సంగీత సురధార-3

0
9

[శాస్త్రీయ సంగీతంను పరిచయం చేస్తూ డా. సి. ఉమా ప్రసాద్ అందిస్తున్న ప్రత్యేక వ్యాసపరంపర..]

అధ్యాయం 4 శుద్ధ, వికృతి స్వరాలు

పూర్వాచార్యుల వివిధాభిప్రాయాలు

[dropcap]స్వ[/dropcap]రములు ఏడు. ఈ సప్త స్వరములలో షడ్జ, పంచమములు మార్పు చెందవు. అనగా వికృతి చెందవు. అందుచేత ఈ షడ్జ, పంచమములను ప్రకృతి స్వరములనియు, శుద్ధ స్వరములనియు, అవికృత స్వరములనియు, స్థానభ్రంశం చెందనివనియు, చలనము లేనివనియు అనుచున్నారు. తక్కిన రి, గ, మ, ద, ని మార్పు చెందుచున్నవి. కనుక వాటికి వికృత స్వరములని పేరు. ఈ అభిప్రాయము సమకాలీనము.

సంగీత చరిత్రలో స్వరముల పరిణామ దశలో ఈ శుద్ధ వికృతి స్వరములను నిర్ణయించుటలో ఆయా పరిణామ దశను బట్టి ఆయా సందర్భములలో వివిధ శాస్త్రకారులు, సంగీతజ్ఞులు, వివిధ గ్రంథకర్తలు వివిధములైన అభిప్రాయములను వెల్లడించి యున్నారు. పరిణామ దశలో ఇట్టి అభిప్రాయ వైవిధ్యము సహజమే.

1.

ప్రాచీన యుగములందు మొట్టమొదలుగా సామగాన మూర్ఛన పరిణామము చెందినప్పుడు ఆ నియత శృతులు కల్గిన స్వరములు శుద్ధ స్వరములుగా పరిగణింపబడినవి.

అనగా – నియత శృతులు

శ్లో.

చతుశ్చతుశ్చతు శ్చైవ షడ్జ పంచన మధ్యమాః

ద్వేద్వే నిషాద గాంధారా స్త్రీ స్త్రీ రిషభ ధైవతాః

అర్థాత …స ..రి .గ …మ …ప ..ద ..ని

4+3+2+4+4+2+1

4+4+4+3+2+2+1

షడ్జ్, పంచమ, మధ్యములకు 4 చా॥గ x 3=12

రి, ద 3 చా॥గ x 2=6

గ, ని 2 చా॥గ x 2=4

శృతులు కలిగి యున్నవి

పైన ఉదహరించిన పంపకములను సమకాలీన సందర్భముతో చూచినచో సామగాన మూర్ఛన దగ్గరగా ఖరహరప్రియకు సరిపోవును.

అనగా ఆనాడు సామగాన, మూర్ఛన యందు గల స్వరములు శుద్ధ స్వరములుగాను, 22  శృతుల మండలము నందుగల తక్కిన స్వరములు వికృతి స్వరములుగాను భావింపబడెను.

2.

తరువాత కాలమునందు (చాలా కాలము తరువాత)  12వ శతాబ్దమున శార్ఞ్గ దేవుడు షడ్జ గ్రామమునకు చెందిన స్వరములు ప్రకృతి స్వరములుగాను, వాటికి క్రింద స్వరములు గాని, పై స్వరములు గానీ (లేదా) క్రింది శృతులు గాని పై శృతులు గాని వికృతి స్వరములుగా వర్ణించెను.

షడ్జ గ్రామము అనగా మొట్టమొదట మూర్ఛన యగు సామగాన మూర్ఛనయే. అదియే హరప్రియ, ముఖారి, చిత్తరంజని, ఖరహరప్రియ.

శార్ఞ్గ దేవుడు షడ్జ పంచమము అను రెండేసి విధములుగా వర్ణించెను. చ్యుత షడ్జమ, అచ్యుత షడ్జమ, చ్యుత పంచమ, అచ్యుత పంచమము, అచ్యుత షడ్జ, పంచమములు ప్రకృతి స్వరములు (స=చ్యు).

అచ్యుత షడ్జ, పంచమములు వికృతి స్వరములు (ప=చ్యు).

శార్ఞ్గ దేవుడు తన సంగీత రత్నాకరములో కై॥కా॥ని॥ చ్యుత షడ్జమము వికృతి రిషభము (శు॥రి) సా॥ అం॥గా॥ చ్యుత మధమమును వికృతి స్వరములుగా పేర్కొనెను (అన్ – అ ప ప్రకృతి, స ప వికృతి).

దీనిని బట్టి శార్ఞ్గ దేవుడు కూడా స, ప, లను మాత్రమే ప్రకృతి స్వరములను గాను, తక్కిన పది స్వరములను వికృతి స్వరములు గాను వర్ణించుట గమనింపదగ్గ విషయము. అనగా ఈనాటి అభిప్రాయమునే ఆయనను కల్గియుండెను.

3.

రామామత్యులు తన ‘స్వర మేళ కళానిధి’ యందు శార్ఞ్గ దేవునకు భిన్నముగా తన అభిప్రాయము ఈ క్రింద నుదహరించిన సప్త స్వరములను మాత్రమే వికృతి స్వరములుగా పేర్కొనెను.

కై॥కా॥ని॥ చ్యు లో షడ్జమము, సా॥గా॥అం॥గా॥ చ్యు తో మధ్యమము, చ్యుతో పంచమము.

ఈ ప్రస్తుత సందర్భమునకు రామమాత్యుల వారి అభిప్రాయము సరిపోదు. ఎందుచేతననగా కా॥ని॥ చ్యు లో షడ్జమ నిషాదము స్వరస్థానములు విలువలలో ఒకటియే వేరు కాదు. అటులనే అం॥గా॥ చ్యు లో ॥ మధ్యమములు ఒకటియే గాని, వేరు కాదు. శృతి విలువలలో మాత్రమే స్వరములు వేరు. పై విధముగానే ‘సంగీత రత్నాకర’ గ్రంథకర్త యొక్క అభిప్రాయము వారి ప్రకృతి, వికృతి స్వరముల కిచ్చిన పేర్లు సంగీత పరిణామము పూర్తియై స్థిరపడి సందేహమునకు తావు లేని ఆధునిక యుగ, సంగీత శాస్త్రమునకు ఏ మాత్రమును సరిపోదు.

సంగీత చరిత్రను 3 యుగములుగా విభజించవచ్చును. Pre-historic (వేద యుగము లేదా ప్రాచీన యుగము), Historic (చారిత్రక యుగము), Contemporary ( ఆధునిక యుగము). లేదా చారిత్రక పూర్వయుగము (గ్రంథముల యుగము), చారిత్రక యుగము (త్యాగరాజ యుగము), ఆధునిక యుగము (త్యాగరాజుని తరువాత యుగము) అని కూడా విభజించవచ్చు.

4వ శతాబ్ది నుంచి 14, 15వ శతాబ్ది వరకు ముఖ్యమైన గ్రంథములు భరతుడు, శార్ఞ్గ దేవుడు, మొదలైనవారు వ్రాయుచునే ఉన్నారు.

ఆ తరువాత కాలములో కూడా కొన్ని గ్రంథము వచ్చినవి. ప్రాచీన గ్రంథములకు, మధ్య ఆధునిక గ్రంథములకు లక్ష్య సంబంధముగా అనేకములైన భేదములు, వ్యత్యాసములు కలవు. లక్ష్య, లక్షణాలకు మధ్య ఆధునిక కాలంలో లక్ష్యానికి పూర్వకాల లక్షణము.

ప్రాచీన కాల లక్ష్యానికి, ఆధునిక లక్ష్యానికి కొన్ని విషయాలలో పోలికలే లేవు. కారణం ప్రాచీన కాలంలో లక్ష్యాన్ని బట్టి, లక్షణం వ్రాశారు. అప్పటి లక్ష్యం ఎటుల వున్నదో మనకు ఏ మాత్రం తెలియదు. ఇప్పటి లక్ష్యాన్ని బట్టి ప్రాచీన కాల లక్ష్యాన్ని ఊహించలేము. అలా ఊహించుట కూడా కష్టం. ఇంకొక కారణం, ప్రాచీన కాలంలో సంగీతము సంపూర్ణముగా అభివృద్ధి చెందలేదు. అభివృద్ధి చెందే దశలోనే వుంది. ఆధునిక యుగంలో సంపూర్ణముగా అభివృద్ధి చెంది ఒక నిర్దుష్టమైన రూపాన్ని, పద్ధతిని లక్ష్య లక్షణ సమన్వితముగా సంతరించుకుంది. దీనికి.. ఈ అభివృద్ధికి కారకులు కొంత వరకు పురందర దాసు, రామదాసు, అన్నమయ్య, క్షేత్రయ్య, నారాయణ తీర్థులు, పూర్తిగా త్రిమూర్తులు అయిన త్యాగయ్య, దీక్షితార్, శ్యామశాస్త్రి ధాతు రచనా దక్షులు. సంగీత స్వర్ణయుగకర్తలు.

అందుచేత ప్రకృతి వికృతి స్వరముల నిర్ణయము ఆయా సందర్భములను బట్టి మార్పులు చెందుతూ వచ్చినవి.

  1. షడ్జ గ్రామ నిర్ణయమునకు పూర్వము అన్నియు వికృతి స్వరములు. సామగాన మూర్ఛనలో గల స్వరములు అన్నియు శుద్ధ స్వరములు.
  2. షడ్జ్ గ్రామ నిర్ణయ కాలమున సంగీత రత్నాకరమును ఆధారముగా చేసుకొనినచో – స, ప ప్రకృతి; రి గ మ ద ని – వికృతి స్వరములు.
  3. గోవిందాచార్యుల ‘సంగ్రహ చూడామణి’లో శు॥ షడ్జమ, శు॥ రి॥, శు॥గా॥, శు॥ మధ్యమ. శు॥ పంచమ శు॥ దై॥, శు॥ ని॥ స్వరములు ఏడింటిని ప్రకృతి స్వరములుగనే పేర్కొన్నారు.
  4. ఆధునికంలో షడ్జమము, పంచమము శు॥ ద॥, శు॥ని॥ అనగా చ॥ రి॥, చ॥దై ॥ 72 మే॥లను సందర్భము అనుసరించి స, ప, లు ప్రకృతి ప్రథమ ప్రకృతి.
  5. ప్రకృతి, వికృతి స్వర నిర్ణయ అభిప్రాయములందు శార్ఞ్గ దేవుడు, రామా మాత్యుడు ఏకాభిప్రాయమున్నది. సోమనాథుడు కూడా రామా మాత్యుడు చెప్పిన 7 వికృతి స్వరములు ఆమోదించిరి.
  6. గోవిందాచార్యులు, వెంకటమఖి 72 పథకమును ప్రతిపాదించినవారు. కానుక వారికి కూడా ఏకాభిప్రాయము గలదు. శు॥గా॥, శు॥ దై॥, శు॥ ని॥, ష॥దై॥ వికృతి స్వరము. తక్కినవి 12 స్వర స్థానము ప్రకృతి స్వరములు.
  7. 72 మే॥లను దృష్టిలో నుంచుకొనిన పక్షంలో తోకి స్వరములు శుద్ధ స్వరములు. తక్కినవి వికృతి.
  8. 72 మే॥లను దృష్టిలో నుంచుకొనిన – కనకాంగి స్వరములు శుద్ధ స్వరములు. అనగా శు॥ రి॥, శు॥గా॥, శు॥ మ॥ పంచమము. శు॥ దై॥, శు॥ ని॥.
  9. హిందుస్థానీ శంకరాభరణంలో బిలావల్ అనగా చ॥ రి॥, అం॥ గా॥, శు॥ మ॥ పంచమము. చ॥ రై॥, శు॥ ని॥.
  10. పాశ్చాత్య సంగీతము నందైన శుద్ధ స్వరము natural scale. దీనిని Major Scale అందురు. అనగా 12 స్వరములలో మార్పు లేని స్వరములు స, ప గాక మిగిలినవి వికృతి. అందుచేత పురందరదాసుల వారు సంగీత అభ్యాస గాన రచనలకు అర్హత కలిగిన మాళవ గౌళ స్వరములు శుద్ధములు, తక్కినవి వికృతులు అన్నారు.
  11. దీనిని బట్టి మనము తెలుసుకొను విషయము ఏమనగా సందర్భమును బట్టి కాలమును బట్టి ప్రకృతి, వికృతి స్వరములు మారుచుండును.

***

పాశ్చాత్య సంగీతమందు షడ్జమము నుండి స్థాన సంఖ్యను బట్టియే గుర్తింతురు.

షడ్జమము – 1. First Note or tonic

రిషభము – 2. Second Note or super tonic

గాంధారము – 3. Minor Third Note – Mediant

(అం॥ గా॥) – Major Third Note

మధ్యమము – 4. Fourth Note or Subdominant

పంచమము – 5. Fifth Note or Dominant

దైవతము – 6. Sixth Note – Sub Mediant

నిషాధము – 7. Seventh Note or Leading Note.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here