సరిగ పదమని-5

0
9

[dropcap]’స[/dropcap]రిగ పదమని’ (మన రెక్కలు) అనే శీర్షికతో సంచిక పాఠకులకు రెక్కలని అందిస్తున్నారు పురాణం శ్రీనివాస శాస్త్రి.

 

కొట్టు… తిట్టు –
నరుకు… చంపు –
ఏడకెల్లొచ్చినవ్…
అక్కడికే పోరా బాద్ –

అసహనం
ఆరని కంపు!

***

క్షణాలు – నిమిషాలు
గంటలు – రోజులు
వారాలు – నెలలు –
ఏళ్లూ పూళ్లూ

ఎక్కి దిగే మెట్లు
సశేష విశేషాలు!

***

జీవచ్ఛవాలు బతికే ఉంటాయి
చంపాలి అనుకోరు ఎవరూ
కత్తికి కూడా లోకువ కనుక!
ప్రాణం మిగులును ఆవిరవక!

బతికుండే కన్న
బతుకుతో ఉంటే మిన్న!

***

రిగెడుతూ తాగే పాలు
ఒలకకుంటే చాలు
చేసే పనికి
చూడాలి వీలుసాలు!

గతి తప్పే చేష్టలు
అరరే అనిపించె రొష్టులు!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here