సంగీత సురధార-4

0
11

[శాస్త్రీయ సంగీతంను పరిచయం చేస్తూ డా. సి. ఉమా ప్రసాద్ అందిస్తున్న ప్రత్యేక వ్యాసపరంపర..]

అధ్యాయం 5 నాద ఉత్పత్తి – వైదిక గానం

సామగానం – సామగాన మూర్ఛన – మూర్ఛనలు

నాద శబ్దార్థము:

“బ్రహ్మ గ్రంథిజ మారుతానుగనినా చిత్తోన హృత్పంకజే

సూరీగా మనురంజక శ్రుతి పదం యోమం స్వయంరాజతే

యస్మాద్గ్రమ విభాగ వర్ణ రచనాలంకార జాతిక్రమో

వందేనాద తనుం తముద్దుర జగద్గీతం వందే శంకరం”-

– సంగీత రత్నాకరం.

సారంగదేవులు తమ సంగీత రత్నాకర గ్రంథమున ప్రథమ ప్రకరణము యగు – పదార్థ సంగ్రహ ప్రకరణమును పై మంగళ శ్లోకముతో ప్రారంభించెను. ఇందు గీతశాస్త్రమందలి వివిధ ముఖ్యాంశములగు నాద, శ్రుతి, స్వర, వర్ణ, అలంకార, జాతి క్రమాది విషయములు మాత్రము సూచింపబడుటయే కాక నాదమును శంకర స్వరూపముగా వర్ణించుట వరింత శ్లాఘనీయము.

విష్ణుపురాణములో –

“కావ్యాలాపాశ్చ యే కే చిద్గీతాని సకలానిచ

శబ్దమూర్తి ధరైస్యేతీ విష్ణోరంశ మహాత్మనః”

కావ్యాలాప గీతములన్నియును కూడా సాక్షాత్ శ్రీ మహా విష్ణ్వంశమే అనియును, ఆ విష్ణువు ‘శబ్దమూర్తి’ అనియును పై శ్లోకము యొక్క తాత్పర్యము.

శ్రీ త్యాగరాజ స్వామి ‘నాద తనుమనిశం శంకరం నమామి’ అను కృతి యందును ‘నాద సుధారసంబిలను నరాకృతియె ప్రణవ’ అను కృతి యందును పై భావములనే వెల్లడించెను.

ఇంకను

‘నాదోపాసనయా దేవా బ్రహ్మ విష్ణు మహేశ్వరః

భవంత్యుపాసిరా నూనం యస్మదేవే తదాత్మకారి॥’

అను రత్నాకర శ్లోకము యొక్క భావమునే త్యాగరాజస్వామి ‘నాదోపాసనచే శంకర నారాయణ విదులు తెలిసిరి’ అని వ్యక్తపరచెను.

నాదోత్పత్తి:

ఆత్మా వక్ష మాగోయం మనః ప్రేరయతీ మనః

దేహస్థం వహ్ని మహన్తి స ప్రేరయతి మారుతం

బ్రహ్మగ్రంథిత స్థితః క్రమా దూర్థ్వ పదే చరన్

సాభి హృత్కంఠ మూర్థ్వా స్వేష్యావిర్భవ యతి ధ్వనిః॥

శరీరము నందు గల ఆత్మ మనస్సును ప్రేరేపించుచున్నది. మనస్సు దేహమందు గల వహ్నిని గొట్టుచున్నది. ఆ వహ్ని వాయువును ప్రేరేపించుచున్నది. ఆ మారుతము ‘బ్రహ్మగ్రంథి’ యను మూలాధారాము నుండి యూర్థ్వముఖముగా నాభి, హృదయము, కంఠము, శిరము, ముఖము వీటియందు క్రమేణా చరించునపుడు నాదము ఆవిర్భవించుచున్నది.

నాద శబ్దార్థము:

‘నకారం ప్రాణసామానం దకారం అనలం విదుః

జాతః ప్రాణాగ్ని సంయోగాత్ తేన నాదోభిదీయతే’

‘నాద’ శబ్దము నందు ప్రాణమునకు ‘న’ కారమును, అనలమునకు, ‘ద’ కారమును బీజాక్షరములుగా నుండి, ప్రాణానల సంయోగమే నాదమైనదని పై శ్లోక భావము.

త్యాగరాజస్వామి ‘మోక్షము గలదా’ అను కృతి యొక్క చరణము నందు ప్రాణానల సంయోగము వలననే ప్రణవ నాదోత్పత్తి యగునని వెల్లడించిరి.

నాద విభాగము:

నాభీ, హృత్కంఠ మూర్థ్వాస్యముల ద్వారా నాదము పలుకునపుడు క్రమముగా సూక్ష్మ, అతి సూక్ష్మ, పుష్ప, అపుష్ప, కృత్రిమ అను పంచవిధ నాద భేదముల నొందుచున్నది.

సారంగదేవ, నారదాదులు ఆహత, అనాహత నాదములని విభజించిరి. ఇందు ఆహత నాదము మానవ యత్నముచే కల్గునది. అనాహత్తము ప్రకృతి సిద్ధంగా ఉద్భవించునది.

నారదులు – ‘ఆకాశ సంభవో సోనాహతః’ అని చెప్పియున్నారు.

అనాహతము గూర్చి:

“గురుపదిష్ట మార్గేణ మునయస్సము పాసతే” అని రత్నాకర గ్రంథకర్తలగు సారంగదేవులు చెప్పియున్నారు. నాద విభాగమును గూర్చి గూడ నారదులు ఈ క్రింది విధంగా చెప్పియున్నారు.

‘నఖ వాయిజ చర్మాణీ లోహ శారీర జాస్తధా’

నఖములతో మీటుట ద్వారా నాదము కల్గునట్టి వాద్యములు – ఉదా- వీణ, తంబూర.

వాయు సహాయముతో నాదము కల్గునట్టి వాద్యములు – ఉదా – వేణువు, శంఖము.

బిగింపబడిన చర్మముపై కొట్టుట వలన కల్గునట్టి నాదము గల వాద్యములు – ఉదా – మృదంగము, డోలు, కంజీరా.

కంచు, మున్నగు లోహముల ద్వారా కల్గునట్టి నాదము గలవి లోహ వాద్యములు – ఉదా – కంచు తాళము, గంట, ఘటము.

గాత్రము శరీరము నందు ఉద్భవించునదగుటచే అది శారీరజమైనది.

సంగీత రత్నాకరమునందు కూడా, ప్రపంచమంతటను వ్యాపించిన ఓంకార నాదము నుండియే అక్షరములును, ఆ అక్షరముల నుండి పదములును, ఆ పదములనుండి ప్రస్తుత కాలమున సర్వవ్యాప్తముగానున్న భాషయును ఏర్పడుట చేతనే ఈ ప్రపంచము నాదాత్మకముగా నున్నదని స్పష్టపరుపబడినది. కావుననే మన సంగీతం ‘నాద విద్య’ అయినది.

స్వరార్ణవ గ్రంథమునందీ క్రింది విధముగా చెప్పబడిన శ్లోకము కలదు:

“ఆత్మా మధ్య గతః ప్రాణః

ప్రాణ మధ్య గతో ధ్వనిః

ధ్వని మధ్య గతో నాదః

నాద మధ్యే సదాశివః”

నాదము ఎన్ని రకాలుగా ఉత్పత్తి అగునో చూద్దాం.

  1. బ్రహ్మగ్రంథి అగ్ని చేత ప్రేరేపింపబడిన ప్రాణవాయువు – ద్వారా పైకి వెళుతున్నప్పుడు నాదం పుట్టుచున్నది. నాభి – సూక్ష్మ; హృదయ – అతి సూక్ష్మ; కంఠ – పుష్ప; శిరస్సు – అపుష్ప; ముఖము – కృత్రిమము.
  2. అఘోరా నాదము సప్తస్వరముల నుండి పుట్టినది.
  3. నాదము ఆకాశము నుండి ఉద్భవించుచున్నది అని నారదుడు పేర్కొనెను.
  4. Eather – Sound is the product of living being things.
  5. వాయు రాపిడి వలన Sound పుట్టుచున్నది.
  6. రెండు వస్తువుల రాపిడి వలన కూడా నాదము పుట్టుచున్నది.
  7. మానవ స్వరపేటిక నుండి Sound కల్గుచున్నది.
  8. మధుర శబ్దము నాదము అగుచున్నది. అనగా సంగీత యోగ్యమై, శ్రావ్యమైన శబ్దము నాదము.
  9. శివాశక్తి నారాయణుల నుండి Sound కల్గుచున్నది.
  10. ప్రపంచ సృష్టికి పూర్వము నుండియు ప్రణవ నాదము ఖగోళ మండలమును ఆక్రమించి యున్నది. నాదమే సృష్టికి మూలము. ప్రణవ నాదమే ఓంకారము.
  11. నాదములలో ఆహత, అనాహత.. అనాహత నాదమునకు సంగీతమునకు సంబంధము లేదు.

వైదిక గానం:

వైదిక గానం అనగా వేదానికి సంబంధించినది. దానినే భక్తి సంగీతం అని అంటారు, లోకానికి సంబంధించినది లౌకిక గానం. ఆధునిక విభజన పూర్వం

  1. భక్తి గానం
  2. సామగాన మూర్ఛన

భక్తి సంగీత రచనలు (Applied Musical Forms)

కేవల (లౌకిక) రచనలు (Absolute Musical Forms, Secular Forms)

Applied Musical Forms కి Music in a vehicle, sahithya is not important. Music is subdued and focuses the devotional.

ఉదా: యక్షగాన, కాలక్షేప, folk music, నిషాదము, anthem, cham, hyme, untrained voice mass, auditorium, passion, psalm.  సంగతులుండవు. రాగ, విన్యాసాలుండవు.

కళాత్మక సంగీతములో సంగీతము ముఖ్యం. మనోధర్మ సంగీత శాఖలు రాగం, స్వరం, నెరవల్, పల్లవి, తానం, కారలై (దీర్ఘ) అతి ముఖ్యం.

సామగాన మూర్ఛన – షడ్జ గ్రామ మూర్ఛనలే.

రామామాత్యుడు అన్ని స్వర దేశీయ రాగములు సామగాన మూర్ఛనలుగా ప్రవేశపెట్టెను. మొట్టమొదట – 7 మూర్ఛనలు, 7 మాధ్యమాలు, 7 గాంధారాలు. కాలక్రమేణా మ, గ, లు పోయాయి.

మధ్యమ గ్రామానికి నుండె మూర్ఛనకు నీత శ్రుతులలో పంచమము ఒక స్థాయి శ్రుతి తక్కువగా ఉంటుంది.

పంచమము చ్యుత పంచము. ఈ మధ్యమ గ్రామానికి కొంతమంది గాన యోగ్యమైనదని, కొంతమంది కాదని అభిప్రాయములు వున్నవి. చ్యుత (or) లఘు (or) కైశికి (or) త్రిశృతి పంచమ – అని మధ్య గ్రామానికి పేర్లు.

గాంధార గ్రామ మూర్ఛన – ఒక నీత శ్రుతి.

స – 3 రి – 3 గ -3 మ – 3 ప – 3 ద -3 ని – 4

ఇవి వినసొంపుగా వుండవు. కావున ప్రచారములో లేవు. గ్రామ మూర్ఛనలను జాతులు, షడ్జ – గ్రామ మధ్యాల నుంచి వచ్చి 7, 7 మూర్ఛనలు వచ్చాయి. 7ని కుదించి వ్రాయగా 7 మూర్ఛనలు మాత్రమే వస్తాయి. 7ని జాతులంటారు says Supler.

“నా గానాన్ని ఎవరు పాడతారో నేను అక్కడ ఉంటాను” అన్నాడు విష్ణువు.

విష్ణువు – సార్గ్జి, సరస్వతి – విపంచీ, నారదుడు – మహతి, రుద్రుడు – రుద్ర, రావణుడు – రావణ హస్త, రావణి.

రీజన్ –  the present vikon.

విఘ్నేశ్వరుడు, బ్రహ్మ, విష్ణువు – మృదంగం.

Music is గాంధర్వ వేదము. Short Way to reach God is music. తీలారం is a composition of 7 జాతులు.

షడ్జ గ్రామ జాతులు:

  1. షాడ్జి – ఖరహరప్రియ
  2. ధైవతి – తోడి
  3. నైషాధి – కల్యాణి
  4. షడ్జ్యోదీత్యత – హరికాంభోజి
  5. షడ్జ కైశికి – నఠబైరవి
  6. షడ్జ మధ్యమ – చ్యుత పంచమ తోడి
  7. ఆక్షభి – శంకరాభరణం

షడ్జ గ్రామ మూర్ఛనలు:

  1. ఉత్తర మంద్ర
  2. రజని (లేదా) రంజని
  3. ఉత్తరాయత
  4. శుద్ధ షడ్జ
  5. మత్సరీకృత
  6. అశ్వక్రాంత
  7. అభిరుద్గత

షడ్జ గ్రామ మూర్ఛనలు:

  1. షడ్జ మూర్ఛన – ఉత్తర మంద్ర – ఖరహరప్రియ (చాలా వరకు)
  2. విషాద మూర్ఛన – రంజని – ధీర శం॥
  3. ధైవత మూర్ఛన – ఉత్తరాయత – గాంధార గ్రామము (or) వికృత పంచమ – హనుమతోడి
  4. రిషభ మూర్ఛన – అభిరుద్గత – హనుమతోడి

మధ్యమ గ్రామ మూర్ఛనలు:

  1. గాంధార మూర్ఛన – హరిణాశ్వ – కళ్యాణి
  2. మధ్యమ మూర్ఛన – సావేరి – హరికాంభోజి
  3. ధైవత మూర్ఛన – హృష్యక – నఠభైరవి

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here