[శాస్త్రీయ సంగీతంను పరిచయం చేస్తూ డా. సి. ఉమా ప్రసాద్ అందిస్తున్న ప్రత్యేక వ్యాసపరంపర..]
అధ్యాయం 7 స్థాయి యందు గల పూర్ణ శ్రుతులు – భరతుని ధ్రువ చలవీణలు
స్థాయి యందు గల పూర్ణ శ్రుతులు
- షజ్డము, ఏక శ్రుతి రిషభములకు మధ్య అంతరం – పూర్ణ శ్రుతి అంతరం.
- చతుశ్రుతి రిషభ, కోమల సాధారణ గాంధారముల మధ్య గల అంతరం – పూర్ణ శ్రుతి.
- తీవ్ర అంతర గాంధార, శుద్ధ మధ్యమముల మధ్య గల అంతరము – పూర్ణ శ్రుతి.
- తీవ్ర ప్రతి మధ్యమ, పంచమములకు మధ్య గల అంతరము – పూర్ణ శ్రుతి.
- పంచమము, ఏక శ్రుతి దైవతములకు మధ్య గల అంతరం – పూర్ణ శ్రుతి.
- చతుశ్రుతి దైవత, కోమల కైశికి నిషాదములకు మధ్య గల అంతరము – పూర్ణ శ్రుతి.
- తీవ్ర కాకలి నిషాద, షడ్జములకు మధ్య గల అంతరము – పూర్ణ శ్రుతి.
న్యూన శ్రుతులు:
ఒక్కొక్క స్వరమునకు గల 4 శ్రుతులలో రెండవ శ్రుతికిని, మూడవ శ్రుతికిని మధ్య గల అంతరము న్యూన శ్రుత్యంతరము. ఒక స్థాయి యందు 5 న్యూన శ్రుత్యంతరములు గలవు.
- ద్విశ్రుతి, త్రిశ్రుతి రిషభములకు మధ్య గల అంతరం.
- సాధారణ, అంతర గాంధారములకు మధ్య గల అంతరము.
- తీవ్ర శుద్ధ మధ్యమ, ప్రతి మధ్యలకు మధ్య గల అంతరము.
- ద్విశ్రుతి, త్రిశ్రుతి దైవతములకు మధ్య గల అంతరము.
- కైశికి, కాకలి నిషాదములకు మధ్య గల అంతరము.
ప్రమాణ శ్రుతి అంతరములు:
ఒక్కొక్క స్వరస్థానములో జత శ్రుతులలో ప్రతి రెండింటికి మధ్య గల అంతరము. మొత్తము=10.
- ఏక శ్రుతి, ద్విశ్రుతి రిషభముల మధ్య ప్రమాణ శ్రుతి అంతరము.
- త్రిశ్రుతి, చతుశ్రుతి రిషభముల మధ్య ప్రమాణ శ్రుతి అంతరము.
- కోమల సాధారణ, సాధారణ గాంధారముల మధ్య ప్రమాణ శ్రుతి అంతరము.
- అంతర గాంధార, తీవ్ర అంతర గాంధారముల మధ్య ప్రమాణ శ్రుతి అంతరము.
- శుద్ధ మధ్యమ, తీవ్ర శుద్ధ మధ్యమముల మధ్య ప్రమాణ శ్రుతి అంతరము.
- ప్రతి మధ్యమ, తీవ్ర ప్రతి మధ్యమముల మధ్య ప్రమాణ శ్రుతి అంతరము.
- ఏక శ్రుతి ద్విశ్రుతి దైవతముల మధ్య ప్రమాణ శ్రుతి అంతరము.
- త్రిశ్రుతి చతుశ్రుతి దైవతముల మధ్య ప్రమాణ శ్రుతి అంతరము.
- కోమల కైశికి నిషాదమ్ కైశికి నిషాదముల మధ్య ప్రమాణ శ్రుతి అంతరము.
- కాకలి, తీవ్ర కాకలి నిషాదముల మధ్య ప్రమాణ శ్రుతి అంతరము.
స్థాయిలో గల 22 శ్రుతుల అమరికలో గల ప్రమాణ శ్రుతులు 5 న్యూన శ్రుతులు, 7 పూర్ణ శ్రుతులు కలిసి స్థాయి యొక్క విలువకు సమానమగును. పై శ్రుతులన్నింటిని గుణించిన స్థాయి యొక్క విలువ 2 వచ్చును.
ఏక శ్రుత్యంతరము యొక్క అంతరములు భరతముని జరిపిన ధ్రువ, చలవీణల పరిశోధనల ఫలితముగా వచ్చినది.
వారు పంచమము నుండి ఒక్కొక్క శ్రుతిని తగ్గించుకుని, మధ్యమము వరకు దిగి వచ్చిన సందర్భములో మొదటి ఘట్టములో ప్రమాణశ్రుతి 2వ పూర్ణశ్రుతి. 3లో న్యూనశ్రుతి కన్పించెను.
***
భరతుని ధ్రువ చలవీణలు:
వేదకాలము నుండియు రెండు విధములైన వీణలు సంగీత ప్రపంచమున వాడుకలో వున్నవి.
- మెట్లతో వుండి ప్రస్తుతం వాడుకలో వున్న వీణ.
- మెట్లు లేకుండా అనేకమైన తీగలతో ప్రస్తుత స్వరమండలికి సరిపోవునట్టిది.
వీణలు సంగీత కచేరికి కాకుండా సంగీత అభివృద్ధికి చాలా ఉపయోగపడ్డాయి. ఈ వీణలతో లాక్షణీకులు పరిశోధనలు జరిపి సంగీత అభివృద్ధికి దోహదం చేశారు. రెండు వీణలకు తీగలు ఈ విధంగా కలవు.
- ధ్రువవీణ – 27 తీగలు కలవు.
- చలవీణ – 22 తీగలు కలవు.
ధ్రువవీణను స్థిరముగా పెట్టుకుని, చలవీణ తీగలను మారుస్తూ సూక్ష్మమైన శ్రుతి అంతరము కనుగొనుటయే భరతుడు చేసిన పరిశోధన.
సామగాన scale చేసినప్పుడు
- స -4 వ స్థానము. ద – 20
- రి -7 వ స్థానము. ని – 22
- గ -9 వ స్థానము.
- మ-13 వ స్థానము.
- ప్ల-17 వ స్థానము.
చలవీణలో ఉండే 17వ తీగ (పంచమమును) తగ్గించెను. పంచమమునకు, చ్యుత పంచమమమునకు మధ్య గల తేడా ఒక అంతరము. అది ప్రమాణ శ్రుతి = 81/80 value.
మధ్యమ గ్రామము (40/27) x (81/80) = 3/2
భరతుని ఉద్దేశము:
- ఏక శ్రుత్యంతరములు ఎన్ని ఉన్నాయి – 3 ఏక శ్రుతి పరిణామాలు
- మధ్యమ గ్రామమును నిర్ణయించుట
- షడ్జ గ్రామములలో స, ప, మధ్యమ గ్రామాలలో రి, మ – సంవాదులు అన్న విషయము
- చలవీణలో పంచమమును తగ్గించుట. రి,గ – ద, ని – సమశ్రుతులు.
భరతుడు ధ్రువ, చలవీణలకు 7 తంత్రులే బిగించెను. సారంగదేవులు -22 తీగెలు పెట్టెను.
(ఇంకా ఉంది)