సంగీత సురధార-14

0
8

[శాస్త్రీయ సంగీతంను పరిచయం చేస్తూ డా. సి. ఉమా ప్రసాద్ అందిస్తున్న ప్రత్యేక వ్యాసపరంపర..]

అధ్యాయం 13

శృతులు – వివిధ నిర్వచనములు – విభిన్న అభిప్రాయములు:

‘శ్రూయన్త ఇతి శృతయః’

సంగీత దర్పణ గ్రంథము:

శ్లో:

స్వరూప మాత్ర శ్రవణాత్ నాదో అనురణ నం వినా

శృతిరిత్యుచ్చతే భేదాస్త స్యాద్వా వింశతిర్మతాః

అనురణము లేనిదియు, స్వరూప మాత్రముగ మొదట వినబడునట్టి ధ్వని నాదము శృతి యనబడును. ఆ శృతి 22 భేదములగు చున్నది.

రాగ విబోధము నందు:

‘ద్వ్యంతర్నేష్టానే రవః’ – సారికల (అనగా వీణ మెట్లు) పైన వ్రాలిన తంత్రుల నుండి శబ్దించు నాదము శృతి యనబడుచున్నది.

సంగీత పారిజాతము నందు:

శ్లో:

కేశాగ్ర వ్యవధానేన భావ్యోపి శృతయ శ్రితాః।

వీణాయాశ్చతథా గాత్రే సంగీత జ్ఞానినాం మతే॥

మధ్యే పూర్వోత్తరా బద్వే వీణాయాః గాత్రయేవచా।

షడ్డ పంచమ భావేన శృతి ర్ద్వావింశతీం జగుః॥

అర్థము: మనుష్య శరీరమందును, వీణ యందును, ఒక కేశ ప్రమాణమునకొక శృతి వంతున ఎన్నియో శృతులున్నవి అని సంగీత జ్ఞానులు చెప్పుచున్నారు. వీణయందు గాని, శరీరమందుగాని షడ్డ, పంచమ ప్రకారముగ కలుగు శృతులు 22 మాత్రమే అని పెద్దలు చెప్పుచున్నారు,

మతంగుని ‘బృహాద్ధేశి’:

శ్లో:

శ్రవణార్థక్య ధాతోక్తి ప్రత్యయే చ సుసంశ్రితే।

శృతి శబ్దః ప్రసాద్యో యం శబ్దజ్ఞైః కర్మసాధనైః॥

విశ్వావసు మతము:

శ్రవణేంద్రియ గ్రాహ్యాత్వా ధ్వని రేవ శృతిర్భవేత్‌

శ్రవణేంద్రయము అనగా చెవి గ్రహించగలిగెడు ధ్వని శృతి అనబడుచున్నది.

కోహలుడు:

ద్వావింశతింకే చిదు -దాహరంతి/శృతిః శృతిజ్ఞాన విచారదక్షాః।

షట్షష్టి భిన్నాః ఖలుకే చిదాసా మానన్త్యమేవ ప్రతిపాదయంతి॥

కొందరు శృతులు (22) ద్వావింశతి అని, మరి కొందరు 66 అని చెప్పుచున్నారు.

శ్లో:

అనన్త్యంహి శృతీనాంచ సూచయంతి విపశ్చితః।

యథా ధ్వని విశేషాణా మమానంగ గనోదరే॥

ఉత్తాల పవనోద్వేల్ల జ్జలరాశి సముద్భవాః।

ఇయంత్యః ప్రతిపద్యంతేన తరంగ పరంపరాః॥

అర్థము: ఆకాశ (Space) ఉదరమున అనగా మధ్యమున జనించు నాద విభూతి అనగా సంపద యందు కలుగు శృతులను గణించుట సాధ్యము కాదు. (జలరాశి యందు) తటాకమున గల నీటి యందు గాలి వీచుటచే కల్గు తరంగముల యందు సూక్ష్మ తరంగములు (అలలు) అనేకములు ఉన్నట్లు ఒక శృతి యందు అనేక శృతులున్నవని చెప్పుచున్నారు.

ఈ గ్రంథకర్త వివరణ:

శృతులు అనంతములు కావు. ఎట్లన ఒక స్థాయి యందు 240 వేపనములు కలవు. అయిదు స్థాయిల యందు 5×240-ఒక క్షణమునకు 1200 వేపనములు. ఇవి అన్నియూ శృతులే అనుకొనిననూ ఆ సంఖ్యకు పరిమితి యున్నది.

అదియునుగాక భౌతిక శాస్త్రరీత్యా వేపనములు (Vibrations) 18 లేక 19 కి తగ్గినను, 10,000కు హెచ్చినను, చెవి వినలేదు. అంతకు హెచ్చుగా గబ్బిలము వినగలదు (వాటిని Ultra-Sonic Sounds అందురు).

అందుచేత శృతులు అనంతములు కావు అని తెలిసినది. అదియునుగాక అన్ని వేపనములు శృతులు కావు. శ్రావ్య, సంగీత యోగ్యత కలిగిన వాటి గూర్చియే మన జిజ్ఞాస, పరిశోధన, తెలిసికొను ప్రయత్నం.

పియానో వాద్యము నందు, ఆర్గన్‌ వాద్యము నందు అనుమంద్ర (Double Bass) స్థాయి యందు గల మెట్లు 16 వేపనములు కలిగియుండును. ఆధునిక పియానోలలోనూ, ఆర్గన్‌లలోనూ మొదటి స్వరము (మెట్టు) 16 వేపనములు కలిగియుండును. అతి తారస్థాయి యందు కీచురాయి ధ్వనివలె క్షణమునకు 4752 వేపనములు సంఖ్యకు దాటి వెళ్ళదు. అనుమంద్ర, అతితార స్థాయీ స్వరములకు క్రింద స్వరములుగాని, పై స్వరములు గాని గాన యోగ్యములు కావు. కనుక శృతుల సంఖ్య అనంతము కాదు. పాశ్చాత్య గాత్ర సంగీత బృందగానముల యందు 100 నుండి, 900 లేక 1000 వేపనములు (క్రణమునకు) మాత్రమే ఉండును. 100 వేపనములకు తక్కువగానైననూ 1000 వేపనములు హెచ్చుగానైనను గాన యోగ్యము కాదు. మానవ శరీరమునందుగాని, వాధ్యమునందుగాని గాన యోగ్యము కాని నాదము పలికించెడు పద్ధతి (Mechanism) లేదు.

14 వేపనములు తక్కువ వేపనములతో శబ్దము కలిగించి భయ కంపనము పుట్టించవచ్చును. అటులనే 10,000కు హెచ్చు వేపనములతో (Ultra-Sonic Sounds) మంటలార్పుచున్నారని వార్త. గబ్బిలములు ఇట్టి అతిహెచ్చు వేపనములుగల శబ్దములు చేసి వాటి దారిని కనుగొనును. అటులనే దోమలు వాటి రెక్కలచే ఇట్టి హెచ్చు వేపనములు శబ్దములు చేసి మానవులను విసిగించుచున్నవి.

22 శృతుల అంతరం:

ష = 1, 4వ శృతి

ఏ॥ రి॥ = 256/243 – పూర్ణ శృతులు

ద్వి॥ రి॥ = 16/15

త్రి॥ రి॥ = 10/9

చ॥ రి॥ = 9/8 – రి4, గ1

కో॥ సా॥ గా॥ = 32/27

సా॥ గా॥ = 6/5

అం॥ గా॥ = 5/4

తీ॥ అం॥ గా॥ = 81/64 – గ4- మ1

శు॥ మ॥ = 4/3

తీవ్ర॥ శు॥ శు2 = 27/20

ప్ర॥ మ3 = 45/32

తీ॥ ప్ర॥ మ॥ = రి4

చ్యుత పంచమ మధ్యమము = 729/512 లేదా 64/45

పంచమము = ప – ద1- ద4 – ని1 – ని4 – స (తార)

ఏ॥ రి॥; ద్వి॥ రి॥ = (256/243) x (81/80)=16/15

ద్వి॥ రి॥; త్రి॥ రి॥ = (16/15) x (25/24)=10/9

త్రి॥ రి॥; చ॥ రి॥ = (10/9)x (81/80)=9/8

చ॥ రి॥; కో॥ సా॥ గా॥ = (9/8) x (256/243)=32/27

కో॥ సా॥ గా॥; సా॥ గా॥ = (32/27) x (81/80)=6/5

సా॥ గా॥; అం॥ గా॥ = (6/8) x (25/24)=5/4

అం॥ గా॥; త్రి॥ అం॥ గా॥ = (5/4) x (81/80)=81/64

త్రి॥ అం॥ శు॥ మ = (81/64) x (256/243)=4/3

శు॥ మ॥; త్రి॥ శు॥ మధ్య = (4/3) x (81/80)=27/20

త్రి॥ శు॥ మ; ప్రతి. మధ్య = (27/20) x (25/24)=45/32

ప్ర॥ మ; చ్యుత పంచమ మధ్య = (45/32) x (81/80)=729/512

చ్యుత పంచమ మధ్య – ప॥= (729/512) x (256/243)=3/2- ప్రమాణ శృతి.

పంచమానికి ఏ॥ ద॥ = (3/2) x (256/243)=128/81 – 256/243 – ఏ॥ ద॥

ఏ॥ ద॥ ; ద్వి॥ ద॥ = (128/81) x (25/24)=8/5

ద్వి॥ ద॥; త్రి॥ ద॥ = (8/5) x (25/24)=5/3

త్రి॥ ద॥; చ॥ ద॥ = (5/3) x (81/80)=27/16

చ॥ ద॥; కోమల కై॥ ని॥ = (27/16) x (256/243)=16/9

కో॥ కై॥ ని॥; కై॥ ని॥ = (16/9) x (81/80) = 9/5

కై॥ ని॥; కా॥ ని॥= (9/5) x (25/24) = 15/8

కా॥ ని॥ చ్యుత షడ్చమ ని॥= (15/8) x (81/80)=(243/128) x (256/247)=2

చిన్నది= 7, ప్రమాణ 256/243=90 చ్యుత షడ్జ తార షడ్జ – ప్రమాణ శృతి

పెద్దది=10, పూర్ణ – 81/80=22

రెండిటి కంటే పెద్దది – 4/21 – 25/24 =70

న్యూన శృతుల మధ్య అంతరములు.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here