సప్తపది-7G

0
9

[శ్రీ సముద్రాల హరికృష్ణ రచించిన ‘సప్తపది-7G’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

1
ఎటో వెళ్ళిపోతోంది, మా లోకం
హుటాహుటిగా, ఆవేగంగా!
~
ఎవ్వరూ పట్టరు, అస్సలేదీ పట్టదు
రివ్వున తాకాలని, ఏ నింగినో?!
2
‘మేము’కు తర్పణాలిచ్చేశాం
నాకు ‘నేనే’, సంపూర్ణార్పణం!
~
నా ప్రైవెసీ నాదే, బోర్డ్ పెట్టను!
కానీ, నోఎంట్రీ జోనే! జాన్తేనై, క్యోం?!
~
ఏదైనా నీకైతే, దట్స్ నాట్ మై ప్రాబ్లెమ్!
ఎంతైనా చెప్పు, ఇట్స్ యువర్ ఒపీనియన్!
~
ఐ, మీ, మై సెల్ఫ్, మై లోకం ఎండ్స్!
పోతే పోతా, ఉంటే ఉంటా! కేర్ ఫ్రీ!
~
సెక్యూరిటీ?! నిలకడ?! డామిట్!?
జనరేషన్ గ్యాప్?! ఎస్, యూ గాటిట్?!
3
పరుగెక్కడికో పొల్పొలోమని
భయమేమో వెనకౌతామని!
~
మనుషుల్తో బహుతక్కువ దోస్తీ
శునకాల్తో బల్ సాథీ సాథీ!
~
సుప్రభాతం న్యూటన్ మొబైల్తోనే
పవ్వళింపూ, ఆ టాబ్, లాప్టాప్తోనే !
~
నేనంటా గోఆన్, ఆనండాన్ జానీ!
ఆన్‌లైన్లోనే ఏదేదైనా, సో ఈజీ!
4.
మీటింగ్లూ, చాటింగ్లూ, టార్గె ట్లబ్బబ్బ
ఊపిరికే టైంలేదు, న్యూ ‘టై’ లా, నో వే!
~
క్యారీర్ క్యారీర్ నా క్యారీర్, నాన్నా!
ఫస్ట్ర్యాంక్ దానికే, అదర్స్ షల్ వెయిట్!!
~
ఫుట్బాలే చూడాలా, నోలాన్నే చదవాలా
స్పేర్ టైమో లక్జరీ, ఇంట్రూజన్కి నో రూమ్!
~
ఓ మై గాడ్, అదంతా మీ టైమ్లో, అమ్మా
చూద్దాంలే, నాకమ్మాయ్ నచ్చాలిగా?!
5
వంటావార్పా?! వంటి ల్లో షోపీస్మాత్రం!
జొమాటో నా ఫటాఫట్మంత్రం!
~
వంటావార్పా?, ఏంటదమ్మమ్మా?
నెట్టత్తమ్మే! మా నవీన వేదం అమ్మా!
~
నీ ప్యాకేజీతో నాకేంటోయ్ ఘనం?!
నా పేకేజీ ధనాధనం, ఆటాడిచ్చేస్తా!
~
నువ్వూ తెస్తున్నావ్, నేనూను
అప్పుడప్పు డిటు రెండాకు లెక్కువే!
~
ఇక అంతా సమానమే, నా ఇష్టమె
నీ ఇష్టం! నీ ఇష్టం, అది నువ్జూస్కో!
~
కావాల్సిందేదో ఇట్టే కొనేస్కుంటా
ఇవాళ్టి రోజే నాదనుకుంటా!
~
పెళ్ళంటే, అబ్బో అన్వాంటె డ్బరువే
చూద్దాంలే, ఓ ముఫ్ఫై + దాటాక!
~
ఏ మాత్రం తెస్తాడు, ఆస్తేలావో?
మంచి?! చలి కాచుకోనా నాన్నా!
~
ఒదిగుంటే కలిసే! కాలర్ ఎగరేస్తే
సయొనోరా, ‘మా’ లేదు, విడి ఆకులే!!
~
పాత రోత సామాన్లుంటే నే నొప్పన్
అతను, నేనూ దట్సాల్, ఆలోవర్!
6
ఎప్పుడొస్తుందో రెపరెపలా పింక్డెవిల్
నే చెప్పుల్లో కాళ్ళతో!, నాదీ అయన్విల్!
~
ఈఎమ్మై, ఆ కార్డ్లూ, ఓ విల్లా, కార్లన్నీ
తప్పని పారాఫెర్నాలియా యూనో!
~
విటమిన్ M కోసం ఏ దూరమైనా,
ఎంటార్టికాకైనా, ఏ నూకైనా!
7
ఈ స్థితిలో పరుగెత్తక స్లో ఐపోతే
తాబేలే బైబై అని, నవ్వేస్తుందిక!
~
అంచేత, సింగిల్ గోల్- పర్గే పరుగు
నా కాప్షన్ లేదంటే, లేదంతే!
~
రన్ రన్ రన్, హే గై! స్పీడప్
రన్ రన్ రన్, హే గాల్! క్యాచప్!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here