శతక పద్యాల బాలల కథలు-2

0
11

(బాలబాలికల కోసం శతక పద్యాల లోని పద్యాల ఆధారంగా కథలని అందిస్తున్నారు శ్రీమతి ధర్మవరపు చాముండేశ్వరి)

అపకారికి నుపకారము

[dropcap]శ[/dropcap]తక పద్య కథలు వినటానికి పిల్లలతో పాటుగా వచ్చిన పెద్దల్ని ప్రేమగా మేడ మీద ఉన్న పెద్ద హాల్ లోకి తీసుకువెళ్లారు అమ్మమ్మ. అందరు కూర్చున్న తరువాత అమ్మమ్మ కథ మొదలు పెట్టారు.

“పిల్లలూ, మీరు మీ అమ్మ వాళ్ళని తీసుకు వచ్చినందుకు I am happy. మీకు doubts వస్తే వాళ్ళు చెబుతారు. మీకు ఎవరైనా సహాయం.. help చేస్తే మీరు ఏమిచేస్తారు?” అని పిల్లల్ని అడిగారు.

అందరు ఒక్కసారిగా “థాంక్స్ చెబుతాము అమ్మమ్మా! వాళ్లకి అవసరం అయితే హెల్ప్ చేస్తాము” అని అన్నారు.

“అమ్మమ్మా! నేను స్కూల్‌కి వెళ్లనప్పుడు హరిత నాకు నోట్స్ ఇచ్చింది. నేను హరిత లంచ్ బాక్స్ మర్చిపోతే లంచ్ షేర్ చేశాను” చెప్పాడొక అబ్బాయి.

“గుడ్. మరి ఎవరైనా మిమ్మల్ని హర్ట్ చేస్తే వాళ్లకి హెల్ప్ చేస్తారా?”

“నో. నహీ”

“అవునా? మనకి హెల్ప్ చేసిన వాళ్లకి help చెయ్యటం మామూలే. బట్ మనకి నచ్చని, చెడు చేసిన, చెయ్యాలనుకున్న వాళ్ళు కష్టంలో ఉన్నప్పుడు సాయం చెయ్యటం very great thing అని ఈ poem లో బద్దెన చెప్పారు. విందామా”

‘ఉపకారికి నుపకారము

విపరీతము కాదు సేయ వివరింపంగా

నపకారికి నుపకారము

నెపమెన్నక సేయువాడె నేర్పరి సుమతీ!’

~

“ఇతరులు ఎవరైనా సహాయం కోరినప్పుడు మనం వారికి సహాయం చేస్తుంటాం. మళ్లీ మనకు అవసరం వచ్చినప్పుడు వారు తిరిగి సహాయం చేస్తారు. ఇందులో పెద్ద విశేషమేమీ లేదు. ఎందుకంటే ఇది అందరూ చేసేదే. మనకు సహాయం చేసిన వారి రుణం తీర్చుకోవడం కోసం ఇలా చేస్తారు. అలాకాక మనకు ఎవరో ఒకరు అపకారం చేసిన వారుంటారు. వారికి ఎప్పుడో ఒకప్పుడు మన అవసరం వస్తుంది. అటువంటప్పుడు మనం వారు చేసిన తప్పును ఎత్తిచూపుతూ వారికి సహాయం చేయకుండా ఉండకూడదు. వారు తెలియక తప్పు చేశారులే అని మంచిమనసుతో భావించి, ఆపదలో ఉన్నప్పుడు తప్పకుండా సహాయం చేయాలి. అటువంటివారే నేర్పరులవుతారని బద్దెన ఈ పద్యంలో వివరించాడు” చెప్పారు అమ్మమ్మ.

“అమ్మమ్మా కథ! స్టోరీ!” అన్నారు పిల్లలు. అమ్మమ్మ నవ్వి చెప్పడం మొదలుపెట్టారు

***

“అదొక పెద్ద దట్టమైన అడవి. థిక్ ఫారెస్ట్. ఆ అడవిలోకి దగ్గర్లో ఉన్న ఒక గ్రామం నుండి రోజు ఒక వేటగాడు.. హంటర్.. వేటకు వెళ్ళేవాడు. కనిపించిన జంతువులు, పక్షులు, చేపలు అన్నింటిని వేటాడి పట్టి ఊరికి తీసుకువెళ్లి అమ్మేవాడు. వేటగాడు అంటే అడవిలోని జంతువులన్నిటికి భయం, అసహ్యం, కోపం. వాడికి దొరక్కుండా ఉండటానికి ట్రై చేసేవి.

“అమ్మమ్మా! వేటగాడు చెడ్డవాడా.. cruel fellow?”

“Yes. వాడికి జాలి.. kindness తెలీదు. రాక్షసుడు.. monster. ఒక రోజు అడవిలో వేటకోసం తిరుగుతూ డీప్ జంగల్ లోకి వెళ్ళిపోయాడు. సడన్‍గా వాన మబ్బులు.. black clouds వచ్చాయి. night set అయింది. అది చూసిన హంటర్ ‘అయ్యో! చీకటి పడిపోతుంది. ఇల్లు చాలా దూరం. నైట్ సేఫ్‌గా ఎక్కడ ఉండాలి?’ అనుకున్నాడు.”

వాన, ఉరుములు మెరుపులు మొదలు అయ్యాయి. దగ్గర్లో కనిపించిన పెద్ద చెట్టు కిందకు వెళ్లి hunting tools, పంజరం పక్కనే పెట్టుకుని ముడుచుకు కూర్చున్నాడు.

పెద్ద వాన. చలి స్టార్ట్ అయింది. అడవిలో తిరిగి అలసిపోయి, ఆకలి వేసింది. ఆ చెట్టు మీద ఒక చిలుకల జంట ఇల్లు కట్టుకుని ఉంది.

ఇంట్లో ఉన్న మగ చిలుక కిటికీ లోంచి బైటకు చూస్తూ “దేవుడా! ఎంత పెద్ద వాన. ఈ వానలో నా భార్య ఎక్కడ చిక్కుకుందో? ఎలా ఉందో? ఇంటికి రాగలదా?కాపాడు” అని గట్టిగా ప్రార్థించింది.

చెట్టు కింద వేటగాడి పంజరంలో ఉన్న ఆడ చిలుక ఆ మాటలు వింది.

“ఓహ్! My hubby! don’t worry నేను చెట్టు కింద కూర్చున్న పంజరంలో బందీగా ఉన్నాను” అంది

మగ చిలుక ఆ మాటలకు చెట్టు కిందకు చూసింది. భార్య కనపడింది. వేటగాడిని చూసి కోపంతో తిట్టింది. భార్యను విడిపించాలని అటు ఇటు చూసింది.

ఆడ చిలుక భర్తతో “పాపం! వేటగాడు ఆకలితో, చలితో బాధపడుతున్నాడు. మన ఇంటికి వచ్చాడు. మన అతిథి. సాయం చెయ్యి” అంది.

“వేటగాడికి సాయమా.. హెల్ప్ టు హంటర్? నో. వాడు మన శత్రువు. నిన్ను చంపేస్తాడు. నిన్ను పట్టుకున్నాడు” అంది కోపంగా మగ చిలుక.

“అయ్యో! కోపంలో మర్చిపోతున్నావు, శత్రువైనా కష్టంలో ఉంటే సాయం చెయ్యాలని పెద్దలు చెప్పారు. ముందు హెల్ప్ చెయ్యి. నాకేమి కాదు.” అంది.

“సరే నాకు ఇష్టం లేకున్నా, నువ్వు చెప్పవని హెల్ప్ చేస్తా” అని మగ చిలుక వేటగాడి దగ్గరకు వచ్చింది.”

“అయ్యో! అమ్మమ్మా! ఆలా ఎందుకు చేసింది. ఫూల్. వాడు చంపేస్తాడు. వద్దని చెప్పాలి. సేవ్ చెయ్యాలి” అంది కంగారుగా ప్రకృతి అనే అమ్మాయి.

“ఓ వేటగాడా! నేను నా భార్య ఈ చెట్టు మీద గూటిలో ఉంటాము. మీరు మా అతిథి. ఐ విల్ హెల్ప్ యూ” అంది మగ చిలుక వేటగాడితో.

“అర్ యూ కిడ్డింగ్? తుఫాను వానలో చలికి ఆకలికి ఇబ్బంది పడుతున్నా, చలికి వణికిపోవడం కనపడటం లేదా? నువ్వో పక్షివి. నాకేమి చేయగలవు? వెళ్ళు వెళ్ళు, లేదంటే నిన్ను పట్టుకుంటా” అన్నాడు కోపంగా వేటగాడు.

ఆ మాటలు విన్న మగ చిలుక రివ్వున గాల్లోకి ఎగిరివెళ్లి ఎండు పుల్లలని తెచ్చి కుప్పగా పోసింది. వానలో ఎండు పుల్లలు ఎక్కడివి? అని మీ డౌట్ కదా! పాపం ఆ పక్షి తన గూడుని కూల్చేసి తెచ్చింది. మళ్ళీ వెళ్లి వెలుగుతున్న ఒక పుల్లని తెచ్చి పుల్లలని వెలిగించింది. క్యాంప్ ఫైర్‌లా ఆ మంట మండుతుంటే వేటగాడు దగ్గరగా వెళ్లి కూర్చుని చలి కాచుకున్నాడు.

“తర్వాత ఏమైంది అమ్మమ్మా?” అడిగారు పిల్లలు.

“అప్పుడు ఆ హంటర్.. హు హు హమ్మా ఎంత హాయిగా ఉందో చలి మంట. వేడి వేడి ఫుడ్ ఉంటే ఇంకా బాగుంటుంది” అన్నాడు.

“అయ్యా! మీకు ఎలాంటి ఫుడ్ ఇవ్వాలో నాకు తెలీదు. ఐ డోంట్ నో. నా దగ్గర eggs కూడా లేవు” అంది మగ చిలుక బాధగా.

“ఐడియా! నేను ఉన్నాను. నన్ను తినండి” అంటూ మంట లోకి దూకింది.

“హంటర్ stun అయిపోయాడు. పక్షిని సేవ్ చెయ్యాలి అనుకునే లోపలే అది చనిపోయింది. అయ్యో! ఎంత మంచి పక్షి. శత్రువుని అని కూడా చూడకుండా నా కోసం ఆహరంలా అయ్యింది. ఎంత త్యాగం? నేను ఇక నుంచి హంటింగ్ మానేస్తున్నాను. ఎవ్వరిని చంపను. I am bad guy” అంటూ hunting tools ని మంటలో వేసాడు. పంజరంలో ఉన్న ఆడ చిలుకని “సారీ! బర్డ్. నౌ యూ అర్ ఫ్రీ!” అని వదిలేసాడు.

మంటలో కాలిపోతున్న భర్తని చూసిన ఆడ చిలుక “ఓహ్! దేవుడా! నన్ను కూడా నా భర్త దగ్గరికి తీసుకువెళ్ళు” అంటూ వేటగాడితో “అయ్యా! నా భర్త త్యాగం వృథా అవకుండా నన్ను, నా భర్త మాంసాన్ని తిని వాన తగ్గక క్షేమంగా ఇంటికి వెళ్ళండి” అంటూ మంట లోకి దూకింది.

“వాటికి తాను శత్రువు అయినా తన ఆకలి తీర్చటానికి చనిపోయిన పక్షులని చూసి, బాధపడి, సిగ్గుపడి వేట మానేసి అడవిలో ఉన్న జంతువులకు స్నేహితుడు అయ్యాడా వేటగాడు” అని అమ్మమ్మ కథ ముగించారు.

“Kids, let us have a small break” అన్నారు అమ్మమ్మ.

“ఓకే దెన్. తరువాత few more stories” అన్నారు కోరస్‍గా.

“ఇవాళ్టికి చాలు. రేపు చెబుతాను” అన్నారు అమ్మమ్మ.

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here