సంగీత సురధార-19

0
9

[శాస్త్రీయ సంగీతంను పరిచయం చేస్తూ డా. సి. ఉమా ప్రసాద్ అందిస్తున్న ప్రత్యేక వ్యాసపరంపర..]

అధ్యాయం 17 – రెండవ భాగం

రాగము, నిర్వచన, విభజన పద్ధతులు:

రాగము: స్వరములు ప్రస్తరించుట:

[dropcap]స్వర[/dropcap] వర్ణములచే అలంకరింపబడి వినువారి చిత్తమును రంజింపజేయుట.

స్వర వర్ణములు అనగా చతుర్వర్ణములైన 1. స్థాయి 2. ఆరోహి 3. అవరోహి 4. సంచారి.

ద్వాదశ స్వర స్థానముల నుండి ప్రస్తరింపబడుతున్న రాగములు అనంతములు.

అనంతాశ్చ రాగారి త్యాగరాజు స్వామి తన కృతి ‘చిత్ర రత్నమయ’ (ఖరహరప్రియ)లో వింతరాగాలు పేర్కొన్నాడు.

రాగ వంశ వృక్షము:

రాగముల విభజన:

  1. కొన్ని రాగములలో కోమల స్వరములు మాత్రమే వచ్చును. ఉదా: 8వ హనుమతోడి
  2. కొన్ని రాగములు కేవలము తీవ్ర స్వరములు. ఉదా: మేచ కళ్యాణి
  3. మరికొన్ని రాగములలో కొన్ని కోమల, కొన్ని తీవ్ర స్వరములు. ఉదా: మాయ మాళవ గౌళ
  4. కొన్ని రాగములలో ఒకే స్వరము తన స్థానముననే వేరొక స్వర నామముతో పిలుచుట. ఉదా: కనకాంగిలో శు॥ రిషభము శు॥గాం. శు॥గా॥ స్థానం చ॥రి॥.
  5. ఒకే స్వరము యొక్క ఒకే వికృతి భేదము వచ్చు రాగములు కొన్ని కలవు. వీనిని ఉపాంగ జన్య రాగములందరు. ఉదా: మోహన శ్రీరంజని.
  6. ఒకే స్వరము యొక్క రెండు వికృతి భేదములు అవి అన్నియు ఒకే వర్ణముగా ఏర్పడును. ఇవి జన్య రాగములు గానే యుండును. ఇవి భాషాంగ రాగములు. ఉదా: కాంభోజి, భైరవి, సారంగ మొదలగునవి.

ఆరోహణ, అవరోహణ క్రమములను బట్టి రాగ విభజన:

ఆరోహణ, అవరోహణ క్రమములను బట్టి కూడా రాగములను విభజించవచ్చు.

  1. సప్త స్వరములన్నీ ఆరోహణ, అవరోహణ నందు విడివిడిగా వచ్చు రాగములు (లేక) సంపూర్ణత్వము
  2. ఆరోహణ, అవరోహణ క్రమగతిలో నుండుట (లేక) క్రమ సంపూర్ణత్వము
  3. స్వరములు వికృతి భేదములు కల్గి యుండుట (లేక) స్వరముల ఏకగుణత్వము

పూర్వీకులు రాగమును మూడు విధములుగా విభజించిరి. అవి 1. రాగస్వరూపము 2. రాగ భావము 3. రాగ ప్రాధాన్యత

క్రీ.శ. 14వ శతాబ్దం మొదలు 17వ శతాబ్దం ఉత్తరార్థము వరకు మేళముల సంఖ్య నిర్ణయము కాలేదు.

విద్యారణ్య స్వామి (founder Vijayanagara empire) – సంగీత సారం – 15 మేళములని

రామామాత్యులు – స్వరమేళకళానిధి – 20 మేళములని

సోమనాథుడు – రాగవిబోధ – 23 మేళములని

తులజేంద్రులు – సంగీత సారామృత -21 మేళములని

వేంకటమఖి – 72 మేళములని చెప్పిరి.

పూర్వ రాగము ఆవిర్భావము, దాని చరిత్ర:

సామగానం నుంచి మొట్టమొదట మూర్ఛన ఉద్భవించుట. అదియే సామగాన మూర్ఛన.

షడ్జ గ్రామ మూర్ఛన తరువత మధ్యమ గాంధార మూర్ఛన. 3 గ్రామాలకు వివిధములైన మూర్ఛనలు వచ్చాయి.

షడ్జ గ్రామ మూర్ఛనములు:

స రి గ మ ప ద ని – ఉత్తరమంద్ర – షాఢ్జి

ని స రి గ మ ప ద – రంజని – దైషాది

ద ని స రి గ మ ప – ఉత్తరాయిత – ధైవతి

ప ద ని స రి గ మ – శుద్ధ షడ్జ

మ ప ద ని స రి గ – మత్సరీకృతం

గ మ ప ద ని స రి – అశ్వక్రాంతం

రి గ మ ప ద ని స – అభిరుద్గతం – ఆర్షభి

తరువాత కాలములో మేళములు అయినవి.

స, ని, ద, రి – మూర్ఛనలు

షాడ్జి – ఉత్తరమంద్ర  అయినది

ని – రంజని – నైషాధి

ద to ప – ఉత్తరాయిత – ధైవతి

రి to స – ఆర్షభి – అభిరుద్గతం

4  శుద్ధ జాతులు

షడ్జ గ్రామ నిషాద మూర్ఛన

రంజని (ని to ద)  – ధీర శంకరాభరణం అయినది.

షడ్జ గ్రామము, హరప్రియ, ముఖారి, చిత్తరంజని, ఖరహరప్రియ

రిషభ మూర్ఛన – అభిరోద్గుతం – తోడి

దైవత మూర్ఛన – గాంధార గ్రామము – చ్యుత పంచమ తోడి మధ్యమ గ్రామములో నుండె.

గాంధార మూర్ఛన – కళ్యాణి

మధ్య మూర్చన – హరి కాంభోజి

పంచ మూర్ఛన – నఠబైరవి

గీత శృతులు షడ్జ గ్రామంలో ‘చతుశ్చ’. అవి శుద్ధ స్వరములు.

గ్రామము స్వర సమూహము. మూర్ఛనలకు, జాతులకు, మేళములకు ఆధారం గ్రామము.

రామామాత్యుడు – షడ్జ గ్రామము నుంచి పుట్టిన రాగములు – దేశ రాగములు.

ఆరోహణ, అవరోహన పాడితే మూర్ఛన.

మూర్ఛనను వివిధములైన అలంకార రూపముగా పాడినచో జాతి.

గమకములో శృతులు కూడా ఉంటాయి. వివిధములైన కంపితములు, 2, 3, 4 స్వరముల మధ్య యుండిన అది గమకము.

మ గ మా ( గా ప గ గా ప గ)

రీ మ గా మ – ఖరహరప్రియ

రీ మ రీ మ – దర్బారు

రాగ నిర్దుష్టము గమకం వచ్చిన తరువాత పటిష్టమైంది. గమకం కూడా మారుతుంది.

జాతులు – శుద్ధ, వికృతి అని రకములు.

జన్యరాగ వివరము:

72 మే॥లలో ప్రతి ఒక్క దాని నుండి జనించునట్టి రాగములు జన్యరాగములు. అవి ఏర్పడు విధము, వాటి సంఖ్య తెలుసుకొందుము.

72 Scheme: ఒక్కొక్క మేళకర్త యందు సంపూర్ణ, షాడవ, జౌడవ భేదములచే 22 రకముల భేదములు కల్గుచున్నవి.

సంపూర్ణ భేదము:

స రి గ మ ప ద ని స – స ని ద ప మ గ రి స

షాడవ భేదములు 6:

  1. స రి గ మ ప ద స – స ద ప మ గ రి స
  2. స రి గ మ ప ద స – స ని ప మ గ రి స
  3. స రి గ మ ప ద స – స ని ద మ గ రి స
  4. స రి గ మ ప ద స – స ని ద ప గ రి స
  5. స రి గ మ ప ద స – స ని ద ప మ రి స
  6. స రి గ మ ప ద స – స ని ద ప మ గ స

జౌడవ భేదములు 15:

  1. స రి గ మ ప స – స ప మ గ రి స
  2. స రి గ మ ద స – స ద మ గ రి స
  3. స రి గ మ ని స – స ని మ గ రి స
  4. స రి గ ప ద స – స ద ప గ రి స
  5. స రి గ ప ని స – స ని ప గ రి స
  6. స రి గ ద ని స – స ని ద గ రి స
  7. స రి మ ప ద స – స ద ప మ రి స
  8. స రి మ ప ని స – స ని ప మ రి స
  9. స రి మ ద ని స – స ని ద మ రి స
  10. స రి ప ద ని స – స ని ద ప రి స
  11. స గ మ ప ద స – స ద ప మ గ స
  12. స గ మ ప ని స – స ని ప మ గ స
  13. స గ మ ద ని స – స ని ద మ గ స
  14. స గ ప ద ని స – స ని ద ప గ స
  15. స మ ప ద ని స – స ని ద ప మ స

1+6+15=22 → సంపూర్ణ, షాడవ, జౌడవ భేదములచే 484 జన్య రాగములు ఏర్పడెను.

1. సంపూర్ణ సంపూర్ణ 1 ఉదా: భైర
2. సంపూర్ణ షాడవ 6 భైరవము
3. షాడవ సంపూర్ణ 6 కాంభోజి
4. సంపూర్ణ జౌడవ 15 సారమతి
5. జౌడవ సంపూర్ణ 15 బిలహరి
6. షాడవ షాడవ 36 శ్రీరంజని
7. షాడవ జౌడవ 90 నాటకురింజి
8. జౌడవ షాడవ 90 మలహరి
9 జౌడవ జౌడవ 225 శుద్ధ సావేరి
Total 484

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here