సరిగ పదమని-16

0
8

[dropcap]’స[/dropcap]రిగ పదమని’ (మన రెక్కలు) అనే శీర్షికతో సంచిక పాఠకులకు రెక్కలని అందిస్తున్నారు పురాణం శ్రీనివాస శాస్త్రి.

~ ~

జగతి రంగస్థలి
షేక్‌స్పియర్ నోటి మాట..
కానీ ఆనాడే
అన్నమయ్య నోట పాట!

‘సర్వేశ్వరా అవధార
నీ జగము నాటకశాల’

~ ~

ట్టి
సృష్టికి
గట్టి..
పుష్టి –

మట్టి కోసం సృష్టి..
సృష్టి కోసం వృష్టి!

~ ~

రువు రాల్చిన ఆకు
చెరువు కార్చిన కన్నీరు
కష్టపాటు రైతుకు
ఉడతా భక్తి!

సుంతే కాని
ఎంతో శక్తి!

~ ~

బ్బులో పరుగు..
డబ్బు కోసం పరుగు..
డబ్బు వెంటే పరుగు..
డబ్బు లేని పరుగు..

వేగాలు వేర్వేరు..
తీరు తీన్‌ తారు!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here