సత్యాన్వేషణ-37

1
8

[box type=’note’ fontsize=’16’] ఇది ఆత్మాన్వేషణ. ఇది సత్యాన్వేషణ. సత్యాన్వేషణ పథానికి మార్గదర్శనం చేసే గురువు అన్వేషణ. సంధ్య యల్లాప్రగడ స్వీయానుభవ కథనం. [/box]

[dropcap]అ[/dropcap]క్కడ తరువాత మహా చైత్రాలు నిర్మించబడ్డాయి. బుద్ధుని గుర్తుగా స్తూపము నిర్మించబడింది. ముష్కురుల దాడిలో నేల మట్టమైన ఆ పూరతన శిధిలాలో అశోకుని ధర్మ చక్రము చెక్కు చెదరకపోవటము విచిత్రము. అది మనకు అద్దాల బీరువాలో అక్కడి మ్యూజియములో కనపడుతుంది. కొంత సేపు అక్కడ గడిపి నేను తిరిగి నేను వున్న సత్రానికి వెళ్ళిపోయాను. నాకు కాశీలో తిరగటానికి ఆ ఒక్కరోజే వుండినది. తరువాత కుదరలేదు.

మరునాడు శివరాత్రి కదా. నేను లేచే సరికే హడావిడి. ఆ ఉదయము నేను వారాహి మాతా దర్శనము చేసుకో గలిగాను. రెండు రుద్రాక్ష మాలలు తీసుకున్నాను.

నేన్ను గంగ వడ్డుకు ఉదయము పది గంటలకు రమ్మని చెప్పారా పండితులు. నేను నా కార్యక్రమాలు తీర్చుకొని గంగాతీరానికి వెళ్ళాను. అక్కడ పది మంది మహామహులు దీక్షా వస్రాలలో కూర్చున్నారు. రుద్రహోమము చేశారు. ఆ హోమము చూడటానికి చాలా మంది విదేశీయులు జతకూడారు. ఈ ఋత్వికుల వేషము వారి వస్త్రాలు చూస్తూ చాలా మంది ఫోటోలు తీసుకున్నారు. ఆ వచ్చిన వాళ్ళలో ఒక విలేకరి కూడా వున్నాడు. ఆయన వీడియోలు, ఇంటర్యూ గట్రా తీశారు.

హోమము తరువాత దానము ఇత్యాదివి చేశారు. తరువాత నన్ను మణికర్ణికా ఘాటుకు తీసుకుపోయారు. అందులో మునిగాము అందరమూ.

తడి బట్టలతో బయటకు వచ్చాక మంత్ర దీక్షలు వంటి కార్యక్రమాలు సాగాయి. తదనంతరము అందరూ బోటులో కొంత సేపు తిరిగారు. నేను ఆ బోటులో వుండిపోయాను. పండితులతో వచ్చిన వారి స్త్రీలు కూడా నాతో బోటులో వుండిపోయారు. మేము బోటులో మళ్ళీ ఘాటులన్నీ తిరిగి చూచాము.

గంగాతీరమంతా ఘాట్లు, భవనాలతో నిండి వుంది. ప్రతి రాజుకు ఒక విశ్రాంతి భవనము, హడావిడి వున్నాయి. మేము అటు ఇటు తిరిగి వడ్డుకు వచ్చాము. మా అందరి తడి బట్టలూ పొడిగా అయ్యాయి.

మణికర్ణికా ఘాటులోనే మునకలు వెయ్యటానికి కారణము ఆ ఘాటుకున్న ప్రత్యేకత. ఆ ఘాటు ఏర్పడటానికి రకరకాల కథలు ప్రచారములో వున్నాయి. అందులో ఒకటి అక్కడ గంగలో స్నానము చేస్తుంటే అమ్మవారి చెవి దుద్దు పొయ్యిందని. దానికై వెతికితే దొరకలేదని. అందుకే మణికర్ణికా అయ్యిందని. మరో కథనము ప్రకారము విష్ణువు తన చక్రముతో ఆ ఘాటును త్రవ్వినాడని. అందుకే ఆ పేరు వచ్చిందని.

ఆ ఘూటుకు ప్రక్కనే మణికర్ణిక శ్మశానవాటిక. యుగాల నుంచి నిరంతరము అక్కడ శవాలు కాలుతూ వున్నాయి. ఆ మరుభూమిలో నిప్పు ఆరదని మహాదేవుని మాట అట. అందుకే అక్కడ నిరంతరము ఒక్క శవమైనా కాలుతూ వుంటుంది. ఆ రుద్రభూమిలో కాలిన వారికి మరి జన్మ వుండదట. అందుకే ఆ భూమిలో మరణించాలని చాలా మంది తమ అంత్యకాలము కాశిలో గడపటానికి వెడతారు. చావును కూడా దైవికముగా చూసే సంస్కృతి.

అవి కూడా చూసి నేను మిగిలిన స్త్రీలతో కలసి గంగ నుంచి రోడ్డు మీదకు వచ్చాను. విపరీతముగా జనము. దాదాపు 15 మైళ్ళు వరకూ వరుసలు.

పండాలు వచ్చి “500 ఇస్తారా?” అంటూ బేరాలు. నేను తల అడ్డముగా వూపి నాకు సర్వత్రా శివుడే అని చెప్పి వచ్చేశాను. రూములో పడుకున్నా తోచలేదు. కాశీ వంటి భూలోక కైలాసములో శివరాత్రి వంటి అద్భుత తరుణములో పడుకోవటమేమిటని మళ్ళీ రోడు మీదకొచ్చాను. ఆ గది దేవాలయము వెళ్ళే సందు ముందర వుంది.

బయట వరుసలు వరుసలుగా భక్తులు. ఎప్పటికి వారికి దర్శనమో మరి.

ఇంతలో మరో పాండా వచ్చి “దీదీ రా దర్శనము చేసుకుందువు” అన్నాడు.

“ఎంత ఇవ్వాలో” అన్నాను నిరాసక్తిగా.

“ ఏమీ వద్దు. నీవు రా” అన్నాడు అతను.

“సరే” అన్నాను. మరో ఐది నిముషాలలో అక్కడా ఇక్కడా తిప్పి లోపలకి తీసుకుపోయాడు. నా చేతిలో మళ్ళీ పాల గ్లాసు పెట్టాడు. నేను శివునకు అభిషేకము చేశాను. నన్ను ఎవరో బయటకు లాగారు. ఎంత వేగముగా లాగారంటే నే వచ్చి గుడి బయట పడ్డాను. నాకు ఏమీ అర్థమవలేదు ఒక్కక్షణం. నేను పది నిముషాలలో దర్శనము అభిషేకము చేసుకున్నాను. పండా కనపడితే దక్షిణ ఇవ్వాలనుకున్నా. అతను తరువాత కనపడలేదు, వెతికినా.

నేను గంగ వడ్డుకు నడిచాను. కొంత సేపటికి పండితులందరూ వచ్చారు. ఈ సారి వాళ్ళు హోమము కాదు 365 చిన్న శివలింగాలు చేశారు. దానికి గాను పుట్టమట్టిట తెచ్చారు. ఆ శివలింగాలను శివాకృతిలో సర్ది గంగను తెచ్చి రుద్ర నమక చమకాలతో అభిషేకము మొదలెట్టారు. ఆ అభిషేకము మధ్యలో కుంభవృష్టిగా మెరుపులు ఉరుములతో వాన. కొంత సేపటికి వాన తగ్గాక మళ్ళీ ఆ అభిషేకము కొనసాగించారు. అనంతరము ఆ శివలింగాలను గంగలో కలిపారు. అర్ధరాత్రి కావస్తుండగా మెల్లగా దేవాలయము వైపుకు వెళ్ళాము. భక్తులు తగ్గారు. యోగులు, అఘోరాలుట ఎవ్వరికి కనపడరు. కేవలము అర్ధరాత్రి వేళ మాత్రమే భయటకు వస్తారట. కొందరు కౌపీనదారులు కొందరు నలుపు వస్త్రాలు కట్టి గులాము చల్లుతూ వచ్చారు. దేవుని మంటపములో బయటా గులాము చల్లి శివుని దర్శించుకు వెళ్ళారు. వారు వచ్చేటప్పుడు దర్శనమును ఆపివేశారు. మరురోజు గుడిలో పూర్తిగా నేలంతా గులాబి రంగులో అద్ది వుంది.

దర్శనము తరువాత నేను బ్యాగు సర్దుకుంటుంటే పండితుల వారి భార్య చెప్పింది – ఒక్క చీరనన్నా తీసుకోమ్మా, ఇది ప్రతి స్త్రీకి పుట్టినిల్లు యని. నేను దారిలో షావు నుంచి రెండు చీరలు తీసుకొని వచ్చేశాను ఎయిర్‌పోర్టుకు.

నేను రాగలనా అనుకున్న ప్రయాణాన్నీ ఏర్పాటు చేసి, నాకు ఎయిర్‌పోర్టులో స్వామి దర్శనము ఇప్పించి (లేకపోతే నాకు తెలిసేదీ కూడా కాదుగా వారు వారణాసి వచ్చారని) నాకు సాధనలో మెలుకువులను బోధించి, శివరాత్రికి నన్ను చేరపిలచి అభిషేకం చేసుకునే అదృష్టమిచ్చి నన్ను తన కరుణా సముద్రములో నింపిన దేవదేవుని లీలను ఆశ్చర్యముతో కన్నులు విప్పుకు చూస్తూ వుండిపోయాను. ఇవ్వనీ ఆలోచిస్తే అంతా ఎంతటి పటిష్టమైన ప్లానుగా తోచింది. నేనెంత నిమిత్తమాత్రురాలిని. నా పాత్ర ఏమిటో ఈ జీవిత సమరములో తెలియదు. కానీ నడిపించే ప్రభువు ఆయనై వుండగా నేను ప్లానులు వెయ్యటము వంటి అతివాద వేషాలు వెయ్యటము పరమ వృథా. అన్నీ నా మంచికే అనుకోవటమే కాదు అది నిజమని అనుభవపూర్వకముగా తెలిసిందిగా ఇప్పుడు…. ఇలా నా ఆలోచనలు విమానములా ఎగిరాయి.

విశ్వంజీ దర్శనము

ఆయన ముందు నేలపై కూర్చుని వున్నాను. అది అట్లాంటా సబర్బులలో వున్న ఒక నైబర్‌హుడ్. వారు మాకు తెలిసినవారు. దత్త భక్తులు. వారింటికి దత్తావతారముగా భక్తులచే కొలవబడే శ్రీ విశ్వంజీ విచ్చేసి వున్నారు. ఆయన వచ్చారని దర్శనము చేసుకోమని నాకు మిత్రులు సలహా ఇచ్చారు. వారి గురించి నాకు తెలిసినంత వరకూ సర్వము ఒక్కటేనని ప్రేమగా వుండమని చెబుతారు….

ఆయన దత్త ప్రసాదముగా వారి తల్లి తండ్రులకు జన్మించారు.

గుంటూరు వారి జన్మస్థలము. శ్రీ ఆంజనేయులు, వరలక్ష్మమ్మ గార్లు వారి తల్లి తండ్రులు. తండ్రిగారు దత్త భక్తులు. తండ్రి ఒకసారి వ్యాపార నిమ్మిత్తమై వారణాసికి వెడితే, ఆయనకు ఒకరోజు విశ్వనాథుని నుంచి ఒక కిరణము తనలో కలసిపోవటము జరిగింది. ఆ రోజే వారి భార్య విశ్వంజీని కన్నది. విశ్వనాథ ప్రసాదముగా భావించి విశ్వనాథశాస్త్రి అని పేరు పెట్టారాయన కుమారునికి. చదువులలో చురుకుదనము చిన్ననాటి నుంచే వుండేది వారికి. గణితములో బి.ఏ చేసి టీచరుగా మంచి పేరుతెచ్చుకున్నారాయన.

1965 లో ఆయన దత్త సంప్రదాయములోని శ్రీ శ్రీధరు మహారాజ్ గారి వద్ద నుంచి మంత్రోపదేశము పొందారు. మంత్రముతో పాటే వారికి గురువు శక్తిపాతము కూడా ఇచ్చారు. కఠిన బ్రహ్మచర్యముతో 21 సంవత్సరాలు దీక్షతో ఆయన మంత్రము సాధన చేశారు.

కోరిన వారికి ఆయన కల్పవృక్షమై నిలచి, దత్త సాంప్రదాయాన్ని నిలుపుతూ, ప్రజలలో భక్తిని నింపుతున్నారు. వారు భక్తుల నుంచి కేవల దత్తావతారముగా పూజలందుకుంటున్నారు. వారి ముఖ్య ఆశ్రమము గుంటూరులో వుంది.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here