సరిగ్గా వ్రాద్దామా?-8

0
5

[box type=’note’ fontsize=’16’] తెలుగులో అక్షర దోషాలు, ఇతర తప్పులు లేకుండా ఎలా వ్రాయవచ్చో ఈ శీర్షిక ద్వారా తెలియజేస్తున్నారు శ్రీమతి నండూరి సుందరీ నాగమణి. [/box]

~

[dropcap]ఈ[/dropcap] రోజు పాఠంలో మనం కథను కంప్యూటర్‌లో ఎలా వ్రాయాలో నేర్చుకుందాము.

సాధ్యమైనంత వరకూ మనం మొబైల్‌లో కాకుండా కంప్యూటర్ – డెస్క్‌టాప్ లేదా ల్యాప్‌టాప్ లలో వ్రాయటానికి ప్రయత్నించాలి. ఎందుకంటే, కథ వ్రాయటం కోసం మనం ఒక డాక్యుమెంట్ అనేది తెరచుకోవాలి. మైక్రోసాఫ్ట్ వర్డ్ డాక్యుమెంట్ యాప్ మొబైల్ లోనైనా వేసుకోవచ్చు. కానీ మేనేజ్ చేయటం చాలా కష్టం అవుతుంది. నేను అందుకనే డెస్క్‌టాప్ లో కానీ, ల్యాప్‌టాప్‌లో కానీ చేసుకుంటాను.

ముందుగా మనం ఒక వర్డ్ డాక్యుమెంట్‌ను తెరచుకోవాలి. ఇందుకు గాను మనం కంప్యూటర్ యొక్క డెస్క్‌టాప్ మీదికి వెళ్ళి, (డెస్క్‌టాప్ అంటే, కంప్యూటర్ పైన ఉన్న స్క్రీన్.) మౌస్‌తో రైట్ క్లిక్ (కుడివైపు క్లిక్) చేయాలి. అక్కడ చాలా ఆప్షన్స్ వస్తాయి. మీరు ‘న్యూ ఆఫీస్ వర్డ్ డాక్యుమెంట్’ అనున్నది సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు మీకు ఒక ఖాళీ పేపర్ లాంటిది ఓపెన్ అవుతుంది. ఇది ఒక తెల్ల కాగితంలాగా, మీరు దీనిపై వ్రాసుకోవటానికి సిద్ధం అయిందన్న మాట.

అయితే మీరు ఇందులో టైప్ చేయగానే తెలుగు అక్షరాలు రావు. ఇంగ్లీష్ మాత్రమే వస్తుంది. దీనికోసం మీరు తెలుగు అక్షరాలను ఇచ్చే సాఫ్ట్‌వేర్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి. ప్రముఖ్ లేదా, లేఖిని లేదా, మైక్రోసాఫ్ట్ తెలుగు లేదా గూగుల్ ఇన్పుట్స్ తెలుగు – వీటిల్లో ఏవైనా డౌన్‌లోడ్ చేసుకోవాలి. అయితే చాలామందిమి ప్రముఖ్ వాడుతున్నాము. ఇది చాలా సులభం – డౌన్‌లోడ్‌కీ, వ్రాసుకోవటానికి కూడా. అంచేత గూగుల్ లోకి వెళ్ళి, ఈ యూఆరెల్ ను సెర్చ్‌లో టైప్ చేస్తే (https://www.pramukhime.com/windows-application) మీకు డౌన్ లోడ్ చేసుకోవటానికి వీలు అవుతుంది. ఆ… డౌన్‌లోడ్ చేసేసుకున్నారా? ఇప్పుడు మీకు టైప్ చేసుకోవటానికి తెలుగు ఫాంట్స్ రెడీగా ఉన్నాయి. ఈ తెలుగు ఫాంట్స్ మీకు ఆఫ్‌లైన్‌లో కూడా వ్రాసుకోవటానికి ఉపకరిస్తాయి.

జనరల్‌గా అన్నీ చోట్లా గౌతమి ఫాంట్ (బై డీఫాల్ట్) ఉంటుంది. ఇంకా వేరే ఫాంట్స్ కావాలంటే అవి కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఉదాహరణకు నేను ‘మల్లన్న’ అనే ఫాంట్ వాడుతాను. ఆ డౌన్‌లోడ్ గురించి తరువాత చెప్పుకుందాము.

ఇప్పుడు మీరు తెరచి ఉన్న డాక్యుమెంట్‌లో వ్రాయటం మొదలు పెట్టవచ్చు. ఇందుకు ముందుగా మీరు సిస్టమ్‌లో రెడీగా ఇంగ్లీష్ ఉన్నదా, లేక తెలుగు ఉన్నదా అని చూసుకోవాలి. కంప్యూటర్‌లో కింద మీకు లాంగ్వేజ్ బార్ అనేది కనిపిస్తుంది. ఇంగ్లీష్ అయితే Eng అని, తెలుగు అయితే ‘తె’ అని కనిపిస్తుంది. ‘తె’ అనేది ఉన్నదో లేదో చూసుకుని టైప్ చేయటం మొదలు పెట్టండి.

ఎలా టైప్ చేయాలి?

ఇది ట్రాన్సిలిటరేషన్ మోడ్‌లో ఉంటుంది. అంటే మనం ఇంగ్లీష్‌లో టైప్ చేస్తుంటే తెలుగులో వస్తూ ఉంటుంది. a టైప్ చేస్తే తెలుగులో అ పడుతుంది. A టైప్ చేస్తే తెలుగులో ఆ పడుతుంది. అలాగే క కావాలంటే k, ఖ కావాలంటే kha, కా కావాలంటే kaa లేదా kA ఇలా టైప్ చేయవలసి ఉంటుంది. ముందుగా ప్రాక్టీస్ చేసుకోవాలి. ఏదైనా తెలుగు మ్యాటర్‌ని తీసుకుని, ఖాళీ డాక్యుమెంట్ తెరచుకుని టైప్ చేయటం సాధన చేసుకోవాలి. ఒక రెండు రోజులు చేస్తే చాలు కీ బోర్డ్ అలవాటు అయిపోతుంది. ఏ అక్షరం కావాలంటే ఏది టైప్ చేయాలో విడిగా చెబుతాను.

టైప్ చేస్తున్నప్పుడు ఎప్పటికప్పుడు సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకోవాలంటే కంట్రోల్ బటన్, ‘s’ బటన్ ఒకే సారి నొక్కాలి. ఎప్పటికప్పుడు సేవ్ చేసుకోకపోతే మ్యాటర్ అంతా డిలీట్ అయే ప్రమాదం చాలా ఉంది. ఈ కమాండ్స్ గురించి కూడా ఉత్తరోత్తరా చర్చించుకుందాము.

ఇప్పుడు ముందుగా మీరు నేర్చుకోవలసింది – డాక్యుమెంట్ ఓపెన్ చేయటం, తెలుగు సాఫ్ట్‌వేర్ డౌన్‌లోడ్ చేసుకోవటం. కథలను మొబైల్‌లో టైప్ చేయకండి. సేవ్ చేసుకోవటం కష్టం. అదీ కాక, అంత వర్క్ మొబైల్‌లో చేయటం మన ప్రధాన ఇంద్రియానికి ఎంత మాత్రం మంచిది కాదు.

ఇవన్నీ చేసుకున్న తరువాతే కథలు వ్రాయటం మొదలు పెట్టండి. మరి ఈ పని మీద ఉంటారా? విజయోస్తు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here