేదు. అందుకే అంతవరకు music వ్యాప్తి చెందలేదు. ఒక దేశం ఎక్కువ exposure బట్టి influence వుంటుంది. కర్నాటక సంగీతం ఎక్కువ దేవాలయాలకి సంబంధించి వుండును. కళలు అన్ని దేవాలయాలకి సంబంధించి వుండును. రాజుల్ని పొగుడు వర్ణాలు, దేవుళ్ళని పొగుడుతూ గీతాలు, కృతులు. అందరి మీదా సంగీతం భక్తిపరంగా వుంటుంది. జపాన్, అమెరికా, చైనాకు పూర్వం మోహన, ఉదయ రవిచంద్రిక, far east లో అప్పుడు రాగాలు ఉండేవి. అప్పటి నుండి Americans లో బహు స్వర వ్యాప్తి. ఒకచోట ఎవరైనా గొప్పవాడు జన్మించిన, అతడి చుట్టు పక్కల ప్రాంతాలలో అదే ప్రభావం ఉంటుంది.

ఏ దేశంలోనైనా, ఆయా దేశంలోని నదుల మూలంగా దేశం సుభిక్షంగా ఉండి సంస్కృతి, విద్య ఉన్నత స్థితిలో ఉంటుంది. మూరుమూలు ఉండి invasions లేకుంటే సంస్కుతి, విద్యలు అవిచ్ఛిన్నంగా అభివృద్ధి చెందును. నాగరికత ప్రతిబింబించును. తమిళనాడులో చోళ, పాండ్య, నాయక ప్రభువులు – వీరంతా లలిత కళలని, సంగీతాన్ని పోషించారు. తెలుగునాడు లోని కళాకారులంతా తంజావురు కళాకారుల నుంచి అభివృద్ధి చెందారు. అందుచేత తమిళనాడులో కర్నాటక సంగీతం అభివృద్ధి చెందింది. మన ఇండియాలో religion కి music కి relation ఉంది. మతపరంగా దేవాలయాలు భగవంతుని సేవ పాట రూపంలో, dance, పదాలు అన్నీ పాడుట వలన దేవాలయాల ద్వారా విద్యలు, కళలు అభివృద్ధి అయ్యాయి. వేద పురాణాలన్నీ దేవాలయాల ద్వారా అభివృద్ధి చెందినవి. వీటిలో బృందగానాలు, వాద్యాలు వేదం లోంచి పుట్టినవే. సంగీతం, ఆగమశాస్త్రం అన్నీ కాల్యలు. హిందుస్థానీ సంగీతం మొఘలులు వచ్చాకా వారి pleasure కోసం అభివృద్ధి చెందినది. Middle East లో కూడా అనేక రాగాల్లో, Church లలో బహుస్వర పద్ధతిలో పాడుదురు. Affiliation లేని చోట music sophisticate అవక crude గా ఉండి folk music గానే ఉండిపోయింది. దేశాలని బట్టి ఆ దేశాల్లోని జన వికాసం, నాగరికత, ఆర్థిక స్తోమతలని, religion ని బట్టి, location ని బట్టి, classical, folk, marshal music అనే divisions ఏర్పడ్డాయి.

మొదలియార్లు ఉండే మద్రాసు క్షేత్రం చూడాడానికి వచ్చే విద్వాంసులని ఆదరించింది. వారిలో creativity వుండును. ఎడారులు, కొండ ప్రాంతాలలో సంగీతానికి అవకాశం లేదు. కాంభోజ నుండి కాంభోజి, మాల్వ నుంచి మాళవ రాగం వచ్చాయి.

Musical Maps:

Famous composers, musicologists, birth places, places with certain sculptures, manufactures of instruments, individual vertical ideas (ours), goal of practicing music is to attain satisfaction (మోక్ష). మన సంగీతం పూర్తిగా individuality తో వుంటుంది. కీర్తన, రాగం, గమకం అంతా ఎవరిది వారిదే. instruments వారు పాడిన పాటనే వాయించాలి. Western లో అలా కాదు. రెండు స్వరాలకు మధ్య హాయి ఇచ్చే గుణం ఉంది.

మనది sequence వాళ్ళది symmetrical.

మనది melody వాళ్ళది harmony.

మనది just intonation వాళ్ళది equal temperament.

ప్రతీ దేశానికి వారి సంగీతం, instruments ప్రత్యేకంగా ఉండి western influence తో కూడిన music కూడా వుంది.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here