సంగీత సురధార-18

0
9

[శాస్త్రీయ సంగీతంను పరిచయం చేస్తూ డా. సి. ఉమా ప్రసాద్ అందిస్తున్న ప్రత్యేక వ్యాసపరంపర..]

అధ్యాయం 17 – మొదటి భాగం

72 మేళకర్తలు వివిధ నామములు:

జనక రాగ వివరము:

రాగము:

స్వర వర్ణములచే అలంకరింబడి విను వారి చిత్తమును రంజింపచేయు ధ్వని విశేషము. ఇట్టి రాగములు ముఖ్యముగా 72. వీటినే జనకరాగములు అని, మేళకర్త, ముఖ్య రూట్ రాగములని అందురు.

72 మేళకర్తల స్కీము:

సప్త స్వరముల యొక్క శుద్ధ, వికృతి భేదములచే ఏర్పడు షోడశ స్వరముల ప్రస్తారముచే ఏర్పడు మేళకర్తలు 72గా నేర్పడుచున్నవి.

సరిగమ పదని లో సరిగమ – పూర్వాంగము; పదని – ఉత్తరాంగము.

పూర్వాంగములో శుద్ధ స్వరములగు –

షడ్జ – శు॥రి॥ – శు॥ గాం॥ – శు॥ మ॥ –

ఉత్తరాంగములోని శుద్ధ స్వరములగు

పంచమ – శు॥ దై॥ – శు॥ ని॥ ప్రస్తరించిన

ఏర్పడునది మొదటి మేళకర్త రాగమగును.

పూర్వాంగ స్వర భేదములు – ఉత్తరాంగ స్వర భేదములు

  1. షడ్జ – శు॥రి – శు॥ గాం – శు॥ మ – లను పంచమ శు॥దై॥ – శు॥ని॥ – ఒకటవ మేళకర్త
  2. షడ్జ – శు॥రి – శు॥ గాం – శు॥ మ – లను పంచమ శు॥దై॥ – కై॥ని॥ – రెండవ మేళకర్త
  3. షడ్జ – శు॥రి – శు॥ గాం – శు॥ మ – లను పంచమ శు॥దై॥ – కా॥ని॥ – మూడవ మేళకర్త
  4. షడ్జ – శు॥రి – శు॥ గాం – శు॥ మ – లను పంచమ చ॥దై॥ – కై॥ని॥ – నాలుగవ మేళకర్త
  5. షడ్జ – శు॥రి – శు॥ గాం – శు॥ మ – లను పంచమ చ॥దై॥ – కా॥ని॥ – ఐదవ మేళకర్త
  6. షడ్జ – శు॥రి – శు॥ గాం – శు॥ మ – లను పంచమ చ॥దై॥ – కా॥ని॥ – ఆరవ మేళకర్త

(6-36 same)

  1. ఇదే విధంగా పూర్వాంగ స్వర భేదములగు స, శ, రి, సా, గాం – శు వు
  2. షడ్జ – శు. రి. – అం. గాం. శు. మ – 6వ మేళకర్త
  3. షడ్జ – చ. రి. – సా. గాం. శు. మ – 6వ మేళకర్త
  4. షడ్జ – చ. రి. – అం. గాం. శు. మ – 6వ మేళకర్త
  5. షడ్జ – ష. రి. – సా. గాం. – 6వ మేళకర్త

అనగా 6 x 6 =36 మేళకర్తలు ఏర్పడును. వీటినే శుద్ధ, మధ్యమ, మేళకర్తలని చెప్పబడును. వీటిని మరల ప్రతి॥మ॥ ప్రస్తరించిన మరియొక 36 మేళకర్తలు ఏర్పడి 36 +36 =72 మేళకర్తలు అగును. అవి 12 చక్రములుగా విభజించబడును (6 + 6 =12).

కటపయాది సంఖ్యా పథకము:

1 2 3 4 5 6 7 8 9 10
కాదినవకము
టాదినవకము
పాదిపంచకము
యాద్యష్టకము

ఉదాహరణ:

మా య మా ళ వ గౌ ళ

5     1   – 51  తిరగవేసిన 15

సంయుక్తాక్షరములు – ష ణ్ముఖ ప్రియ – 6 యను లెక్కవేయవలె. 5 తిరగవేసి 56

ఞ, న అక్షరములకు విలువ =0. ఉదా:

గా న మూర్తి

3   0  – 03

ఋ అను ప్రాణాక్షరమును, రి అను ప్రాణాక్షరముగా నెంచి లెక్కించుట – 4 + 1= 5 మేళకర్త రాగముల సంఖ్యల ద్వారా గుర్తెరుంగునది.

  1. చక్రవాకము (6 1 – 16) – గణిత శాస్త్ర రీత్యా 26 మేళము – 16 మే॥
  2. దివ్య మణి (8 4) – గణిత శాస్త్ర రీత్యా 18 మేళము – 48 మే॥
  3. విశ్వంభరి (5 4) – గణిత శాస్త్ర రీత్యా 44 మేళము – 54 మే॥
  4. చిత్రాంభరి (6 6) – గణిత శాస్త్ర రీత్యా 26 మేళము – 66 మే॥
  5. ఋషభ ప్రియ (2 6) – గణిత శాస్త్ర రీత్యా 60 మేళము – 62 మే॥

67 మేళములలే కటపయాది విధులను సరిగా అనుసరించుచున్నవి.

పూర్వ ఉత్తర కల్పిత మేళకర్తలు
శు॥మ॥ ప్ర॥మ॥ వేంకటమఖి 19 మే॥
మే॥
1 to 36 37 to 72 మరికొందరు 20 మే॥
అని చెప్పిరి

మేళ చక్రములు:

72 ను 12 సమ భాగములుగా చేసి వాటికి మేళ చక్రములు అని పేరు పెట్టెను.

  1. ఇందు
  2. నేత్ర
  3. అగ్ని
  4. వేద
  5. బాణ
  6. ఋతు
  7. ఋషి
  8. వసు
  9. బ్రహ్మ
  10. దిశి
  11. రుద్ర
  12. ఆదిత్య

మేళ సంజ్ఞలు:

6 మే॥ లకు 6 మే॥ సంజ్ఞలు కలవు. అవి 1. పా 2. శ్రి 3. గా 4. భూ 5. మా 6. షా

జాతులు:

పూర్వము రచింపబడిన సంగీత రచనలందు పేర్కొనబడి కొంతవరకు రాగములకు సంబంధించినట్టివిగా నుండు వాటిని జాతులు అందురు.

దాట్ – హిందుస్థానీ సంగీతములో మే॥ రాగమునకు ‘దాట్’ అని పేరు.

సంపూర్ణ మేళములు:

ఆరోహణ, అవరోహణలో అన్ని స్వరములు ఉండుట. ఉదాహరణ – కనకాంగి, రత్నాంగి, గానమూర్తి – మొదలగునవి.

అసంపూర్ణ మేళములు:

వేంకటమఖి ‘రాగతాళ చింతామణి’ సంపూర్ణములు కానట్టి 19 (లేదా) 20 మే॥. ఉదా. నారీ రీతి గౌళ, కిరణావళి, శ్రీరాగము, హరి కేదార గౌళ

1. నారీ రీతి గౌళ

20వ మే॥

సా గా మ ని ద ప ని స

సా ని  నీ  ద ప మా గ గ రి స

2. కిరణావళి

21వ మే॥

స రి మ ప ద ప ద ని స

స ని ప ద ప మ ప గ రి స

3. శ్రీరాగము

22వ మే॥

స రి మ ప ని స

స ని ప ద ని ప మ రి  గ రి స

4. హరి కేదార గౌళ

25వ మే॥

సా రి మ ప ని స

సా ని ద ప మ గ ని స

మూర్ఛనాకారక మేళ వివరణ:

72 మే॥ ఏ గాక, మిగతా స్వరములకు రి, గ, మ, ప, ద, ని – 1 (లేదా) 2 (లేదా) 3 (లేదా) అంతకంటే ఎక్కువ గాని స్వరములను గ్రహ స్వరములు చేసి మూర్ఛన గావించినచో యింకొక మేళము వచ్చుట.

మూర్ఛనాకారక మేళ సంఖ్య:

1 నుండి 5 వరకు గల – 5 మే॥

7 నుండి 11 వరకు గల – 5 మే॥

13 నుండి 30 వరకు గల – 18 మే॥

32 నుండి 36 వరకు గల – 5 మే॥

43 నుండి 46 వరకు గల – 5 మే॥

51 నుండి (1వ మే॥) – 1 మే॥

53 నుండి 66 వరకు గల – 14 మే॥

69 నుండి 72 వరకు గల – 4 మే॥

కలిపి యేర్పడు 5+5+18+5+4+1+14+4 = 56 మే॥

మేళము నందలి గ్రహ స్వర సంఖ్య:

ఏక మూర్ఛనా మేళములు – 20. వాటిలో పుట్టినవి – 20 x 1=20 మే॥

ద్వి మూర్ఛనా మేళములు – 18. వాటిలో పుట్టినవి – 18 x 2=36 మే॥

త్రి మూర్ఛనా మేళములు – 12. వాటిలో పుట్టినవి – 12 x 3=36 మే॥

పంచ మూర్ఛనా మేళములు – 6. వాటిలో పుట్టినవి – 6 x 5=30 మే॥

56 లోను పుట్టు మే॥ మొత్తము 122 అగును.

~

  • పై 122 మే॥ – రి మూర్ఛనల వల్ల ఏర్పడునవి – 17 మే॥
  • పై 122 మే॥ – గ మూర్ఛనల వల్ల ఏర్పడునవి – 20 మే॥
  • పై 122 మే॥ – మ మూర్ఛనల వల్ల ఏర్పడునవి – 24 మే॥
  • పై 122 మే॥ – ప మూర్ఛనల వల్ల ఏర్పడునవి – 24 మే॥
  • పై 122 మే॥ – ద మూర్ఛనల వల్ల ఏర్పడునవి – 20 మే॥
  • పై 122 మే॥ – ని మూర్ఛనల వల్ల ఏర్పడునవి – 17 మే॥

అమూర్ఛనా కారక మేళం:

56 గాక మిగతా 16 మే॥  – ఏ మేళములో, ఏ స్వరమును గ్రహ స్వరము చేసినను యింకొక మేళము ఏర్పడునట్టి మేళము.

  1. తాన రూపి – 6వ మే॥
  2. రూపవతి – 12వ మే॥
  3. యాగ ప్రియ – 31వ మే॥
  4. సాలగము – 37వ మే॥
  5. జలార్ణము – 38వ మే॥
  6. ఝాలవరాళి – 39వ మే॥
  7. నవనీతము – 40వ మే॥
  8. పావని – 41వ మే॥
  9. రఘుప్రియ – 42వ మే॥
  10. సువర్ణాంగి – 47వ మే॥
  11. దివ్యమణి – 48వ మే॥
  12. ధవళాంబరి – 49వ మే॥
  13. నామనారయణి – 50వ మే॥
  14. రామప్రియ – 52వ మే॥
  15. సుచరిత్ర – 67వ మే॥
  16. జ్యోతి స్వరూపిణి – 67వ మే॥ యగును.

పూర్వము యిప్పుడును ఒకే పేరు గల మే॥ లు:

  1. మాయా మాళవ గౌళ – 15వ మే॥
  2. ధీర శం॥ -29వ మే॥
  3. చలనాట – 36వ మే॥

పూర్వము మే॥ లనబడిన యిప్పటి జన్యరాగములు:

  1. తోయవేగవాహిని – 16
  2. నారీ రీతిగౌళ – 20
  3. కిరణావళి -21
  4. శ్రీరాగము – 22
  5. హరి కేదారగౌళ – 28
  6. శైలదేశాక్షి – 35
  7. జగన్మోహనము -28

పూర్వము ఉపాంగం – ఇప్పటి భాషాంగం:

  1. ఖమాసు – (28 జన్య)
  2. కాంభోజి – (28 జన్య)
పూర్వ మేళకర్తలు (లేక)

శుద్ధ మధ్యమ (1-36)

మేళకర్తల స్వరములు
మేళ కర్త సంఖ్య గోవిందాచారి పెట్టిన నాముములు వేంకటమఖి పెట్టిన నామములు స-రి-గ-మ-ప-ద-ని-స

రి-గ same

1. ఇందు చక్రము
1. కనకాంగి కనకాంబరి స-శు-శు-శు-ప- శు – శు
2. రత్నాంగి ఫేనద్యుతి స-శు-శు-శు-ప- శు – కై
3. గానమూర్తి గానసామవరాళి స-శు-శు-శు-ప- శు – కా
4. వనస్పతి భానుమతి స-శు-శు-శు-ప- చ – కై
5. మానవతి మనోరంజని స-శు-శు-శు-ప- చ – కా
6. తానరూపి తనుకీర్తి స-శు-శు-శు-ప- ష – కా
2. నేత్ర చక్రము
7. సేనావతి సేనాగ్రణి ష-శు-సా-శు-పం- శు – శు
8. హనుమతోడి జనతోడి ష-శు-సా-శు-పం- శు – కై
9. ధేనుక దునిభిన్నషడ్డము ష-శు-సా-శు-పం- శు – కా
10. నాటక ప్రియ నటాభరణము ష-శు-సా-శు-పం- చ – కై
11. కోకిల ప్రియ కోకిలారవము ష-శు-సా-శు-పం- చ – కా
12. రూపవతి రూపవతి ష-శు-సా-శు-పం- ష – కా
3. అగ్ని చక్రము
13. గాయక ప్రియ గేయ హెజ్టిజ్జి ష-శు-అం-శు-పం- శు- శు
14. వకుళాభరణం వాటివసంతభైరవి ష-శు-అం-శు-పం- శు- కై
15. మాయామాళవగౌళ మాయామాళవగౌళ ష-శు-అం-శు-పం- శు- కా
16. చక్రవాకము తోయవేగవాహిని ష-శు-అం-శు-పం- చ- కై
17. సూర్యకాంతం ఛాయవతి ష-శు-అం-శు-పం- చ- కా
18. హటకాంబరి జయశుద్ధమాళవి ష-శు-అం-శు-పం- ష – కా
4. వేద చక్రము
19. ఝుంకార ధ్వని ఝుంకార భ్రమరి ష-చ-సా-శు-పం- శు – శు
20. నఠబైరవి నారీ రీతిగౌళ ష-చ-సా-శు-పం- శు – కై
21. కీరవాణి కిరణావళి ష-చ-సా-శు-పం- శు – కా
22. ఖరహరప్రియ శ్రీరాగము ష-చ-సా-శు-పం- చ – కై
23. గౌరీమనోమరి గౌరీవేళావళి ష-చ-సా-శు-పం- చ – కా
24. వరుణప్రియ వీర వసంతము ష-చ-సా-శు-పం- ష – కా
5. బాణ చక్రము
25. మారరంజని శరావతి ష-చ-అం-శు-పం-శు-శు
26. చారుకేశి తరంగిణి ష-చ-అం-శు-పం-శు-కై
27. సరసాంగి సౌరసేవ ష-చ-అం-శు-పం-శు-కా
28. హరికాంభోజి హరికేదారగౌళ ష-చ-అం-శు-పం-చ-కై
29. ధీరశంకరాభరణము ధీరశంకరాభరణము ష-చ-అం-శు-పం-చ-కా
30. నాగనందిని నాగాభరణము ష-చ-అం-శు-పం-ష-కా
6. బుతు చక్రము
31. యాగ ప్రియ కలావతి ష-ష-అం-శు-పం-శు-శు
32. రాగవర్ధని రాగచూడామణి ష-ష-అం-శు-పం-శు-కై
33. గాంగేయభూషిణి గంగాతరంగిణి ష-ష-అం-శు-పం-శు-కా
34. వాగధీశ్వరి భోగచ్ఛాయానాట ష-ష-అం-శు-పం-చ-కై
35. శూలిని శైల దేశాక్షి ష-ష-అం-శు-పం-చ-కా
36. చలనాట చలనాట ష-ష-అం-శు-పం-ష-కా
ఉత్తర మేళకర్తలు (లేక)

ప్రతి మధ్యమ (37-72)

మేళకర్తల స్వరములు
గోవిందాచారి పెట్టిన నాముములు వేంకటమఖి పెట్టిన నామములు
7. బుషి చక్రము
37. సాలగము సౌగంధిని ష-శు-శు-ప్ర-పం-శు-శు
38. జలారవము జగన్మోహనము ష-శు-సా-ప్ర-పం-శు-కై
39. ఝూలవరాళి ధాలివరాళి ష-శు-అం-ప్ర-పం-శు-కా
40. నవనీతము నభోమణి ష-చ-సా-ప్ర-పం-చ-కై
41. పావని కుంభిని ష-చ-అం-ప్ర-పం-చ-కా
42. రఘుప్రియ రవిక్రియ ష-ష-అం-ప్ర-పం-ష-కా
8. వసు చక్రము
43. గవాంబోధి గీర్వాణి ష-శు-సా-ప్ర-పం-శు-శు
44. భవప్రియ భవాని ష-శు-సా-ప్ర-పం-శు-కై
45. శుభపంతువరాశి శివపంతువరాళి ష-శు-సా-ప్ర-పం-శు-కా
46. షడ్విధమార్గిణి స్తవరాజము ష-శు-సా-ప్ర-పం-చ-కై
47. సువర్ణాంగి సౌవీరము ష-శు-సా-ప్ర-పం-చ-కా
48. దివ్యమణి జీవంతిని ష-శు-సా-ప్ర-పం-ష-కా
9. బ్రహ్మ చక్రము
49. ధవళాంబరి ధవళాంగము ష-శు-అం-ప్ర-పం-శు-శు
50. నామనారాయణ నామదేశి ష-శు-అం-ప్ర-పం-శు-కై
51. కామవర్ధని కాశిరామక్రియ ష-శు-అం-ప్ర-పం-శు-కా
52. రామప్రియ రమామనోహరి ష-శు-అం-ప్ర-పం-చ-కై
53. గమనశ్రమ గమకగ్రియ ష-శు-అం-ప్ర-పం-చ-కా
54. విశ్వంబరి వంశవతి ష-శు-అం-ప్ర-పం-ష-కా
10. దిశి చక్రము
55. శ్యామళాంగి శ్యామళ ష-చ-సా-ప్ర-పం-శు-శు
56. షణ్ముఖప్రియ చామరము ష-చ-సా-ప్ర-పం-శు-కై
57. సింహేంద్రమధ్యమము సుమద్యుతి ష-చ-సా-ప్ర-పం-శు-కా
58. హేమవతి దేశిసింహారవము ష-చ-సా-ప్ర-పం-చ-కై
59. ధర్మవతి ధామవతి ష-చ-సా-ప్ర-పం-చ-కా
60. నీతిమతి నిషధము ష-చ-సా-ప్ర-పం-ష-కా
11. రుద్ర చక్రము
61. కాంతామణి కుంతలము ష-చ-అం-ప్ర-పం-శు-శు
62. బుషభప్రియ రతిప్రియ ష-చ-అం-ప్ర-పం-శు-కై
63. లతాంగి గీతప్రియ ష-చ-అం-ప్ర-పం-శు-కా
64. వాచస్పతి భూషావతి ష-చ-అం-ప్ర-పం-చ-కై
65. మేచకళ్యాణి శాంతకళ్యాణి ష-చ-అం-ప్ర-పం-చ-కా
66. చిత్రాంబరి చతురంగిణి ష-చ-అం-ప్ర-పం-ష-కా
12. ఆదిత్య చక్రము
67. సుచరిత్ర సంతానమంజరి ష-ష-అం-ప్ర-పం-శు-శు
68. జ్యోతిస్వరూపిణి జ్యోతిరాగము ష-ష-అం-ప్ర-పం-శు-కై
69. ధాతువర్ణిని ధౌతపంచమము ష-ష-అం-ప్ర-పం-శు-కా
70. నాసికాభూషణి నాసామణి ష-ష-అం-ప్ర-పం-చ-కై
71. కోసలము కుసుమాకరము ష-ష-అం-ప్ర-పం-చ-కా
72. రసికప్రియ రసమంజరి ష-ష-అం-ప్ర-పం-ష-కా

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here