[శాస్త్రీయ సంగీతంను పరిచయం చేస్తూ డా. సి. ఉమా ప్రసాద్ అందిస్తున్న ప్రత్యేక వ్యాస పరంపర..]
అధ్యాయం 25
మనోధర్మ సంగీతము – పుట్టుక – దాని తరువాతి పరిణామము:
మనోధర్మ సంగీతమనగా కవిత్వములో ఆశుకవిత్వమెటువంటిదో సంగీతములో మనోధర్మ సంగీతము కూడా అటువంటిది.
మనోధర్మ సంగీతం నాలుగు భాగములు:
- రాగ ఆలాపనలు
- తానము (లేక) మధ్యమ కాలము
- పల్లవి పాడుట
- కల్పన స్వరాములు పాడుట
కృతులలో కొన్ని అంగములు ప్రస్తరించి పాడుటను కూడా (దీనినే నిరవల్ అందురు) మనోధర్మ సంగీతమునందే చేర్చవచ్చును.
మొదటి రెండు భాగములలో పల్లవి పాడుట, కల్పన స్వరములు వేయుట అనునవి తాళ బద్ధములు. నిరవలు కృతియే కాబట్టి తాళ బద్ధమే. తక్కిన భాగములు, ఆలాపన, తానము తాళ బద్ధములు కావు. తానము ఒక రకమైన నడకు మాత్రము చెంది యుండును.
రాగాలాపన:
రాగము ఆలాపన చేయుటకు కొన్ని చట్టములున్నవి. ఆలాపనము, ఆలాప్, ఆలప్తి – ఈ మూడును ఒకటే. అనగా ఒక రాగమును వృద్ధి చేయుట. ‘తదరినతోం’ అనగా తత్, రిహ అనంతం, ఓం అను శబ్దములన్నియు కలిసి తదరినతోం అయినది. లకార, యకారములు ఉపయోగించకూడదు. ఏలన అవి వీనులకు ఇంపుగా యుండవు.
రాగ ఆలాపన పద్ధతి – మూడు భాగములు:
- వినువారలకు రాగము తెలియునట్లు పాడి పరిచయము చేయుట (Introductory Paragraph)
- ముఖ్యాంగము (Body of the Alapana)
- తుది (Concluding Paragraph)
(ఎ) పరిచయము (Introduction):
దీనినే ఆక్షిప్తిక మనియు, ఆయిత్తమనియు పిలుస్తారు. ఆలాపన చేయుటకు తీసుకొనిన రాగము ‘ఈ రాగము’ అని వినువారలకు చూపుట కొరకై ఈ ఆక్షిప్తిక భాగము కనుక, మధ్య స్థాయి షడ్జమముతో ప్రారంభించి, మంద్ర, మధ్య, తారా స్థాయిలలో రంజక సంచారములలో పాడి మధ్య స్థాయి షడ్చమమునకు వచ్చి ఆపివేయవలెను. ఇది ‘ఆక్షిప్తిక’.
(బి) ముఖ్యాంగము:
ఈ భాగమే రాగ ఆలాపన యొక్క ముఖ్యాంగము. దీనికి రాగవర్ధిని అనియు పేరు గలదు. ఈ భాగమును నాలుగు ఉపభాగములుగా భాగింపవచ్చును. ప్రతి భాగమునకు ఎత్తుట (లేక) ఎడుప్పు (అనగా ప్రారంభించుటయు), ముక్తాయి (లేక) విదారి (అనగా ముగింపును) కలవు.
రాగవర్ధిని వివరణ (1st Stage):
సంచారములు చౌక కాలములో యుండవలెను. కొన్ని చోట్ల మధ్యమ, ధ్రుత కాల సంచారములు రావచ్చును కానీ విళంబమే ఎక్కువ యుండును. చౌకముగా పాడునప్పుడు ఇంకొక రాగము యొక్క స్వరూపము నిచ్చు ప్రయోగములను తప్పించవలెను. మధ్యస్థాయి షడ్జమములో ప్రారంభించి, మంద్ర స్థాయిలోను చక్కటి గమకములతో నిండిన స్వరములలో చౌకముగాను కొన్ని చోట్ల దురితముగాను సంచరించి, తారాస్థాయి షడ్జమమునకు అవరోహించవలయును.
రాగవర్ధిని వివరణ (2nd Stage):
ప్రయోగములు పాడి, మరికొన్ని చిత్ర విచిత్రములగు కల్పనను చేసి, విద్వాంసుడు తన పాండిత్యమును ఎన్ని విధముల చూపగలడో అన్ని విధముల చూపి, చివరకు తారాస్థాయి పంచమ షడ్జమములకు కూడా వెళ్ళి తరువాత అత్యంతమైన వర్ణనతోడను విచిత్ర మధ్యస్థాయి షడ్జమమునకు వచ్చి నిలుపవలయును. ఈ పీఠము నందును సంచారములు చాలా వరకు మధ్యస్థాయిలోనే జరిపి అప్పుడప్పుడు ఇతర స్థాయిలలో కూడా జరుపవలెను.
రాగవర్ధిని వివరణ (3rd Stage):
సంచారములు తారాస్థాయిలోనే జరుపవలయును.
రాగవర్ధిని వివరణ (4th Stage):
2, 3 stage ల వలెనే సాధారణముగా రాగవర్ధని రెండు భాగములుగా ముగించుట అలవాటు.
(సి). తుది (Concluding Paragraph):
దీనినే ‘మకరిణి’ అనుటయు కలదు. ఆలాపన ముగించు భాగము. మూడు స్థాయిలలో రంజకముగా ప్రయోగములతో సంచారము చేసి మధ్యస్థాయి షడ్జమములో ఆపివేయుట.
మూడు స్థాయిలలో రాగరంజక ప్రయోగములో ఆలాపన చేసి మధ్యస్థాయి షడ్జమములో ఆపివేయుత రాగవర్ధిని. పీఠములో ‘స్థాయి స్వర’మనగా కొన్ని ప్రయోగములు ఒకే స్వరమున ఆలపించుట. అనగా రిషభము తీసికొనిన, మగరి, రిమగరి, రిపగమరి.. etc. రిషభములోనే ఆపినప్పుదు ఆ రిషభము ‘స్థాయి స్వర’మగును.
స్థాయి సంచార పద్ధతి రెండు విధములు:
కల్పన స్వరములను పాడు పద్ధతి:
ఇదియు మనోధర్మ సంగీతములో చేరినది. కానీ ఇది తాళబద్ధము. ఒక కృతి యొక్క పల్లవికి గాని (లేక) మరియే అంగమునకు గాని, కల్పన స్వరములు పాడుట అలవాటు. కాని పదములకు, జావళీలకు, స్వర కల్పనలు పాడుట ఆచారమందు లేదు.
కల్పన స్వరమును ముగించునప్పుడు, ముగించు స్వరము కృతి యొక్క అంగము ప్రారంభించు స్వరమునకు క్రింది స్వరముగా యుండవలెను.
ఉదాహరణ:
వినాయకుని – మధ్యమావతి – ఆది – కృతి
‘అనాథ రక్షకి శ్రీ కామాక్షి’ అను అంగము కల్పన స్వరము వేయవలెను. ‘అనాథ’ అనునది ‘ప నీ స’ అని పంచమముతో ప్రారంభించుచున్నది. ఎట్లన
I4 | O2 | O2 | |
అనాథ రక్షకి | 1 | స రి స ని | స ని ప మ ॥ |
అనాథ రక్షకి | 2 | రి స ని ప | స ని ప మ ॥ |
అనాథ రక్షకి | 3 | రి మ ప ని | స ని ప మ ॥ |
అనాథ రక్షకి | 4 | ని స రి మ | ప ని ప మ ॥ |
పల్లవి ధాతువు యొక్క ఆరంభ స్వరమును, కల్పన స్వరము యొక్క ముగింపు సంచారమును కలిపి ఆ రాగము యొక్క రంజక ప్రయోగమైనచో అపుడు పల్లవి ధాతువు యొక్క ఆరంభ స్వరమునకు పై స్వరములో కల్పన స్వరమును ముగింపవచ్చును
ఉదాహరణ:
శ్రీ సుబ్రహ్మణ్య నమస్తే – కాంభోజి రాగం – రూపక తాళం
I4 | O2 | I4 |
వాసలాది | మ గ | రి స రి గ ॥ |
ప ద | స స రి గ ॥ | |
రీ | రి స ని ॥ | |
దా | స రి గా ॥ |
కొంత వరకు చౌకము పాడి, తరువాత మధ్యమ కాలములో పాడుట ఆచారము.
గతి భేదములో కూడ పాడవచ్చు. త్రిశ్ర, చతురశ్ర, ఖండ, మిశ్ర, సంకీర్ణ.
కల్పన స్వరాంతరమున మకుటమను కిరీటముతో ముగింపవచ్చును. మకుటమనగా ‘రీ సా ని ద ప – సా నీ ద ప మ – గా మా ప ద ని’ – ఇత్లు తూచినటు సంచారముతో ముగించుట.
మనోధర్మ సంగీతములో తానము (లేక) మధ్యమ కాలము:
తానమునకు ఒక రకమైన నడక ఉండును. తానమనగా స్వరములను విస్తరించి, గుణించి, నిపుణతతో పాడుట.
తానములు 2 రకములు – శుద్ధ, కూట తానములు
(6) శాస్త్ర సంగీతము, సంగీత నాటికలు, నృత్య గానము, జానపదము యొక్క పరిణామము
(7) కాలక్షేప గాన సభల యొక్క చరిత్ర
(8) సంకేతము యొక్క పరిణామము
(9) సంగీత పాఠశాలలు, నేర్పు పద్ధతులు
(10) సంగీతం యొక్క ఫక్కీల మార్పుదల
(11) సంగీత వాద్యముల పరిణామము
(12) సంగీత కార్యములు
(13) వాగ్గేయకారులు – విద్వాంసులు – గాయకులు
(14) ఇతర దేశ సంగీతము వలన కలిగిన మార్పులు
6 నుంచి 14 topics కి rough వివరణ:
భారతీయ సంస్కృతి (ఇండియన్ కల్చర్) యొక్క విశిష్టత – ఆధ్యాత్మిక దృష్టి. భగవంతుడు అని, మానవుదు అనియు. spiritual. కళలు, విద్య, pilgrimages, పాపభీతి, ఈశ్వర వాదం, అహింస, సత్యం వద ధర్మం చర, వేదం, అపౌరుషేయాలు, యజ్ఞం, స్వార్థం, పదార్థం, తెలివితో, చెలిమితో, కరుణ గల్గి, – మానవుల లక్షణాలను పేర్కొనిను జగమెల్లను సుధా దృష్టితో త్యాగరాజుని కృతిలో జ్ఞానం, భక్తి, భగవద్భక్తి, విద్య వల్ల సాంఘిక ప్రయోగములు, శాస్త్రీయ దృక్పథము నేర్చుకోవలసినది – కళ – మానసిక ఆనందం – 64 కళలు. చతుష్షష్టి కళలు – లలిత కళలు. శరీరం.
సంగీతం, కవిత్వం, చిత్రలేఖనం, శిల్పం, నాట్యం, జ్యోతిషం, కళ, కొన్ని common గా కళలు – విద్యలుగా నేర్చుకునేటప్పుడు విద్య అందించదు. ఆధ్యాత్మికత, భావం, రసం, అందం, లావణ్యం, లలితం, శ్రావ్యం. సంగీతానికి సద్యఃస్ఫూర్తి ఉంది. దేవాలయమునకు అనుబంధముగా వుండేది సంగీతము. భగవంతుడు చుట్టూ అల్లుకున్నవే లలితకళలు. ప్రకృతి – పార్వతి, పురుషుడు – శివుడు – వారి సంయోగం, కలయిక.
మధుర భక్తి – గీతాలు – మీరాబాయి – అష్టపదులు
రామ భక్తి – తులసీదాసు – భక్తుడు – నాయకుడు; గురువు – సఖి; భగవంతుడు – నాయకి
రాగం – కళాత్మకత కోసం – applied music – బృందగానం – absolute music.
సంగీతము భజనల కోసము.
సత్యం | శివం | సుందరం |
Spiritual | ఐశ్వర్యం | రసానుభూతి – నాదభూయిష్టం |
మంగళకరం | folk music లాస్యం |
Entire Manifestation of Universe:
ఖగోళంలో, భూగోళంలో అనునిత్యం మానవ ప్రమేయం లేకుండానే ఏది అభివృద్ధి అవుతుంది. వైజ్ఞానిక సంగీత విజ్ఞానము.
కపాళంలో రెండు భాగాలు. History and Creativity taste grasp చేసే power. నాదం అతి సూక్ష్మం. నిశిత దృష్టి కల్గియుండడం, సూక్ష్మదర్శనం. నాదం అక్షరం – పదం – వాక్యం – సాహిత్య – అర్థం – భావోద్వేగం – emotional.
సప్త స్వరములు, నాదం, రసం, ఉత్పత్తి, తీవ్ర, అల్పత్వ, కోమలం (12).
వీర, హాస్య, రౌద్ర, కరుణ, భీభత్స, భయానక, శాంత, శృంగార/
Wave length, classical length, light length, folk length – musical లో ఎన్ని భాగాలున్నవో అన్నిటికీ రంజకం apply అవుతుంది.
(ఇంకా ఉంది)