సరిగ్గా వ్రాద్దామా?-10

2
9

[box type=’note’ fontsize=’16’] తెలుగులో అక్షర దోషాలు, ఇతర తప్పులు లేకుండా ఎలా వ్రాయవచ్చో ఈ శీర్షిక ద్వారా తెలియజేస్తున్నారు శ్రీమతి నండూరి సుందరీ నాగమణి. [/box]

~

[dropcap]ఈ[/dropcap]రోజు పాఠంలో కూడా కొన్ని కంప్యూటర్ విషయాలే ముచ్చటించుకుందాము. మీ అందరికీ హస్త భూషణంగా మారిపోయిన మొబైల్లో వ్రాయటం మీకు అలవాటు అయిపోయింది. ఇందులో కూడా వర్డ్ డాక్యుమెంట్, గూగుల్ డాక్స్ వంటి కొన్ని సౌలభ్యాలున్నప్పటికీ సిస్టమ్‌లో వ్రాయటం చాలామందికి ఉపయోగంగా ఉంటుందని నా భావన.

సిస్టమ్ ఉండీ మొబైల్లో వ్రాస్తున్న వారు, ఇప్పుడు తమ వ్రాతలను సిస్టమ్‌లో వ్రాయటం అలవాటు చేసుకుంటే చాలా వేగంగాను, కరెక్ట్ గానూ వ్రాసుకోగలుగుతారు. ఇప్పటికే మొదలు పెట్టిన వారికి అభినందనలు. మిగిలిన వారు కూడా ప్రయత్నం చేయండి.

ఇప్పుడు కంప్యూటర్‌లో వ్రాసుకొనేటప్పుడు వాడుకొనే కొన్ని కమాండ్స్ గురించి తెలుసుకుందాము.

కొన్ని సౌకర్యాల కోసం కీ బోర్డు లోని కొన్ని బటన్స్ నొక్కాలి.

వ్రాసిన మేటర్ కుడి వైపు రావటానికి – ఉదా: ఉత్తరంలో తేదీ, మరియు స్థలము –

CONTROL + R

ఎడమవైపు రావాలంటే :

CONTROL + L

మధ్యలోకి రావాలంటే (సెంటర్. ఉదా: కథా శీర్షికలు):

CONTROL + E

వ్రాసిన విషయం కాపీ చేసుకోవాలంటే:

CONTROL + C

కాపీ చేసిన విషయం పేస్ట్ చేయాలంటే

CONTROL + V

వ్రాసిన విషయం ఒక చోట కట్ (డిలీట్) చేసి, మరో చోట పేస్ట్ చేసుకోవాలంటే:

CONTROL + X మరియు,

CONTROL + V

(ఒకదాని తరువాత మరొకటి)

వ్రాసిన మేటరు సేవ్ చేయాలంటే:

CONTROL + S

పొరపాటేదైనా చేస్తే, అది తొలగించి తిరిగి యథాతథంగా ముందున్న స్థితికి రావాలంటే

(దీనినే అన్‌డూ అని కూడా అంటారు.):

CONTROL + Z

వ్రాసిన మేటర్ ని ప్రింట్ చేయాలంటే

CONTROL + P

వ్రాసిన మేటర్ లో ఏదైనా పదాన్ని లేదా వాక్యాన్ని ఎక్కడెక్కడ ఉందో చూడాలంటే (Find)

CONTROL + F

అక్షరాలు ప్రస్ఫుటంగా (Bold) చేయటానికి:

CONTROL + B

అక్షరాలు అండర్ లైన్ చేయటానికి:

CONTROL + U

అక్షరాలు వంపుగా (Italics) పడటానికి:

CONTROL + I

మొత్తం మేటరంతా సెలెక్ట్ చేయటానికి:

CONTROL + A

ఒక్కోసారి కొన్ని పదాలు మార్చవలసి ఉంటుంది. ఉదాహరణకు ఒక కథలో కథానాయకుడి పేరు రమేష్ అని వ్రాస్తాము. తరువాత అది నచ్చక దాన్ని శంకర్‌గా మార్చాలనుకుంటాము. ఈ సందర్భంలో రమేష్ అని ఉన్న పదాలన్నింటినీ ఒక్కొక్కటిగా శంకర్ అని మార్చవలసిన పని లేదు. అన్నీ ఒకేసారి మార్చేయగలము CONTROL + H (Find & Replace) అనే కమాండ్ ద్వారా.

కొంత మేరకు మాత్రమే మేటర్‌ని సెలెక్ట్ చేయాలంటే – ఏ మేటరైతే చేయాలో అక్కడ కర్సర్ పెట్టి, షిఫ్ట్ బటన్ మరియు యారో బటన్స్‌తో సెలెక్ట్ చేసుకోవాలి. అవసరాన్ని బట్టి ఈ మేటర్‌ని తొలగించటమో, కాపీ చేయటమో చేసుకుంటాము.

అలాగే మనం వ్రాస్తున్న లైన్ మొదలుకి వెళ్ళాలంటే HOME బటన్నూ, చివరికి వెళ్ళాలంటే END బటన్నూ ఉపయోగించాలి. అదే డాక్యుమెంట్ యొక్క మొదటి భాగానికి వెళ్ళాలంటే

CONTROL + HOME ను, చివరి భాగానికి వెళ్ళాలంటే CONTROL + END అనే కమాండ్ ను ఉపయోగించాలి. ఇక పేజీ పై భాగానికి వెళ్ళటానికి PAGE UP,  పేజీ చివరి భాగానికి వెళ్ళటానికి PAGE DOWN (ఈ బటన్స్ కంప్యూటర్ కీ బోర్డ్ లోనే ఉంటాయి, గమనించండి.) ఉండనే ఉన్నాయి కదా.

ఈ కమాండ్స్ చూసి భయపడకండి. ఇవన్నీ మన సేవకై సాంకేతికత ఇచ్చిన వరాలు! చేసే కొద్దీ అలవాటు అవుతాయి మనకు. కథలు, నవలలు కంప్యూటర్‌లో వ్రాసుకొనే రచయితలకు ఎంతో సమయాన్ని ఆదా చేసే ఉపకరణాలివి. వీటిని గురించి తెలుసుకొని, ఆచరిస్తే మనకెంతో ఉపయోగంగా ఉంటుందని ఈ వారం ఇవి మీకు చెప్పాను.

వచ్చే భాగంలో మరిన్ని విషయాలు ముచ్చటించుకుందామా?

అప్పటివరకూ శలవా మరి?

*

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here