సరిగ పదమని-13

0
5

[dropcap]’స[/dropcap]రిగ పదమని’ (మన రెక్కలు) అనే శీర్షికతో సంచిక పాఠకులకు రెక్కలని అందిస్తున్నారు పురాణం శ్రీనివాస శాస్త్రి.

~ ~

కారుల్లో… బైకుల్లో
సరాసరిగా అదే పరుగు
దూకుడు మంత్ర పఠనం
గాలిని మించే వేగం

దూసుకెళ్లేది భ్రమ
నడిచేవాడిదే ధీమా!

~ ~

పనీ పాటా
సార్థకతకు బాట
జీవన సాఫల్యతకు
ఊతమిచ్చే ఆట

స్వేదంతో మోదం
అదే సుమా వేదం!

~ ~

పనితో పయనిస్తూ
చెమటతో స్నానిస్తూ
సెలవుకే సెలవిస్తూ
కూర్చోడు వాడు

పరుగెత్తే కాలానికి
విసుగెత్తే క్షణమేదీ!

~ ~

విత్తు నాటి
మొక్క మొలిచి
పూత పూసి
పక్షి కూసి

కళ్ళు కాయలయ్యేను
చెట్టంతా పళ్ళేను!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here