సరిగ పదమని-23

0
8

[dropcap]’స[/dropcap]రిగ పదమని’ (మన రెక్కలు) అనే శీర్షికతో సంచిక పాఠకులకు రెక్కలని అందిస్తున్నారు పురాణం శ్రీనివాస శాస్త్రి.

~ ~
విలువలు హరిస్తే
వికృతి ప్రకోపం
హింస మంటల్లో
పెగలని ఆర్తనాదం…

సక్రమం లుప్తమైతే
అక్రమ పరాక్రమం!

~ ~

కొందరికి ఉంటుంది జీవితం –
ఉండదు జీవం..
ఉంటుంది రూపం –
ఉండదు రమ్యం..

ప్లాస్టిక్ తొండ
కాజాలదు ఊసరవెల్లి!

~ ~

లమే హలంగా..
కాగితమే పొలంగా..
శ్రమించే కర్షకుడు
కళారవి – కవి!

పదాలే సాగుబడి
పద్యాలే దిగుబడి-

~ ~

నిషి తయారయే
‘ధర్మాగారం’ స్త్రీ –
జన్మకారక నిష్టను
కామ దృష్టితో చూడకు…

ఇంగితం విడిచి
ఇంతితో బంతాటా?!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here