శతక పద్యాల బాలల కథలు-4

0
10

(బాలబాలికల కోసం శతక పద్యాల లోని పద్యాల ఆధారంగా కథలని అందిస్తున్నారు శ్రీమతి ధర్మవరపు చాముండేశ్వరి)

తల నుండు విషము ఫణికి

[dropcap]ప్ర[/dropcap]కృతి అమ్మమ్మ చెప్పే శతక పద్యాలూ, మీనింగ్స్, కథలు వినటానికి ప్రకృతి, మానస్‍తో పాటుగా వాళ్ళ ఫ్రెండ్స్.. నేస్తాలు కూడా రెడీ అయ్యారు. వాళ్ళతో పాటుగా అమ్మ నాన్నలు కూడా వచ్చి మేడ మీది హాల్‍లో వినటానికి కూర్చున్నారు.

అమ్మమ్మ, పరి అదేనండి ప్రకృతి అమ్మ ప్రియ, అక్కడున్న అందరికి అరటి ఆకు గిన్నెలో ఉడికించి తాలింపు వేసిన శనగలు ఉల్లిపాయలు, కర్వేపాకు వేసి yummy గా చేసి తెచ్చియిచ్చారు. నాన్న తాత నిమ్మరసం తెచ్చారు.

అందరికీ ఇచ్చారు .

“పిల్లలు! రెడీ! శనగలు, నిమ్మ రసం హెల్త్‌కి మంచివి. బలం. తింటూ పద్యం, కథ వినండి” అని మొదలు పెట్టారు అమ్మమ్మ. మనమూ విందామా?

***

తలనుండు విషము ఫణికిని

వెలయంగా దోకనుండు వృశ్చికమునకున్

తలతోక యనక యుండును

ఖలునకు నిలువెల్ల విషము గదరా సుమతీ

~

భావం: పాముకి దాని పడగలో విషం ఉంటుంది. తేలుకి కొండిలో ఉంటుంది. కాని మనిషికి మాత్రం తల, తోక అనే భేదం లేకుండా శరీరమంతా ఉంటుంది. పాముకి కోరలు తీసేస్తే ఇంక దాని శరీరంలో ఎక్కడా విషం ఉండదు. అదే విధంగా తేలుకి తోక తీసేస్తే దాని శరీరంలోనూ ఇంకెక్కడా విషం ఉండదు. కాని మనిషికి మాత్రం అలా కాదు. అక్కడ ఇక్కడ అనే భేదం లేకుండా దుష్టుని శరీరమంతా విషం వ్యాపించి ఉంటుంది అని దుర్గుణాలు ఉన్న మనుషుల గురించి కవి ఈ పద్యంలో వివరించాడు.

***

“అంటే?” అంది పరి.

“అంటే! పాముకి తలలో poison ఉంటుంది. దాన్ని skillful గా పిండేస్తారు. అప్పుడు ఆ పాము కొన్నాళ్ళు విషం లేనిదిగా అవుతుంది. కానీ కొన్ని సార్లు మంచివాడులా కనిపించేవాడు కూడా పాము కన్నా విషపు ఆలోచనలతో మనకి చెడు చెయ్యవచ్చు. కథ వినండి” అన్నారు అమ్మమ్మ.

~

ఒక ఊరిలో ఒక పేద రైతు.. poor farmer ఉండేవాడు. మంచి వాడు. అతని పొలంలో పంటలు.. crops సరిగ్గా పండక నష్టం.. loss వస్తోందని బాధ పడేవాడు. ఒకరోజు పొలం గట్టు మీద ఉన్న వేప చెట్టు.. neem tree కింద కూర్చుని పంట బాగా పండాలని అనుకుంటూ అలసిపోయి నిద్రపోయాడు.

“పిల్లలు మీరు బాగా ఆటలు ఆడితే ఎలా అలసిపోతారో అలాగే. అదికాక ఎండగా ఉన్నప్పుడు పెద్ద చెట్టు నీడలో చల్లని గాలిలో కూర్చుంటే భలే నిద్ర వస్తుంది. ఏసీ పనికిరాదు. ఏదో చప్పుడు వినిపించి రైతు నిద్రలో ఉలిక్కిపడి లేచాడు. అటు ఇటు చూసాడు. What’s that? అని. కొద్ది దూరంలో ఉన్న పుట్ట దగ్గర పెద్ద పాము కనిపించింది. అది చూసి రైతు లేచి నుంచున్నాడు. భయపడ్డాడు. పాము తనవైపు రాకపోవటం చూసి ధైర్యం తెచ్చుకున్నాడు.

పాముకి దండం పెట్టాడు.”

“అమ్మమ్మా! నమస్తే పెడితే పాము వెళ్లిపోతుందా?”

“నమస్తే పెట్టినా, పెట్టకపోయినా వెళ్ళిపోతుంది.”

“మరి farmer ఎందుకు నమస్తే పెట్టాడు?”

“కిడ్స్! మన పెద్దవాళ్ళు ప్రకృతిని చాలా గౌరవించేవాళ్ళు. పర్యావరణంలో అన్ని ప్రాణులకు సమాన హక్కు.. equal right ఉందని చెప్పటానికి, నేచర్‌ని సేవ్ చెయ్యటానికి స్నేక్, ఎలిఫెంట్ దేవుళ్ళని, పులి, నెమలి లాంటివి వాహనాలని చెప్పారు. నా ప్రకృతి కథలు వినండి మీకు అర్థం అవుతుంది. Let us come to the story” అన్నారు అమ్మమ్మ,

రైతు పాముకి దణ్ణం పెట్టి ‘దేవుడు పాములా వచ్చినట్లున్నాడు. నేను ఎప్పుడు పాముకి పాలు పోయలేదు. అందుకే కాబోలు నా పొలంలో పంటలు సరిగా పండడం లేదు’ అనుకున్నాడు.

 రైతు గబగబా ఇంటికి వెళ్లి ఒక గిన్నెలో పాలు తీసుకు వచ్చి పుట్ట దగ్గర పెట్టి “ఓ! పాము రూపంలో ఉన్న దేవుడా! నన్ను క్షమించి పాలు తాగు. నాకు పాము అంటే భయం. అందుకే ఇంతకు ముందు నీకు పాలు పోయలేదు. దయచేసి పాలు తాగి నన్ను దీవించు” అని గిన్నె పెట్టి ఇంటికి వెళ్ళిపోయాడు.

పుట్టలో ఉన్న పాము ‘పాపం ఇతను ఉత్త అమాయకుడులా ఉన్నాడు. నన్ను దేవుడు అనుకుంటున్నాడు. సాయం చెయ్యాలి’ అనుకుంది.

మర్నాడు పుట్ట దగ్గరికి వచ్చిన రైతు గిన్నె శుభ్రం చేసి పాలు పోయాలని చూస్తే ఆ గిన్నెలో.. guess what? బంగారు నాణెం golden coin కనిపించింది. రైతు సంతోషించాడు. Snake god likes me అనుకున్నాడు.

రోజు రైతు గిన్నెలో పాలు పెడితే తాగేసిన పాము బంగారు నాణెం ఇచ్చేది. రైతు వాటిని భద్రంగా దాచిపెట్టేవాడు.

ఒక రోజు రైతు వేరే ఊరికి వెళ్ళాల్సి వచ్చింది. It’s urgent. He can’t say no.

మరి పాముకి పాలు ఎవరు పొయ్యాలి? గోల్డ్ కాయిన్ ఎలా? అని చాలా సేపు ఆలోచించి చివరికి కొడుకుని పిలిచి – “నేను వచ్చేవరకూ రోజూ పొలం దగ్గరున్న పుట్ట ముందు గిన్నెలో పాలు పెట్టాలి. మర్చిపోవద్దు. సరేనా?” అని చెప్పాడు.

“సరే! నాన్న గారు. మీరు చెప్పినట్లు చేస్తాను” అన్నాడు.

మర్నాడు రైతు కొడుకు పాల గిన్నె పుట్ట దగ్గర పెట్టాడు. తర్వాత వచ్చి చూసేసరికి గిన్నెలో బంగారు నాణెం కనిపించింది.

“Wow gold coin” అని హ్యాపీగా తీసుకుని గిన్నెలో పాలుపెట్టి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్లకుండా స్నేహితులతో వెళ్లి పార్టీ చేసుకుని గోల్డ్ కాయిన్ ఖర్చు చేసాడు. తరువాతి రోజు కూడా మరో బంగారు నాణెం ఇచ్చింది పాము. అది తీసుకున్న రైతు కొడుక్కి దురాశ కలిగింది. ‘రోజూ బంగారు నాణెం ఇస్తోంది అంటే పుట్టలో బోలెడు బంగారం ఉండి ఉంటుంది’ అనుకుని నాన్న వచ్చేలోగా పుట్ట తవ్వి పాముని చంపి బంగారం తీసుకోవాలని ప్లాన్ చేసాడు. మర్నాడు పాముకి గిన్నెలో పాలుపెట్టి చెట్టు వెనక్కి వెళ్లి దాక్కున్నాడు.

తండ్రి కొడుకులని స్నేహితులని నమ్మిన పాము పుట్టలోంచి పాలు తాగట్టానికి వచ్చింది. రైతు కొడుకు గొడ్డలితో పాముపై దాడి చేసాడు. పాము తెలివిగా తప్పించుకుని పుట్టలోకి వెళ్ళిపోతూ రైతు కొడుకు కాలి మీద కాటు వేసింది. వాడు చనిపోయాడు.

అది విన్న రైతు ఊరినుండి వెంటనే ఇంటికి వచ్చాడు. జరిగింది తెలిసి చాలా బాధపడ్డాడు. మర్నాడు పుట్ట దగ్గరికి పాలు తీసుకుని వెళ్ళాడు.

“ఓ! దైవమా! నేను, నా కొడుకు రోజూ నీకు పాలుపోస్తున్నాము కదా? ఎందుకు నా కొడుకుని చంపావు?” అన్నాడు ఏడుస్తూ కోపంగా.

అందుకు పాము జరిగింది చెప్పింది. “ఓ రైతూ! మీలాంటి మనుషుల్ని నమ్మకూడదని తెలిసింది. మీకు అత్యాశ.. గ్రీడ్ ఎక్కువ” అంది.

“క్షమించు! ఇకనుంచి రోజు నేనే పాలు తెస్తాను. జరిగింది మర్చిపో. దయచేసి బంగారం ఇవ్వు” అన్నాడు రైతు.

“సిగ్గులేదు నీకు. నేను నిన్ను నమ్మను. నాకు విషం తలలో, తేలుకి తోకలో ఉంటుందని భయపడి చంపుతారు. కానీ మీలాంటి మనుషులకు శరీరం అంతా విషమే. చెడు బుద్ధులే. పుట్టవదిలి నీకు దూరంగా వెళ్ళిపోతున్నాను” అని తిట్టి వెళ్ళిపోయింది పాము.

***

కథ ముగించిన అమ్మమ్మ “పిల్లలు రేపు వచ్చేటప్పుడు పద్యాలూ నేర్చుకు రండి. బాగా చెబితే prizes ఇస్తా” అన్నారు. “ఓకే ఓకే!” అంటూ పిల్లలు పరిగెత్తారు.

మనం రేపు వద్దామా కొత్త పద్యం, కథ వినటానికి?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here