సరిగ పదమని-22

0
9

[dropcap]’స[/dropcap]రిగ పదమని’ (మన రెక్కలు) అనే శీర్షికతో సంచిక పాఠకులకు రెక్కలని అందిస్తున్నారు పురాణం శ్రీనివాస శాస్త్రి.

~ ~

ద్దు చక్కెర…
తీపి విషమే మరి…
మధుమేహులకు
చెబుతాం నోరార –

‘ఘంటసాల గొంతు
వినకుండా ఎలారా?!’

~ ~

మ్యం చేరాక
జిజ్ఞాస
తీరిన వెదుకులాట
ఆరిన మంట –

అందే ఎత్తుల్లోనే
జ్ఞానం పంట!

~ ~

విత్ర స్నానం
పరిశుభ్ర స్నానం
పుణ్య స్నానం
సబ్బుల స్నానం

ఇన్నోటి ఉన్నా
స్వచ్ఛత సున్నా!

~ ~

కులే రాల్చుతూ
రూకలు రాల్చని
చెట్టుని కొట్టి
సొమ్ము చేసుకో!

రొక్కం చిక్కని
చక్కదనాలు కట్!

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here