సంస్కృత శ్లోకాలు – తెలుగు పద్యాలు 18

0
9

[box type=’note’ fontsize=’16’] సంస్కృత శ్లోకాలను తెలుగు పద్యాలుగా అనువదించడమే పుప్పాల జగన్మోహన్రావు ప్రత్యేకత. కొన్ని ఎంపిక చేసిన సంస్కృత శ్లోకాలను సరళమైన తెలుగులో పద్యరూపంలో అందిస్తున్నారు. [/box]

విద్వత్వం చ నృపత్వం
చ నైవ తుల్యం కదాచన ।
స్వదేశే పూజ్యతే రాజా
విద్వాన్ సర్వత్ర పూజ్యతే ॥

ఆటవెలది :
రమ్య మైన విద్య రాజ్యధికారమ్ము
నొనర నవని నెపుడు నొకటి కాదు
చదువు కొన్న వాని జగమెల్ల పూజించు
పూజ్యు డగును రాజు రాజ్య మందె ౮౬

***

మాతా శత్రుః పితా వైరీ
యేన బాలో న పాఠితః ।
న శోభతే సభా మధ్యే
హంస మధ్యే బకో యథా ॥

తేటగీతి :
కన్న బిడ్డల చదివింప కున్న వారు
వారి పాలిటి శత్రులే వాస్తవముగ
చదువు లేక రాణింపరు సభల వారు
హంస లందున బకమది యమర నట్లు ౮౭

***

శాకేన రోగా వర్ధన్తే
పయసా వర్ధతే తనుః ।
ఘృతేన వర్ధతే వీర్యం
మాంసాన్మాంసం ప్రవర్ధతే ॥

తేటగీతి :
యెంచ శాకమ్మె రోగమున్ పెంచు చుండు
పాలు పెంచును తనువును వరల గాను
నెయ్యి పెంచును వీర్యమ్ము నింపు గాను
మాంస వృద్ధిని జేయును మాంస మెపుడు ౮౮

***

ఆత్మ ద్వేషాత్ భవేన్మృత్యుః
పరద్వేషాత్ ధనక్షయః ।
రాజద్వేషాత్ భవేన్నాశో
బ్రహ్మద్వేషాత్ కులక్షయః ॥

తేటగీతి :
ఆత్మ దూషణ కలిగించు నాయు క్షయము
పరుల ద్వేషించ నశియించు వరలు ధనము
ప్రభుని దూషణ సర్వమ్ము పాడు జేయు
బ్రహ్మ దూషణ కలిగించు వంశ క్షయము ౮౯

***

కామం క్రోధం తథా లోభం
స్వాదం శృంగార కౌతుకే।
అతి నిద్రా౭తి సేవే చ
విద్యార్థీ హ్యష్ట వర్జయేత్ ॥

తేటగీతి :
కామ క్రోధముల్ శృంగార కౌతుకములు
పొలయు లోభమ్ము స్వాదిష్ట భోజనమ్ము
అనయ మతినిద్ర అతిసేవ యనెడి అష్ట
వ్యసనముల మేటి విద్యార్థి వదల వలయు ౯౦

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here