సరిగ పదమని-10

0
12

[dropcap]’స[/dropcap]రిగ పదమని’ (మన రెక్కలు) అనే శీర్షికతో సంచిక పాఠకులకు రెక్కలని అందిస్తున్నారు పురాణం శ్రీనివాస శాస్త్రి.

~ ~

బావి నీరు, బండి చక్రం
విసుర్రాయి, రోలు రోకలి
అనాది కాలంలోనూ
అంతా సాంకేతికమే.

ఆలోచన చెట్టు
పళ్ళే పనిముట్లు!

~ ~

తిని కూర్చోనే
నిక్షేప రాయుళ్లు
సృష్టించినదే సుఖం
తీరిక దాని పైత్యం.

పనిమంతుడి సుత్తికి
తీరుబడి హతం!

~ ~

నిని పిండుకొని
ఆఫీసు పొమ్మంటే
ఆలింగ నామృతం
చిందిస్తుంది ఇల్లు.

అలసటలో ఊరట
గోడు వినే గూడు!

~ ~

లోక స్సమస్తాం
సుఖినో భవన్తు
ఆనందం చిరునామా
శ్రమే చూపించు.

స్వేదమే వేదమోయ్
నిత్యం స్మరించు!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here