సరిగ పదమని-18

0
7

[dropcap]’స[/dropcap]రిగ పదమని’ (మన రెక్కలు) అనే శీర్షికతో సంచిక పాఠకులకు రెక్కలని అందిస్తున్నారు పురాణం శ్రీనివాస శాస్త్రి.

~ ~

రెక్కలు తొడిగినా
రాయి ఎగరదు..
దారం కట్టినా
పక్షి ఆగదు!

సంకల్పం
కాదు కల్పితం!

~ ~

గ్రీష్ముడి కాపలాకు
గాడ్పుల గానం –
ఆకులు రాలకుండా
చెట్ల సభ తీర్మానం –

ప్రయోజనాలు వేరు –
ఘర్షణ తప్పదు!

~ ~

మృత్యువు అంత
ఈజీ కాదు.
అనుక్షణం
బతికితే గాని రాదు!

ప్రతి రెప్ప పాటు
తప్పించుకోవాలి కాటు!

~ ~

చింతకాయ
రాల్చని మంత్రం –
ఉత్పత్తి
సాగించే యంత్రం –

మధ్యలో మతి
తప్పించే తంత్రం!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here