శతక పద్యాల బాలల కథలు-7

0
6

(బాలబాలికల కోసం శతక పద్యాల లోని పద్యాల ఆధారంగా కథలని అందిస్తున్నారు శ్రీమతి ధర్మవరపు చాముండేశ్వరి)

లావు కలవాని కంటే

[dropcap]ప[/dropcap]ది రోజులుగా కురుస్తున్న ముసురు వానలు తగ్గాయి. ఎండ వచ్చింది. పిల్లలు ఆరుబయట ఆడుకోవటానికి హాయిగా ఉంది.

సాయంత్రం పిల్లలు పెద్దలు ఎప్పటిలా ప్రకృతి వాళ్ళింటికి వచ్చారు. ఎందుకో తెలుసుగా? అమ్మమ్మ చెప్పే శతక పద్య కథలు వినటానికి. ఇవ్వాళ అమ్మమ్మ చెప్పే కథ విందామా?

ఆంటీ పిల్లలకు అందరికి తినటానికి వడపప్పు, పానకం ఇచ్చారు. అమ్మమ్మ వచ్చి దీపం పెట్టాకా అందరు కొద్దిసేపు ఎప్పటిలానే ధ్యానం చేశారు.

“పిల్లలూ! పద్యం వినటానికి రెడీనా?” అన్నారు అమ్మమ్మ.

“ఓ! వుయ్ అర్ రెడీ అమ్మమ్మా” అన్నారు పిల్లలు కోరస్‍గా.

“అయితే సరే వినండి” అంటూ ముందు పద్యం చెప్పారు అమ్మమ్మ.

~

పద్యం:

లావు గలవాని కంటెను
భావింపంగ నీతిపరుడు బలవంతుడౌ
గ్రావంబంత గజంబును
మావటి వాడెక్కినట్లు మహిలో సుమతి

భావం:

పెద్ద కొండ లాంటి ఏనుగును దానికంటే చిన్నవాడైన మావాటి లోబరుచుకుని ఎక్కుతున్నాడు. కనుక మావటివాడు గొప్పవాడు. అలాగే శరీర బలం ఉన్నవాడికంటే బుద్ధిబలం కలవాడే నిజమైన బలవంతుడు.

~

“పిల్లలూ, ఎప్పుడైనా దగ్గర్నుండి ఏనుగుని, దాన్ని నడిపే మావటిని చూసారా?”

“ఏనుగు ఎంతో ఎత్తుగా బలంగా ఉంటుంది కదా అమ్మమ్మా” అన్నది ప్రకృతి.

“అవును. దాన్ని నడిపే మావటి మీ డాడీలా మాములుగా ఉంటాడు. కానీ తన స్కిల్, ఒడుపు, తెలివితో ఏనుగుని కంట్రోల్ చేస్తాడు. అందుకే పెద్దలు దేహబలం కంటే బుద్ధి బలం గొప్పది అన్నారు.”

“అమ్మమ్మా స్టోరీ ప్లీజ్!” అన్నాడో పిల్లాడు.

“ఓకే. వినండి” అంటూ కథ చెప్పడం మొదలుపెట్టారు అమ్మమ్మ.

***

ఒక ఊరిలో అసుర అనే వేటగాడు.. హంటర్ ఉండేవాడు. పక్షుల్ని వేటాడటంలో నేర్పరి.. ఎక్సపర్ట్. వాడికి జాలి దయ అంటే తెలీదు. వెరీ క్రూయల్. వాడికి నేను చాలా బలవంతుడిని వెరీ స్ట్రాంగ్ అని గర్వం. ఒకరోజు అసుర దగ్గర్లో ఉన్న అడవిలోకి వెళ్లి పక్షులు ఎక్కువగా తిరిగే చోట నేలమీద గింజలు చల్లి వాటికి కనపడకుండా నెట్.. వల పరిచాడు. చెట్టు వెనక్కి వెళ్లి దాక్కున్నాడు. ఆకాశంలో ఎగురుతున్న పావురాల గుంపులో ఉన్న ఒక చిన్న పక్షికి గింజలు కనిపించాయి. ఆనందంతో అది “హుర్రే! ఫుడ్” అని అరిచింది. మిగతా పక్షులు నేల మీదకు చూశాయి. వాటికీ బోలెడు గింజలు కనిపించాయి. అవి కూడా ఆనందంతో రెక్కలు టపటపా కొట్టాయి. నేల మీదకు దిగటం మొదలుపెట్టాయి.

ఆ పక్షుల గుంపులో ఉన్న ఒక ముసలి పక్షి.. ఓల్డ్ బర్డ్.. “ఫ్రెండ్స్! వద్దు. ఆ గింజలు ఒక ట్రాప్‌లా అనిపిస్తోంది. అడవిలో ఒకచోట అన్ని గింజలు కుప్పలా ఉండవు. మోసం. వద్దు. నా మాట వినండి” అంది.

పక్షులు ఫుడ్ దొరికిందన్న హ్యాపీనెస్‌లో ఆ బర్డ్ మాట వినలేదు.

“తాతా! నువ్వు ఎప్పుడూ ఇంతే. అనుమానంతో ఆపుతావు. మేము వెళ్తున్నాము” అని విసుక్కున్నాయి. గింజల మీద వాలగానే అవి కెవ్వుమని కేకలు పెట్టాయి. వాటికీ మోసం అర్థం అయింది.

బట్ లేట్. అన్ని వేటగాడి వలలో చిక్కుకు పోయాయి. ఎంత ట్రై చేసిన బయట పడలేదు.

పక్షులు అన్ని ఓల్డ్ బర్డ్‌తో “తాతా! మమ్మల్ని క్షమించు. ఐడియా చెప్పు. సేవ్ చెయ్యి” అని అడిగాయి.

అందుకు ఆ బర్డ్ “ఓకే! ఒక ఐడియా ఉంది. వేటగాడు వస్తున్నాడు. మనల్ని పట్టి పంజరంలో పెట్టకముందే అందరం కలిసి ఒక్కసారిగా 123 అంటూ గాల్లోకి ఎగరాలి. నెట్‌ని కూడా పైకి లేపాలి. భయం వద్దు. రెడీ” అంది.

పక్షులు ముందు భయపడిన ప్రాణం కోసం అన్నీ ఒక్కసారిగా నెట్‌తో సహా గాల్లోకి ఎగిరాయి. అక్కడికి వచ్చిన వేటగాడు నెట్‌ని పట్టుకోవాలని ట్రై చేసాడు. బాణం తీసి పక్షుల వైపు వేసాడు. నో యూస్. పక్షులు నెట్‌తో పాటు దూరంగా సేఫ్‌గా వెళ్లిపోయాయి.

వేటగాడికి చాల కోపం వచ్చింది, బాధ కలిగింది. నెట్ కూడా పోవటంతో కొత్త వల కొనేదాకా వేట వీలు కాదు.

వలతో పాటు గాల్లో ఎగురుతున్న పక్షులు ఓల్డ్ బర్డ్ సలహాతో వాటి స్నేహితుడు ఎలుక దగ్గరకు వెళ్లి, పిలిచాయి. మబ్బులా వచ్చిన పక్షుల నెట్ నీడను చూసి భయపడి కలుగులో దాక్కున్న ఎలుక బైటకు చూసింది. దానికి ఓల్డ్ బర్డ్ కనిపించి జరిగింది చెప్పి నెట్ లోంచి బైటకు తియ్యమని రిక్వెస్ట్ చేసింది.

ఎలుక తన పళ్లతో వలను కొరికి ముక్కలు చేసింది. పక్షులన్నీ “మమ్మల్ని స్వేచ్ఛగా ఎగిరేలా సాయం చేసావు. ధన్యవాదాలు” – అని థాంక్స్ చెప్పి ఎగిరిపోయాయి.

***

“పిల్లలూ! నేను గ్రేట్, స్ట్రాంగ్, ఇంటెలిజెంట్ అని ప్రౌడ్‌గా ఫీల్ అయిన వేటగాడి కంటే బలంలో, సైజులో చాలా చిన్నవి అయిన బర్డ్స్ బుద్ధిబలం గొప్పది. మిగతా బర్డ్స్‌ని డేంజర్ నుంచి సేవ్ చేసిన ఓల్డ్ బర్డ్ తెలివి గొప్పది. అందుకే ఎవ్వరిని తక్కువగా, మనల్ని ఎక్కువగా అంచనా వేసుకోవద్దు. డోంట్ అండర్ ఎస్టిమేట్ ఎనీ వన్” అన్నారు అమ్మమ్మ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here