[శాస్త్రీయ సంగీతంను పరిచయం చేస్తూ డా. సి. ఉమా ప్రసాద్ అందిస్తున్న ప్రత్యేక వ్యాసపరంపర..]
అధ్యాయం 17 – మొదటి భాగం
72 మేళకర్తలు వివిధ నామములు:
జనక రాగ వివరము:
రాగము:
స్వర వర్ణములచే అలంకరింబడి విను వారి చిత్తమును రంజింపచేయు ధ్వని విశేషము. ఇట్టి రాగములు ముఖ్యముగా 72. వీటినే జనకరాగములు అని, మేళకర్త, ముఖ్య రూట్ రాగములని అందురు.
72 మేళకర్తల స్కీము:
సప్త స్వరముల యొక్క శుద్ధ, వికృతి భేదములచే ఏర్పడు షోడశ స్వరముల ప్రస్తారముచే ఏర్పడు మేళకర్తలు 72గా నేర్పడుచున్నవి.
సరిగమ పదని లో సరిగమ – పూర్వాంగము; పదని – ఉత్తరాంగము.
పూర్వాంగములో శుద్ధ స్వరములగు –
షడ్జ – శు॥రి॥ – శు॥ గాం॥ – శు॥ మ॥ –
ఉత్తరాంగములోని శుద్ధ స్వరములగు
పంచమ – శు॥ దై॥ – శు॥ ని॥ ప్రస్తరించిన
ఏర్పడునది మొదటి మేళకర్త రాగమగును.
పూర్వాంగ స్వర భేదములు – ఉత్తరాంగ స్వర భేదములు
- షడ్జ – శు॥రి – శు॥ గాం – శు॥ మ – లను పంచమ శు॥దై॥ – శు॥ని॥ – ఒకటవ మేళకర్త
- షడ్జ – శు॥రి – శు॥ గాం – శు॥ మ – లను పంచమ శు॥దై॥ – కై॥ని॥ – రెండవ మేళకర్త
- షడ్జ – శు॥రి – శు॥ గాం – శు॥ మ – లను పంచమ శు॥దై॥ – కా॥ని॥ – మూడవ మేళకర్త
- షడ్జ – శు॥రి – శు॥ గాం – శు॥ మ – లను పంచమ చ॥దై॥ – కై॥ని॥ – నాలుగవ మేళకర్త
- షడ్జ – శు॥రి – శు॥ గాం – శు॥ మ – లను పంచమ చ॥దై॥ – కా॥ని॥ – ఐదవ మేళకర్త
- షడ్జ – శు॥రి – శు॥ గాం – శు॥ మ – లను పంచమ చ॥దై॥ – కా॥ని॥ – ఆరవ మేళకర్త
(6-36 same)
- ఇదే విధంగా పూర్వాంగ స్వర భేదములగు స, శ, రి, సా, గాం – శు వు
- షడ్జ – శు. రి. – అం. గాం. శు. మ – 6వ మేళకర్త
- షడ్జ – చ. రి. – సా. గాం. శు. మ – 6వ మేళకర్త
- షడ్జ – చ. రి. – అం. గాం. శు. మ – 6వ మేళకర్త
- షడ్జ – ష. రి. – సా. గాం. – 6వ మేళకర్త
అనగా 6 x 6 =36 మేళకర్తలు ఏర్పడును. వీటినే శుద్ధ, మధ్యమ, మేళకర్తలని చెప్పబడును. వీటిని మరల ప్రతి॥మ॥ ప్రస్తరించిన మరియొక 36 మేళకర్తలు ఏర్పడి 36 +36 =72 మేళకర్తలు అగును. అవి 12 చక్రములుగా విభజించబడును (6 + 6 =12).
కటపయాది సంఖ్యా పథకము:
1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | |
కాదినవకము | క | ఖ | గ | ఘ | ఙ | చ | ఛ | జ | ఝ | ఞ |
టాదినవకము | ట | ఠ | డ | ఢ | ణ | త | థ | ద | ధ | న |
పాదిపంచకము | ప | ఫ | బ | భ | మ | |||||
యాద్యష్టకము | య | ర | ల | వ | శ | ష | స | హ |
ఉదాహరణ:
మా య మా ళ వ గౌ ళ
5 1 – 51 తిరగవేసిన 15
సంయుక్తాక్షరములు – ష ణ్ముఖ ప్రియ – 6 యను లెక్కవేయవలె. 5 తిరగవేసి 56
ఞ, న అక్షరములకు విలువ =0. ఉదా:
గా న మూర్తి
3 0 – 03
ఋ అను ప్రాణాక్షరమును, రి అను ప్రాణాక్షరముగా నెంచి లెక్కించుట – 4 + 1= 5 మేళకర్త రాగముల సంఖ్యల ద్వారా గుర్తెరుంగునది.
- చక్రవాకము (6 1 – 16) – గణిత శాస్త్ర రీత్యా 26 మేళము – 16 మే॥
- దివ్య మణి (8 4) – గణిత శాస్త్ర రీత్యా 18 మేళము – 48 మే॥
- విశ్వంభరి (5 4) – గణిత శాస్త్ర రీత్యా 44 మేళము – 54 మే॥
- చిత్రాంభరి (6 6) – గణిత శాస్త్ర రీత్యా 26 మేళము – 66 మే॥
- ఋషభ ప్రియ (2 6) – గణిత శాస్త్ర రీత్యా 60 మేళము – 62 మే॥
67 మేళములలే కటపయాది విధులను సరిగా అనుసరించుచున్నవి.
పూర్వ | ఉత్తర | కల్పిత మేళకర్తలు | |
శు॥మ॥ | ప్ర॥మ॥ | వేంకటమఖి | 19 మే॥ |
మే॥ | |||
1 to 36 | 37 to 72 | మరికొందరు | 20 మే॥ |
అని చెప్పిరి |
మేళ చక్రములు:
72 ను 12 సమ భాగములుగా చేసి వాటికి మేళ చక్రములు అని పేరు పెట్టెను.
- ఇందు
- నేత్ర
- అగ్ని
- వేద
- బాణ
- ఋతు
- ఋషి
- వసు
- బ్రహ్మ
- దిశి
- రుద్ర
- ఆదిత్య
మేళ సంజ్ఞలు:
6 మే॥ లకు 6 మే॥ సంజ్ఞలు కలవు. అవి 1. పా 2. శ్రి 3. గా 4. భూ 5. మా 6. షా
జాతులు:
పూర్వము రచింపబడిన సంగీత రచనలందు పేర్కొనబడి కొంతవరకు రాగములకు సంబంధించినట్టివిగా నుండు వాటిని జాతులు అందురు.
దాట్ – హిందుస్థానీ సంగీతములో మే॥ రాగమునకు ‘దాట్’ అని పేరు.
సంపూర్ణ మేళములు:
ఆరోహణ, అవరోహణలో అన్ని స్వరములు ఉండుట. ఉదాహరణ – కనకాంగి, రత్నాంగి, గానమూర్తి – మొదలగునవి.
అసంపూర్ణ మేళములు:
వేంకటమఖి ‘రాగతాళ చింతామణి’ సంపూర్ణములు కానట్టి 19 (లేదా) 20 మే॥. ఉదా. నారీ రీతి గౌళ, కిరణావళి, శ్రీరాగము, హరి కేదార గౌళ
1. నారీ రీతి గౌళ
20వ మే॥
సా గా మ ని ద ప ని స
సా ని నీ ద ప మా గ గ రి స
2. కిరణావళి
21వ మే॥
స రి మ ప ద ప ద ని స
స ని ప ద ప మ ప గ రి స
3. శ్రీరాగము
22వ మే॥
స రి మ ప ని స
స ని ప ద ని ప మ రి గ రి స
4. హరి కేదార గౌళ
25వ మే॥
సా రి మ ప ని స
సా ని ద ప మ గ ని స
మూర్ఛనాకారక మేళ వివరణ:
72 మే॥ ఏ గాక, మిగతా స్వరములకు రి, గ, మ, ప, ద, ని – 1 (లేదా) 2 (లేదా) 3 (లేదా) అంతకంటే ఎక్కువ గాని స్వరములను గ్రహ స్వరములు చేసి మూర్ఛన గావించినచో యింకొక మేళము వచ్చుట.
మూర్ఛనాకారక మేళ సంఖ్య:
1 నుండి 5 వరకు గల – 5 మే॥
7 నుండి 11 వరకు గల – 5 మే॥
13 నుండి 30 వరకు గల – 18 మే॥
32 నుండి 36 వరకు గల – 5 మే॥
43 నుండి 46 వరకు గల – 5 మే॥
51 నుండి (1వ మే॥) – 1 మే॥
53 నుండి 66 వరకు గల – 14 మే॥
69 నుండి 72 వరకు గల – 4 మే॥
కలిపి యేర్పడు 5+5+18+5+4+1+14+4 = 56 మే॥
మేళము నందలి గ్రహ స్వర సంఖ్య:
ఏక మూర్ఛనా మేళములు – 20. వాటిలో పుట్టినవి – 20 x 1=20 మే॥
ద్వి మూర్ఛనా మేళములు – 18. వాటిలో పుట్టినవి – 18 x 2=36 మే॥
త్రి మూర్ఛనా మేళములు – 12. వాటిలో పుట్టినవి – 12 x 3=36 మే॥
పంచ మూర్ఛనా మేళములు – 6. వాటిలో పుట్టినవి – 6 x 5=30 మే॥
56 లోను పుట్టు మే॥ మొత్తము 122 అగును.
~
- పై 122 మే॥ – రి మూర్ఛనల వల్ల ఏర్పడునవి – 17 మే॥
- పై 122 మే॥ – గ మూర్ఛనల వల్ల ఏర్పడునవి – 20 మే॥
- పై 122 మే॥ – మ మూర్ఛనల వల్ల ఏర్పడునవి – 24 మే॥
- పై 122 మే॥ – ప మూర్ఛనల వల్ల ఏర్పడునవి – 24 మే॥
- పై 122 మే॥ – ద మూర్ఛనల వల్ల ఏర్పడునవి – 20 మే॥
- పై 122 మే॥ – ని మూర్ఛనల వల్ల ఏర్పడునవి – 17 మే॥
అమూర్ఛనా కారక మేళం:
56 గాక మిగతా 16 మే॥ – ఏ మేళములో, ఏ స్వరమును గ్రహ స్వరము చేసినను యింకొక మేళము ఏర్పడునట్టి మేళము.
- తాన రూపి – 6వ మే॥
- రూపవతి – 12వ మే॥
- యాగ ప్రియ – 31వ మే॥
- సాలగము – 37వ మే॥
- జలార్ణము – 38వ మే॥
- ఝాలవరాళి – 39వ మే॥
- నవనీతము – 40వ మే॥
- పావని – 41వ మే॥
- రఘుప్రియ – 42వ మే॥
- సువర్ణాంగి – 47వ మే॥
- దివ్యమణి – 48వ మే॥
- ధవళాంబరి – 49వ మే॥
- నామనారయణి – 50వ మే॥
- రామప్రియ – 52వ మే॥
- సుచరిత్ర – 67వ మే॥
- జ్యోతి స్వరూపిణి – 67వ మే॥ యగును.
పూర్వము యిప్పుడును ఒకే పేరు గల మే॥ లు:
- మాయా మాళవ గౌళ – 15వ మే॥
- ధీర శం॥ -29వ మే॥
- చలనాట – 36వ మే॥
పూర్వము మే॥ లనబడిన యిప్పటి జన్యరాగములు:
- తోయవేగవాహిని – 16
- నారీ రీతిగౌళ – 20
- కిరణావళి -21
- శ్రీరాగము – 22
- హరి కేదారగౌళ – 28
- శైలదేశాక్షి – 35
- జగన్మోహనము -28
పూర్వము ఉపాంగం – ఇప్పటి భాషాంగం:
- ఖమాసు – (28 జన్య)
- కాంభోజి – (28 జన్య)
పూర్వ మేళకర్తలు (లేక)
శుద్ధ మధ్యమ (1-36) |
మేళకర్తల స్వరములు | ||
మేళ కర్త సంఖ్య | గోవిందాచారి పెట్టిన నాముములు | వేంకటమఖి పెట్టిన నామములు | స-రి-గ-మ-ప-ద-ని-స
రి-గ same |
1. ఇందు చక్రము | |||
1. | కనకాంగి | కనకాంబరి | స-శు-శు-శు-ప- శు – శు |
2. | రత్నాంగి | ఫేనద్యుతి | స-శు-శు-శు-ప- శు – కై |
3. | గానమూర్తి | గానసామవరాళి | స-శు-శు-శు-ప- శు – కా |
4. | వనస్పతి | భానుమతి | స-శు-శు-శు-ప- చ – కై |
5. | మానవతి | మనోరంజని | స-శు-శు-శు-ప- చ – కా |
6. | తానరూపి | తనుకీర్తి | స-శు-శు-శు-ప- ష – కా |
2. నేత్ర చక్రము | |||
7. | సేనావతి | సేనాగ్రణి | ష-శు-సా-శు-పం- శు – శు |
8. | హనుమతోడి | జనతోడి | ష-శు-సా-శు-పం- శు – కై |
9. | ధేనుక | దునిభిన్నషడ్డము | ష-శు-సా-శు-పం- శు – కా |
10. | నాటక ప్రియ | నటాభరణము | ష-శు-సా-శు-పం- చ – కై |
11. | కోకిల ప్రియ | కోకిలారవము | ష-శు-సా-శు-పం- చ – కా |
12. | రూపవతి | రూపవతి | ష-శు-సా-శు-పం- ష – కా |
3. అగ్ని చక్రము | |||
13. | గాయక ప్రియ | గేయ హెజ్టిజ్జి | ష-శు-అం-శు-పం- శు- శు |
14. | వకుళాభరణం | వాటివసంతభైరవి | ష-శు-అం-శు-పం- శు- కై |
15. | మాయామాళవగౌళ | మాయామాళవగౌళ | ష-శు-అం-శు-పం- శు- కా |
16. | చక్రవాకము | తోయవేగవాహిని | ష-శు-అం-శు-పం- చ- కై |
17. | సూర్యకాంతం | ఛాయవతి | ష-శు-అం-శు-పం- చ- కా |
18. | హటకాంబరి | జయశుద్ధమాళవి | ష-శు-అం-శు-పం- ష – కా |
4. వేద చక్రము | |||
19. | ఝుంకార ధ్వని | ఝుంకార భ్రమరి | ష-చ-సా-శు-పం- శు – శు |
20. | నఠబైరవి | నారీ రీతిగౌళ | ష-చ-సా-శు-పం- శు – కై |
21. | కీరవాణి | కిరణావళి | ష-చ-సా-శు-పం- శు – కా |
22. | ఖరహరప్రియ | శ్రీరాగము | ష-చ-సా-శు-పం- చ – కై |
23. | గౌరీమనోమరి | గౌరీవేళావళి | ష-చ-సా-శు-పం- చ – కా |
24. | వరుణప్రియ | వీర వసంతము | ష-చ-సా-శు-పం- ష – కా |
5. బాణ చక్రము | |||
25. | మారరంజని | శరావతి | ష-చ-అం-శు-పం-శు-శు |
26. | చారుకేశి | తరంగిణి | ష-చ-అం-శు-పం-శు-కై |
27. | సరసాంగి | సౌరసేవ | ష-చ-అం-శు-పం-శు-కా |
28. | హరికాంభోజి | హరికేదారగౌళ | ష-చ-అం-శు-పం-చ-కై |
29. | ధీరశంకరాభరణము | ధీరశంకరాభరణము | ష-చ-అం-శు-పం-చ-కా |
30. | నాగనందిని | నాగాభరణము | ష-చ-అం-శు-పం-ష-కా |
6. బుతు చక్రము | |||
31. | యాగ ప్రియ | కలావతి | ష-ష-అం-శు-పం-శు-శు |
32. | రాగవర్ధని | రాగచూడామణి | ష-ష-అం-శు-పం-శు-కై |
33. | గాంగేయభూషిణి | గంగాతరంగిణి | ష-ష-అం-శు-పం-శు-కా |
34. | వాగధీశ్వరి | భోగచ్ఛాయానాట | ష-ష-అం-శు-పం-చ-కై |
35. | శూలిని | శైల దేశాక్షి | ష-ష-అం-శు-పం-చ-కా |
36. | చలనాట | చలనాట | ష-ష-అం-శు-పం-ష-కా |
ఉత్తర మేళకర్తలు (లేక)
ప్రతి మధ్యమ (37-72) |
మేళకర్తల స్వరములు | ||
గోవిందాచారి పెట్టిన నాముములు | వేంకటమఖి పెట్టిన నామములు | ||
7. బుషి చక్రము | |||
37. | సాలగము | సౌగంధిని | ష-శు-శు-ప్ర-పం-శు-శు |
38. | జలారవము | జగన్మోహనము | ష-శు-సా-ప్ర-పం-శు-కై |
39. | ఝూలవరాళి | ధాలివరాళి | ష-శు-అం-ప్ర-పం-శు-కా |
40. | నవనీతము | నభోమణి | ష-చ-సా-ప్ర-పం-చ-కై |
41. | పావని | కుంభిని | ష-చ-అం-ప్ర-పం-చ-కా |
42. | రఘుప్రియ | రవిక్రియ | ష-ష-అం-ప్ర-పం-ష-కా |
8. వసు చక్రము | |||
43. | గవాంబోధి | గీర్వాణి | ష-శు-సా-ప్ర-పం-శు-శు |
44. | భవప్రియ | భవాని | ష-శు-సా-ప్ర-పం-శు-కై |
45. | శుభపంతువరాశి | శివపంతువరాళి | ష-శు-సా-ప్ర-పం-శు-కా |
46. | షడ్విధమార్గిణి | స్తవరాజము | ష-శు-సా-ప్ర-పం-చ-కై |
47. | సువర్ణాంగి | సౌవీరము | ష-శు-సా-ప్ర-పం-చ-కా |
48. | దివ్యమణి | జీవంతిని | ష-శు-సా-ప్ర-పం-ష-కా |
9. బ్రహ్మ చక్రము | |||
49. | ధవళాంబరి | ధవళాంగము | ష-శు-అం-ప్ర-పం-శు-శు |
50. | నామనారాయణ | నామదేశి | ష-శు-అం-ప్ర-పం-శు-కై |
51. | కామవర్ధని | కాశిరామక్రియ | ష-శు-అం-ప్ర-పం-శు-కా |
52. | రామప్రియ | రమామనోహరి | ష-శు-అం-ప్ర-పం-చ-కై |
53. | గమనశ్రమ | గమకగ్రియ | ష-శు-అం-ప్ర-పం-చ-కా |
54. | విశ్వంబరి | వంశవతి | ష-శు-అం-ప్ర-పం-ష-కా |
10. దిశి చక్రము | |||
55. | శ్యామళాంగి | శ్యామళ | ష-చ-సా-ప్ర-పం-శు-శు |
56. | షణ్ముఖప్రియ | చామరము | ష-చ-సా-ప్ర-పం-శు-కై |
57. | సింహేంద్రమధ్యమము | సుమద్యుతి | ష-చ-సా-ప్ర-పం-శు-కా |
58. | హేమవతి | దేశిసింహారవము | ష-చ-సా-ప్ర-పం-చ-కై |
59. | ధర్మవతి | ధామవతి | ష-చ-సా-ప్ర-పం-చ-కా |
60. | నీతిమతి | నిషధము | ష-చ-సా-ప్ర-పం-ష-కా |
11. రుద్ర చక్రము | |||
61. | కాంతామణి | కుంతలము | ష-చ-అం-ప్ర-పం-శు-శు |
62. | బుషభప్రియ | రతిప్రియ | ష-చ-అం-ప్ర-పం-శు-కై |
63. | లతాంగి | గీతప్రియ | ష-చ-అం-ప్ర-పం-శు-కా |
64. | వాచస్పతి | భూషావతి | ష-చ-అం-ప్ర-పం-చ-కై |
65. | మేచకళ్యాణి | శాంతకళ్యాణి | ష-చ-అం-ప్ర-పం-చ-కా |
66. | చిత్రాంబరి | చతురంగిణి | ష-చ-అం-ప్ర-పం-ష-కా |
12. ఆదిత్య చక్రము | |||
67. | సుచరిత్ర | సంతానమంజరి | ష-ష-అం-ప్ర-పం-శు-శు |
68. | జ్యోతిస్వరూపిణి | జ్యోతిరాగము | ష-ష-అం-ప్ర-పం-శు-కై |
69. | ధాతువర్ణిని | ధౌతపంచమము | ష-ష-అం-ప్ర-పం-శు-కా |
70. | నాసికాభూషణి | నాసామణి | ష-ష-అం-ప్ర-పం-చ-కై |
71. | కోసలము | కుసుమాకరము | ష-ష-అం-ప్ర-పం-చ-కా |
72. | రసికప్రియ | రసమంజరి | ష-ష-అం-ప్ర-పం-ష-కా |
(ఇంకా ఉంది)