[dropcap]’స[/dropcap]రిగ పదమని’ (మన రెక్కలు) అనే శీర్షికతో సంచిక పాఠకులకు రెక్కలని అందిస్తున్నారు పురాణం శ్రీనివాస శాస్త్రి.
~ ~
డాక్టర్ దేముడు కాదు..
ఆసుపత్రి గుడి కాదు
మందులతో రాబడి చిందుల
రాబందు విందు –
ఔషధ రంగపు క్రీడ
ఔరా రోగుల పీడ
~ ~
కాపురం కావాలి
ఇద్దరికీ మధురం –
కాకూడదు ఏరికీ
కారే రుధిరం –
మోసే ధరాతలం
దంపతులకు ఆదర్శం!
~ ~
ఫ్యాషన్
నవతరం షాన్..
అదే వారి షైన్..
పెద్దోళ్లు పరేషాన్!
నేటి కొత్తదనం
నిన్ననే ఘనం!
~ ~
కంటికి కనిపించేదే
కాదు సృష్టి..
కనబడని చిత్రాలు
ప్రకృతిలో ఎన్నో..
వెతికితే కనిపించే అందాలు
చాటుమాటు స్వీటులు